ఇంట్రాడే లో ఇండికేటర్లు ముఖ్యం
what are the indicators in intraday
మిగిలిన వారితో పోలిస్తే ఇంట్రాడేలో రిస్క్ ఎక్కువ. నష్టభయం కూడా నిత్యం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. అందుకే మార్కెట్‌లు ఎప్పటికప్పుడు ఎగిసి పడుతూ ఉంటాయి. మనం ఎంచుకున్న స్టాక్స్‌పైనా ఈ ప్రభావం ఉంటుంది. ప్రతి రోజూ ఉండే ఈ ఫ్లక్చువేషన్ ను ఇంట్రాడే ట్రేడర్లు ఎదుర్కోక తప్పదు.
what is need of indicators
ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలను బుక్ చేసుకోవాలంటే చాలా వర్క్ చేయాలి. కొన్ని ఇండికేటర్లను ఫాలో కావాల్సిందే. రాబడులు పెంచుకోవడానికి ఖచ్చితంగా ఒక వ్యూహం అనుసరించినప్పడు ఇండికేటర్లు ఉపయోగపడతాయి.
* రోజు వారి ట్రేడర్స్ గా విజయం సాధించడానికి, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. డే ట్రేడింగ్ సరిగ్గా నిర్వహించకపోతే ట్రేడర్ల ఆర్థిక పరస్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది. తక్కువ కాలంలోనే భారీ లాభాలను పొందాలనుకునే ట్రేడర్లకు పూర్తిగా అవగాహన లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ హానికరం. ఒకే ట్రేడ్ పై వారి మొత్తం ట్రేడింగ్ పెట్టుబడిలో రెండు శాతానికి పైగా రిస్క్ చేయకూడదు.
* ఇంట్రాడేలో చార్టులను విశ్లేషించుకుంటూ ఉండాలి. మార్కెట్ ఓపెనింగ్, క్లోజింగ్ ధరలను వివరిస్తూ మార్కెట్ దిశను అంచనా వేయడానికి చార్టులు ఉపయోగపడతాయి.
important indicators in intraday
కొన్ని ఇండికేర్లు ఇలా..
* మూవింగ్ ఏవరేజ్
* ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ ఔట్ (ఓఆర్ బీ)
* సప్పోర్ట్, రెసిస్టెన్స్ ను తెలుసుకోవడం
* డిమాండ్- సప్ప్లై అసమతుల్యత
* రిస్క్ రివార్డ్ రేషియా ఎంచుకొనుట
Leave a Reply