
link pan number to lic policy
రిటైల్ విభాగంలో తన పాలసీదారుల కోసం ఎల్ ఐ సీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి ,షేరు ధరలో 5-10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ సమయంలో ఇన్నాళ్ళు పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్ఐసీలో వాటాదారులుగా మారేందుకూ, రాయితీలో షేర్లను దక్కించుకునేందుకు వీటిని ఓ సారి పరిశీలించుకోవాలి.
lic ipo need pan link
మీరు ఎల్ఐసీ పాలసీకడుతూ ఐపీవోలో పాల్గొనాలంటే మీ పాన్ కార్డు నెంబర్ ను ఎల్ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే పాలసీకి ఆధార్ ను జత చేయడం ద్వారా ఎల్ఐసీ ఆన్లైన్ వెబ్ సైట్ లో అనేక లావాదేవీలు చేసేందుకు సులభంగా ఉంటుంది.
* మొదట మీరు డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలి.
* ఎల్ ఐ సీ పాలసీ ఏక్టివ్‌గా ఉండాలి.
* ఎంత తక్కువ ప్రీమియం అయినా పాలసీ ఉంటే చాలు.
* రెండు మూడు పాలసీలు ఉన్నా ఒక సారి మాత్రమే దరఖాస్తు చేసుకోగలం.
ఎల్ఐసీ తన పాలసీదారులకు షేర్లను కేటాయించేందుకు పాన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది. పాన్ ను నమోదు చేసేందుకు ముందుగా ఎల్ఐసీ అధీకృత వెబ్ సైట్ http//licindia.in/
లోకి వెళ్లండి . అక్కడ ఆన్ లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అనే లింకు కనిపిస్తుంది.
how to link lic policy to pan number
licindia.com – online pan rigistration – click here – proceed – date of birth…. ఇక్కడి నుంచి ఇలా డీటెయిల్స్ ను ఫిల్ చేసి అక్కడున్న సమాచారాన్ని చదవండి. అడిగిన వివరాలను నమోదు చేయండి. మీ పాన్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. దీనికన్నా ముందు ఎల్ఐసీ వెబ్ సైట్లో మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్ లైన్ యూజర్ ఖాతాను సృష్టించుకోండి. దీనివల్ల మీ పని ఇంకా సులభం అవుతుంది.
ఇక ఐపీవోలో షేర్ల కోసం దరఖాస్తు చేయాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాల్సిందే. పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు. వీటితో డీమ్యాట్ ఖాతా తీసుకోవడం సులభం. మీకు డీమ్యాట్ ఖాతా లేకపోతే.. చివరి వరకూ ఎదురుచూడకుండా మీకు నచ్చిన స్టాక్ బ్రోకర్ ద్వారా వెంటనే దీన్ని తీసుకోండి