
how to start term insurance
మనం ప్రత్యేకంగా కొంత కాల పరిమితికి ఇన్సురెన్స్ చేసుకున్నట్లయితే దానిని టర్మ్ పాలసీ అంటారు. ఈ కాల పరిమితి ముగిశాక మళ్లీ దానిని రెన్యువల్ చేసుకోవాలి. ఈ కాల పరిమితిలో అంటే ఆ టర్మ్ లో మనం ఏదైనా కారణాలతో మరణించినట్లయితే మన ఫ్యామిలీకి ఆ కవరేజ్ మొత్తం ఇస్తారు. సాధారణంగా మనం టర్మ్ ఇన్సురెన్స్ ఎందుకు తీసుకుంటామంటే మన ఫ్యామిలీ మన ఆదాయం పై ఆధారపడి ఉంది. అందువలన మనం లేకపోయిన టర్మ్ ఇన్సురెన్స్ వలన మన కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ లభిస్తుంది.
when we take insurance
ఏ వయసులో తీసుకోవచ్చు…
టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని మనం కెరీర్ ప్రారంభించిన వెంటనే తీసుకోవడం మంచిది. చిన్న వయసులోనే మనం టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. టర్మ్ ఇన్సురెన్స్ పాలసీతో మన కుటుంబానికి చాలా తక్కువ ఖర్చుతోనే సమగ్ర కవరేజీని అందించవచ్చు. సాధారణంగా టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ 60 ఏళ్ళ వరకు తీసుకుంటే సరిపోతుంది.
టర్మ్ పాలసీకి ఇన్ కమ్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని కంపెనీలు ఖచ్చితంగా మనకి ఐటీఆర్ ఉంటేనే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని ఇస్తారు. చాలామంది టర్మ్ ఇన్సురెన్స్ పాలసీకి అప్లై చేసినా సరైన ఇన్ కమ్ లేకపోవడం వల్ల ఇవ్వడం లేదు. అలాంటివారు `సరల్ జీవన్ బీమా` అనే ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలాంటి ఇన్ కమ్ ప్రూప్స్ అవసరం లేదు. ఇందులో ప్రీమియం తక్కువగా ఉంటుంది. కవరేజీ కూడా తక్కువగానే ఉంటుంది. టర్మ్ పాలసీదారుకి అనుకోకుండా ఏదైనా జరిగి మరణం సంభవిస్తే మాత్రమే కవరేజీ ప్రయోజనం లభిస్తుంది. లేకపోతే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. టర్మ్ పాలసీలకు ఎటువంటి మెచ్యూరిటీ విలువ ఉండదు.
is online insurance good
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్..?
మనం ఏదైనా పాలసీని ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే అందులో తమకు ఎక్కువ మొత్తం కమిషన్ వచ్చే వాటినే బ్రోకర్స్ మనకు ప్రమోట్ చేస్తారు. దీని వల్ల మనకు ప్రయోజనం తగ్గుతుంది. అందుకే మనం ఆన్ లైన్లో పాలసీ తీసుకోవడం మంచిది. టర్మ్ ప్లాన్ తీసుకునే వారికి ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద లభించే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మనం ఎటువంటి ఏ ఇన్సురెన్స్ పాలసీలు తీసుకున్నా మన కుటుంబంలో ఉన్న వారికి తెలియజేయాలి.