
స్టాక్‌మార్కెట్ పై ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది. ఎవరి మీదా ఆధారపడకుండా, ఎవరి కిందా పనిచేయకుండా స్వతంత్రంగా బతకాలనుకునే వారు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌ను ఫుల్ టైం కెరియర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చాలా సందేహాలు కలుగుతున్నాయి. కెరియర్‌గా ఎంచుకుంటే ఆదాయం సమకూరుతుందా..? పూర్తిగా దీనిపైనే ఆధారపడి బతకగలమా..?
లాభనష్టాలు ఎలా ఉంటాయి..? ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది..?
why trading is risk
ఇది రిస్కే.. కానీ..
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ట్రేడింగ్ గురించి అవగాహన లేకపోవడంతో మన దేశంలో ట్రేడింగ్ ను పేకాటతో పోల్చుతారు. అందుకే స్టాక్ మార్కెట్ కెరియర్‌ను మన సొసైటీ మనస్ఫూర్తిగా అంగీకరించదు. మన చుట్టూ ఉన్న వాళ్లు ట్రేడర్స్‌ని జూదగాళ్ల లా చూస్తారు. కానీ విదేశాల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచీ ఉంటుంది. కాబట్టి వాళ్లు ట్రేడింగ్‌పై అవగాహన కలిగి ఉంటారు. అందుకే హుందాగా ఈ కెరియర్‌ను ఎంచుకుంటారు. మనం చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం కొనసాగిస్తూ షేర్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైన పద్ధతి. ఇది అందరికీ సాధ్యమవుతుంది. ఒక వేళ స్టాక్స్ లో నష్టపోయినా మన ఉద్యోగం ఎలాగో ఉంటుంది కాబట్టి భయం లేదు. కానీ పూర్తిగా స్టాక్ మార్కెట్‌పైనే ఆధారపడి ఉండడం అనేది రిస్క్‌తో కూడుకున్నది. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. పెట్టుబడి, అవగాహన, అనుభవం అన్నీ ఉండాల్సిందే.
how should plan for stock market carrier
ఇలా చేయాలి..
* మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేముందు ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకుని మొదలుపెడతాం.. ట్రేడింగ్ పరంగా కెరీర్ ను ఎంచుకోవాలనుకున్నా అంతే.
* మనం ట్రేడింగ్ చేయాలనుకున్నపుడు సరైన దారిలో వెళితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.
* కెరీర్ పరంగా ట్రేడింగ్ ఎంచుకోవాలనుకుంటే ట్రేడింగ్ పై పూర్తి అవగాహన ఉండాలి. దానిపై పుస్తకాలను చదవాలి. ఎక్స్ పర్ట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి.
* మనం సొంతంగా ఎనాలసిస్ చేసుకోవాలి. కనీసం ఒక సంవత్సరం పాటు మార్కెట్ ను పరిశీలించాలి. దీనిపై కనీసం 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉండాలి. అలా ఉంటే ట్రేడింగ్ లో నిలబడగలం.
* మొదటి 1,2 సంవత్సరాలు మినిమమ్ రిటర్న్స్ వచ్చేలా చూసుకోవాలి. అలాగే దానిపై అలవాటు పడాలి. ట్రేడింగ్ ను బిజినెస్ లాగా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.
* చాలామంది ట్రేడింగ్ చేసేవాళ్ళు 10 రూపాయలు పెడితే లక్ష రూపాయలు వచ్చేస్తాయి.. మనం ఏమీ చేయనవసరం లేదు అని అనుకుంటారు. కాని ఇది చాలా తప్పు.
* ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసేవారు రియల్ గా 20శాతం లేదా 30 శాతం వరకు రిటర్న్స్ ఆశిస్తే సక్సెస్ అవుతారు. అలాకాకుండా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి వంద శాతం రిటర్న్స్ ఆశ పడితే వాళ్ళు బాగా నష్టపోతారు.
* ట్రేడింగ్ అంటే ఒక కంపెనీలో వాటాను కొనుక్కొని కొంత లాభంతో మళ్ళీ దానిని అమ్ముకోవడం.
ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 3.30 వరకు, కమొడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు 9.00 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంప్యూటర్ ముందు కూర్చోవలిసి వస్తుంది. ఎందుకంటే ట్రేడింగ్ లో ప్రతి సెకెన్ కి షేర్ ప్రైస్ మారుతూ ఉంటుంది.