
why small cap mutual funds generates more profits
స్టాక్ మార్కెట్‌లో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు అప్పటికే బాగా అభివృద్ధి చెందినవై ఉంటాయి. వాటిలో లాభాలు స్థిరంగా, ఒకేలా ఉంటాయి. వీటిలో ఆటుపోట్లకు, నష్టాలకు అవకాశం తక్కువ. వీటి ఆధారంగా లార్జ్‌క్యాప్ ఫండ్స్, బ్లూచిప్ ఫండ్స్ వంటి మ్యూచువల్ ఫండ్స్ పనిచేస్తాయి. అందుకే వీటిలోనూ స్థిరంగా కొంత తక్కువ శాతం లాభాలు వస్తాయి. వీటిలో నష్టభయం కూడా చాలా తక్కువ. ఫ్లక్చువేషన్ కూడా పెద్దగా ఉండదు. కానీ వీటికి పూర్తి భిన్నంగా పనిచేసేవే స్మాల్ క్యాప్ ఫండ్స్.
fluctuations in market only creates high returns
ఫ్లక్చువేషన్ వల్లే..
మనం దీర్ఘకాలంలో మార్కెట్లు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలనుకుంటే మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలు కాబట్టి ఇంకా ఎదుగుదలకు చాలా అవకాశం ఉంది. అందుకే ఇంకా ఎక్కువ లాభాలను సంపాదించగలవు. అందుకే కంపెనీ గ్రోత్, షేర్ ప్రైస్ కూడా విపరీతంగా పెరగొచ్చు. అదే స్థాయిలో ఈ కంపెనీలు వెనక్కు కూడా వెళ్లగలవు. బాగా పతనమై నష్టాలబాట పడతాయి. విపరీతంగా ఫ్లక్చువేషన్‌కు గురవుతాయి. అందుకే ఇలాంటి ఒడిదొడుకులను ఆసరాగా చేసుకుని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసి లాభాలను తెచ్చి పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈ ఫండ్స్ అన్నింటి కంటే ఎక్కువ లాభాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. మన ఇండియాలో ఎక్కువశాతం స్మాల్ క్యాప్ కంపెనీ లు ఉంటాయి. ఇండియాలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కలిపి 250 కంపెనీలు ఉంటాయి. మిగిలిన కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ కేటగిరిలోకి వస్తాయి. మనం నిఫ్టీ ఈటీఎఫ్, నిఫ్టీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి.
what are the best small cap mutual funds
మనం యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ పాసివ్ ఫండ్స్ తీసుకుంటే, ఖచ్చితంగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ పాసివ్ ఫండ్స్ ని బీట్ చేస్తాయి. మనం ఎప్పుడైనా మార్కెట్ నుంచి ఎక్జిట్ అయ్యేటపుడు, ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు మాత్రమే బయటకి రావాలి. మన ఇండియాలో టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో దేనిలోనైనా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు చాలా లాభదాయకమైనవి. దీర్ఘకాలంలో ఈ ఫండ్లు చక్కని లాభాలను జనరేట్ చేస్తున్నాయి.
Sbi small cap fund
quant small cap fund
Nippon india small cap fund
kotak small cap fund
Axis small cap fund..
పైన చెప్పిన ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు సుమారు18 నుంచి 20 శాతం వరకూ లాభాలను స్థిరంగా ఇచ్చాయి.. ఇస్తున్నాయి కూడా..
దీర్ఘకాలం ఓపికతో వేచి చూసే వారికి , బలమైన ఆర్థిక లక్ష్యం ఉన్నవారికి స్మాల్ క్యాప్ ఫండ్లు అనేవి పెట్టుబడికి సరైన వేదికలు.