
credit cards with more benefits
క్రెడిట్ కార్డుల వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ రోజుల్లో అందరూ సాధారణంగా ఈ కార్డులను వాడేస్తున్నారు. అయితే ఈ కార్డులు వాడుతున్నప్పుడు కొన్ని పాయింట్లను ఇవ్వడం ద్వారా బ్యాంకులు కష్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు విమాన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులను తీసుకువచ్చింది.
what is emirate skywards icici credit card
దుబాయ్‌కి చెందిన ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎమిరేట్ స్కై వార్డ్స్ తో ఇండియా ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ జట్టుకట్టింది. ఈ జట్టు అత్యుత్తమ ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తోంది.
ఎమిరేట్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు పేరుతో కో బ్రాండెడ్ కార్డులను ఈ సంస్థలు తీసుకువచ్చాయి. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ తో జత కట్టిన తొలి భారత బ్యాంకు తమదే అని, కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకురావడం సంతోషంగా ఉందని, ఇవి సాధారణ క్రెడిట్ కార్డ్స్ కు సమాన ప్రయోజనాలు అందిస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ ఆఫ్ సెక్యూర్డ్ అసెట్స్ సుదీప్త రాయ్ తెలిపారు.
ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే కస్టమర్లు ఈ కార్డులను వాడి రోజువారి జీవనశైలి, రోజువారీ ఖర్చులపై స్కైవార్డ్స్ మైల్స్ అని పిలిచే రివార్డ్ పాయింట్లను సంపాదించవచ్చు. ట్రావెల్, లైఫ్ స్టైల్, ఎవ్రీడే స్పెండింగ్స్ పైన ఈ రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. ఈ కో – బ్రాండెడ్ కార్డు మూడు రకాలుగా లభిస్తుంది.
— 1. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఎమిరాల్డ్ క్రెడిట్ కార్డు
— 2. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ బ్యాంకు షిపిరో క్రెడిట్ కార్డు
— 3. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ బ్యాంకు రుబీఎక్స్ క్రెడిట్ కార్డుhow we use points of credit cards
* ఈ కార్డులలో ప్రతి రూ.100 ఖర్చు పైన 2.5 స్కైవార్డ్స్ మైల్స్ వస్తాయి. వీటిని పార్ట్ నర్ ఎయిర్ లైన్స్ ప్లైట్ టిక్కెట్స్ పైన, విమాన అప్ గ్రేడ్స్, స్పోర్ట్స్ అండ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆతిథ్యం వంటి వాటి కోసం ఖర్చు చేయవచ్చు.
* కాంప్లిమెంటరీ ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సిల్వర్ స్టేటస్ తో బోనస్ స్కైవార్డ్స్ మైల్స్ పొందవచ్చు.
బోనస్ స్కైవార్డ్స్ మైల్స్ తో డైనింగ్ ఆఫర్స్ వంటి వాటిని కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కులినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా డైనింగ్ ఆఫర్స్ తో పాటు బుక్ మై షో ద్వారా ఎంటర్టైన్మెంట్ ఆఫర్స్, ఎంచుకున్న కార్డు వేరియంట్ ఆధారంగా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.