
డబ్బును సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ డబ్బును నిలబెట్టుకోవడం, సక్రమంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యమన్న విషయం చాలా మంది గుర్తించరు. దాని ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ఒక చక్కని బుక్ `సైకాలజీ ఆఫ్ మనీ`. Morgan housel గారు నిజ జీవితంలో డబ్బు పరంగా ఎలాంటి తప్పులు చేస్తామో, డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో సైకాలజీ ఆఫ్ మనీ బుక్ లో చక్కగా వివరించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం.
psychology of money book says about
Morgan housel గారు book introduction రొనాల్డ్ జేమ్స్ రీడ్‌తో ప్రారంభించారు. రొనాల్డ్ జేమ్స్ రీడ్ అమెరికాలో జన్మించారు. తన కుటుంబంలో మొదటి చదువుకున్న వ్యక్తి ఇతనే. తన చదువు పూర్తయిన తర్వాత రొనాల్డ్ రీడ్ మొదటి ఫ్లోర్స్ క్లీన్ చేసేవారు. తర్వాత కార్లకు చిన్న, చిన్న రిపేర్లు చేస్తుండేవారు. తమకు 38 సంవత్సరాల వయసులో 12వేల డాలర్సతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కొనుక్కొని తన జీవితమంతా అక్కడే గడిసి 92 ఏళ్ళకు అంటే 2014లో చనిపోయారు. అతను చనిపోయేసరికి అతని దగ్గర 8మిలియన్ డాలర్స్ ఆస్తి ఉంది. అందులో 6మిలియన్ డాలర్స్ హాస్పిటల్స్ కి , లైబ్రేరరీ కి డొనేట్ చేసి 2 మిలియన్ల డాలర్స్ పిల్లలకి ఇచ్చారు. ఇంకొక విషమేమిటంటే ఫ్లోర్స్ క్లీన్ చేసుకునే, కార్లు రిపేర్లు చేసుకునే వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందంటే అతను సంపాదించిన డబ్బులో క్రమం తప్పకుండా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అవి పెరిగి 8 మిలియన్ డాలర్స్ అయ్యాయి.
ఇప్పుడు Richard fuscone గురించి తెలుసుకుందాం. ఇతను MBA చేశారు. ఇతను మెరిలిన్స్ లో ఎక్జిక్యూటివ్ గా పనిచేశారు. అతను 40 ఏళ్ళ వయసులో ఫిలాంత్రఫిస్ట్ అవ్వాలని తన జాబ్ రిటారైయ్యారు. తర్వాత 2000లో ఎక్కువ అప్పు చేసి అమెరికాలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న తన ఇంటిని ఎక్స్పేన్స్ చేశారు. ఇంటిలో 11బెడ్రూమ్స్, 2 స్విమ్మింగ్ ఫూల్స్ ని 7 గ్యారేజెస్ ని కన్ స్ట్రక్ట్ చేయించుకున్నారు. విటన్నింటిని మెన్టైన్ చేయడానికి ఆయనకు నెలకు 90,000 డాలర్సు ఖర్చుఅయ్యేవి. 2000 నుంచి 2008 వరకు అతని జీవితం సాఫీగానే సాగింది. కానీ 2008 లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసస్ అయ్యిందో అంత తలక్రిందుల అయ్యింది.
మనం నేర్చుకోవలిసింది ఎక్కువ చదువులు చదివితే సంపన్నులు అవ్వరు. మనం సింపుల్ గా సేవ్ చేయాలని డిటర్మెషన్, డిసిప్లెయిన్ ఉంటే చాలు. మనం సంపన్నులు అవుతాం. అదే మనం రొనాల్డ్ రీడ్ మరియు రిచార్డ్ పుస్కిన్ జీవితాల్లో నేర్చుకున్నాం.
who is jessie liver more
తర్వాత మనం JESSIE LIVERMORE గురించి తెలుసుకుందాం.
JESSIE LIVERMORE తన టైంలో గ్రేటెస్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడర్. ప్రపంచానికి ప్రొఫిషినల్ ట్రేడర్ అంటే తెలియకముందే ఆయన ప్రొఫిషినల్ ట్రేడర్ అయ్యారు. తనకు 30 ఏళ్ళ వచ్చేసరికి 100 మిలియన్ డాలర్స్ ఆస్తి కూడబెట్టారు.1929లో ప్రపంచ ధనవంతుల్లో ఇతను ఒకరయ్యారు.1929 అంటే THE GREAT DEPREESSION ఈ ఒక్క సంవత్సరంలో స్టాక్ మార్కెట్ విలువ అన్ని పడిపోయాయి. కాని జెస్సీ లివర్మోర్ కి ఎటువంటి నష్టం రాలేదు. ఎందుకంటే తన తెలివితేటలతో ముందుగానే మార్కెట్ ను షార్ట్ చేశారంట. కానీ 1929 నుండి 4 సంవత్సరాలు ముందుకెళ్తే అప్పుచేసి అధిక మొత్తంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు. దీనితో తన సంపాదమృనంతా కొంచం కొంచెం పోగొట్టుకున్నారు. దీనితో అతను రెండు రోజులు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అందువలన Morgan housel ఏమి చెప్పారంటే ఆస్తి సంపాదించడం కన్నా ఆస్తిపరులుగా ఉండడం ముఖ్యం అని అన్నారు.
LUCK AND RISK
లక్, రిస్క్ గురించి Morgan housel ఏమి చెప్పారో నేర్చుకుందాం.
బిల్గేట్ ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఎలా ఎదిగారో Morgan housel గారు తెలిపారు.
బిల్గేట్స్ తన చదువుని లేక్ సైట్ స్కూల్లో పూర్తి చేశారు. లేక్ సైట్ స్కూల్ గొప్పతనం ఏమిటంటే అప్పటిలో కంప్యూటర్ ఉన్న స్కూల్ అదొక్కటే. బిల్గేట్స్, స్కెంట్ ఎలెన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. చాలా తెలివైనవారు. వీళ్ళద్దరూ కలిసి స్కూల్లో వేరియస్ ప్రోజెక్టు కూడా చేసేవారట. కానీ అతను యాక్సిడెంట్లో చనిపోయారు. చాలా మంది తక్కువ టైంలో డబ్బులు సంపాదించిన వాళ్ళను చూసి మనం కూడా అలాగే చేద్దాం అనుకుంటారు. కానీ అది వాళ్ళకు లక్ అవ్వచ్చు, మనకు రిస్క్ అవ్వచ్చు.
Morgan housel గారు ఏమి చెప్పారంటే RESPECT THE POWER OF LUCK AND RISK
వారెన్ బఫెట్ గారు ప్రపంచ ధనవంతుల్లో ఒకరు. వారెన్ బఫెట్ గారు చిన్నప్పటి నుంచి Good Invester. అతని ఆస్తి ఆ బుక్ రాసేటప్పటికి 84.4 బిలియన్ డాలర్స్. అమెరికాలో 60 ఏళ్ళ వచ్చిన తర్వాత Social security కి qualify అవుతారు. తను Social security కి qualify అయిన తర్వాత బిల్ చేసిన ఆస్తి 81.5 బిలియన్ డాలర్స్ బిల్డ్ అయ్యిందని చెప్తున్నారు. అదే టైమ్ లో అతి తక్కువ మందిలో జిమ్ సిమ్సన్ ఒకరు. ఈ బుక్ రేసే టైమ్ కి జిమ్ సిమ్సన్ నెట్ వర్త్ 21 బిలియన్ డాలర్స్. ఇది వారెన్ బఫెట్ నెట్ వార్త్ తో పోల్చితే 75శాతం తక్కువ. ఇంత తక్కువ ఎందుకంటే సిమ్సన్ గారు తన రియల్ ఇన్వెస్ట్మెంట్ ని 50 ఏళ్ళ వచ్చినపుడు స్టార్ట్ చేశారు. డబ్బును మేనేజ్ చేసే విషయంలో no one`s crazy అంటారు.