
what is demat account
డీ మ్యాట్( డీ మెటీరియలైజడ్) అకౌంట్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకునేవారికి చాలా అవసరం. డీ మ్యాట్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించలేం.
ఒకప్పడు స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలన్నీ ఫిజికల్ గా జరిగేవీ. పేపర్లు, డాంక్యుమెంట్లపై రాసుకుని షేర్లను కొనుక్కునేవారు. వీటినే షేర్ సర్టిఫికేట్స్ అనేవారు. అప్పట్లో కంప్యూటర్లు, ఆన్‌లైన్ వంటి సదుపాయాలు లేవు కాబట్టి స్టాక్ బ్రోకర్లంతా ఒక చోటుకు చేరి క్రయవిక్రయాలు చేసేవారు. వాటి తరఫున ఇన్వెస్టర్లకు పేపర్లు ఇచ్చేవారు. తర్వాత షేర్లను అమ్మాలంటే ఈ పేపర్లను ఇవ్వాల్సిందే. ఈ షేర్ సర్టిఫికెట్లు పోతే చాలా ఇబ్బందయ్యేది. తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, ఇప్పడు మొబైల్‌ఫోన్‌లలో కూడా ట్రేడింగ్ చేసుకుంటున్నారు.
how to open demat account
ఇప్పడు డీ మ్యాట్ అకౌంట్ తెరవడం చాలా సులభమైంది. అనేక బ్రోకరేజీ సంస్థలు డీమ్యాట్ అకౌంట్లను అందిస్తున్నాయి. దీనికి ఆధార్, పాన్ కార్డ్, ఫోటో, సంతకం, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా డీ మ్యాట్ అకౌంట్ తెరుచుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్ అనే ఆప్షన్ కింద లింక్ ద్వారా కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
* ఒకరు ఎన్ని డీమ్యాట్ అకౌంట్‌లనైనా కలిగి ఉండవచ్చు. ఒక సంస్థలో ఒక అకౌంట్ మాత్రమే సాధ్యమవుతుంది. వేరు వేరు బ్రోకరేజీ సంస్థలనుంచి వేరు వేరు గా అకౌంట్‌లు తెరవవచ్చు.
* డీ మ్యాట్ అకౌంట్ మెయింటెనెన్స్‌కు నెలవారీ లేదా సంవత్సర చార్జీలు ఉంటాయి.
ప్రతి ట్రేడ్‌కు చార్జీలు వసూలు చేస్తారు. దీనిని బ్రోకరేజీ అంటారు. ఇది కాకుండా అదనంగా చాలా ట్యాక్సులు మనం చెల్లించాల్సి ఉంటుంది. ట్రేడ్‌ల సంఖ్య పెరిగే కొద్దీ చార్జీలు పెరుగుతాయి.what is the use of demat account
* డీ మ్యాట్ ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, డెలివరీ, ఇన్వెస్ట్‌మెంట్.. ఇలా అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్టమెంట్ చేసుకోవచ్చు.
* కేవలం మ్యూచువల్ ఫండ్స్ లో ఇ న్వెస్ట్ చేయాలంటే మాత్రం డీ మ్యాట్ అక్కర్లేదు. బయట నుంచి మామూలుగా చేసుకోవచ్చు.
* నిఫ్టీ ట్రేడ్, ఈటీఎఫ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కు డీ మ్యాట్ ఉండాల్సిందే.
* డీ మ్యాట్ అకౌంట్ అందించే బ్రోకరేజీ సంస్థల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఫుల్ టైం బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్.. మన అవసరాలకు తగ్గట్టుగా మనం వాటిని ఎంచుకోవచ్చు.