how to get more profit with SIP
సిప్ అంటే ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ప్రతివారం లేదా ప్రతినెలా ఇలా ఇన్ స్టాల్ మెంట్ పద్ధతిలో యూనిట్స్ కొనుక్కుంటూ పోవడాన్ని సిప్ అంటారు. ఇది ఈఎంఐ కి భిన్నంగా పనిచేస్తుంది. లమ్ సమ్ లో కొంటే ఏమవుతుందంటే మార్కెట్ సడన్ గా డ్రాప్ అయితే రికవరీకి చాలా టైం పడుతుంది. కానీ మనం సిప్ లో పెట్టినపుడు మార్కెట్ ఒక వేళ డ్రాప్ అయినా ఎక్కువ యూనిట్లు వస్తాయి. అందువల్ల మ్యూచువల్ ఫండ్ లో ఎక్కువశాతం రికమండ్ చేసేది సిప్ పద్ధతినే.
సొంతగా చేసుకుంటే మంచిదే..
మనకి నాలెడ్జ్ ఉంటే సొంతంగా బై చేసుకుంటే మంచిది. ఎందుకంటే మార్కెట్ లో డిస్కౌంట్ వచ్చిన ప్రతిసారి బై చేసుకోవచ్చు. ఎవరైతే మార్కెట్ పై ఆధారపడి ఎక్కువ అడిషనల్ యూనిట్స్ కొంటారో లాంగ్ టర్మ్ లో వాళ్ళకు ఎక్కువ మనీ వస్తుంది. బ్యాంకుకు సంబంధం లేకుండా నిర్థిష్టమైన సమయం పెట్టుకోకుండా కేవలం మార్కెట్ పడినప్పడు మాత్రం పరిశీలించుకుని ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టకోవడం ఒక ఉత్తమ విధానం అవుతుంది. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్‌లాగే లాభాలనూ పొందవచ్చు.. సేఫ్టీని కలిగి ఉండవచ్చు.
మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక మంచి పోర్ట్ ఫోలియో క్రియేట్ చేసుకుని ప్రతి నెలా వాటన్నింటినీ ఏవరేజ్ చేసుకోవచ్చు. ఇలా చేసినా మ్యూచువల్ ఫండ్‌లాంటి ప్రయోజనమే వస్తుంది. ఇందులో పోర్ట్ ఫోలియోని ఏవరేజ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసిన థ్రిల్లింగ్ కలుగుతుంది.
what are the good return mutual funds
గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏవి?
* ఐటి ఇండెక్స్ కంపెనీ గుడ్ రిటర్న్స్ ఇస్తుంది.
*ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిస్క్‌తో కూడుకున్న సెక్టారే అయినా బెస్ట్ ఫర్ఫార్మెన్స్ కంపెనీ. 21.6% రిటర్న్‌తో మంచి ఆదరణ ఉన్న ఫండ్. ఇందులో 5 ఏళ్ల క్రితం 10వేల రూపాయలు పెడితే ఇప్పడు సుమారు 26 వేలు అవుతుంది.
* మనకు సేప్టీ కావాలి అండ్ రిటర్న్స్ ఎక్కువ రావాలి అనుకుంటే పరాగ్ ఫ్లెక్సీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇందులో 5 ఏళ్ల క్రితం 10వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 23 వేలు అయి ఉంటుంది.
* మనం మార్కెట్ డౌన్ టైంలో బయటకు వెళ్ళకూడదు. ఎక్కువ బై చేయాలి తప్ప ఆపేయకూడదు.
* మనం ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మనం జీవితంలో మనం ఏం చేసినా నిత్యం సిప్ చేస్తూ పోతే చివరాఖరుకు ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయ్యేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఇది.