
what are the best mutual funds
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మెంట్ ప్రారంభించాలనుకున్నా, లేదా మీ పోర్టుఫోలియోను మరోసారి సవరించుకోవాలనుకున్నా కొత్త మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బాగా లాభాలను ఇచ్చిన కొన్ని ఫండ్స్‌ను ఈ సంవత్సరంలో పెట్టుబడుల కోసం నిపుణులు సూచిస్తున్నారు.
మన మ్యూచువల్ ఫండ్స్ పోర్టిఫోలియోను ఎప్పటికప్పడు సమీక్షించుకోవాలి. అందులో అన్ని రకాల ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన ఫండ్స్ ఉంటే మనం లాభాలను కోల్పోవాల్సి వస్తుంది.
ఈ దిగువ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఒకసారి పరిశీలించవచ్చు.
Sbi Focused equity fund
Axis Bluechip Fund
Mirae Asset Large Cap Fund
Parag Parikh Long Term Equity Fund
UTI Flexi Cap Fund
Axis Midcap Fund
Axis Small Cap Fund
SBI Small Cap Fund
SBI Equity Hybrid Fund
Mirae Asset Hybrid Equity Fund
how to choose best mutual fund
* మీపెట్టుబడిలక్ష్యం, రిస్క్ ప్రొఫైల్ కు సరిపోతుందో లేదో పరిశీలించాలి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లలోకి కొత్తగా వచ్చిన వారికి అగ్రెసివ్ హైబ్రిడ్ పధకాలు సరైనవి. ఈ పధకాలు ఈక్విటీ(65-80 శాతం) డెట్(20-35 శాతం) మిశ్రమంలో పెట్టుబడి పెడతాయి. ఈ హైబ్రిడ్ పోర్ట్ ఫోలియో కారణంగా అవి స్వఛ్ఛమైన ఈక్విటీ పథకాల కంటే రిస్క్ తక్కు వుగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడిదారులకు అగ్రెసివ్ హైబ్రిడ్ పథకాలు ఉత్తమ పెట్టుబడి సాధనం.
* సురక్షితమైన పథకాల కోసం లార్జ్ క్యాప్ ను ఆశ్రయించడం మంచిది. ఈ పథకాలు టాప్ 100 స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి.
which fund is suitable to you
* ఒక సాధారణ ఈక్విటీ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే అలాంటి వారికి ప్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్.
* మిడ్ క్యాప్ పథకాలు మీడియం సైజ్ కంపెనీలలో, స్మాల్ క్యాప్ పథకాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చిన్న కంపెనీలలో పెట్టిబడులు పెడతాయి.
* వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీకు ఎలాంటి పథకం అవసరం అవుతుంది.. మీ ఆర్థిక లక్ష్యాలేంటి, మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి తదితర విషయాలను పరిశీలించి ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
* ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్ సలహాదారుని సహాయం తీసుకోవాలి.