
ఈ పుస్తకంలో పర్సనల్ ఫైనాన్స్ గురించి RAMIT SETHI వివరించారు. ఫైనన్స్‌ను ప్రోపర్‌గా మెంటైన్ చేయకపోతే మనకు వచ్చే నష్టాలు, చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల మనం కోల్పోయే విషయాలపై అవగాహన కల్పించడం ఈ పుస్తకలక్ష్యం. చిరుద్యోగులు, మధ్య తరగతి వ్యక్తులు ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ ఎలా చేసుకోవాలి.. చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలతో ధనవంతులు ఎలా కావాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. ఈ పుస్తకంలో రచయిత ఒక పద్ధతిని సూచించారు. మన అలవాట్లను చక్కదిద్దుకునేందుకు 6 వారాల ప్లానింగ్‌ను ప్రతిపాదించారు. దీన్ని పాటిస్తే ధనవంతులయ్యే దిశగా మనం ప్రయాణం చేయవచ్చు. ఆరు వారాల్లో ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ ని ఎలా తయారుచెయ్యాలో ఇక్కడ మనం చూద్దాం.
ఈ 6 వారాల సిస్టమ్ లో బిల్ పేమెంట్ ఎలా చేసుకోవాలి ? సేవింగ్స్ ఎలా చేసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ? అవన్నీ ఇక్కడ చూద్దాం.
what is credit card optimization
క్రెడిట్ కార్డ్
మొదటి వారం క్రెడిట్ కార్డ్ ఆప్టమైజేషన్ చేయాలి. అంటే ఎలానో చూద్దాం.
చాలామంది చాలా క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. మనం క్రెడిట్ కార్డ్స్ ప్రోపర్ గా ఉపయోగించకపోతే మనకి ఛార్జెస్ ఎక్కువ పడతాయి. మనం పేమెంట్ చేయనపుడు మన క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ అవుతుంది.
క్రెడిట్ స్కోర్ అనేది 300 రేంజ్ నుంచి 900 వరకు చూపిస్తుంది. ఇందులో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మనకి ప్యూచర్ లో హౌస్ లోన్ తీసుకోవడంలో కానీ ఫైనాన్షియల్ లోన్ తీసుకోవడానికి కానీ వీలవుతుంది. ఒక వేళ మన క్రెడిట్ స్కోర్ మైనస్ లో ఉందంటే ఫైనాన్షియల్ పరంగా మనం ట్రబుల్స్ లో ఉన్నట్లే. ఈ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలంటే క్రెడిట్ కార్డ్స్ చాలా కంట్రోల్ గా వాడాలి. ఈ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ కన్నా తక్కువ క్రెడిట్ కార్డ్స్ తీసుకుని వాటిని ప్రోపర్ గా మెంటైన్ చేసుకోవడం మంచిది.
* క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ లేట్ కాకుండా టైమ్ కి పే అయినట్టు చూసుకోవాలి. మనకి ఎప్పటినుంచో క్రెడిట్ కార్డ్ ఉంటే సంవత్సరానికి ఫీజు ఎంత పడుతుందో చెక్ చేసుకోవాలి. ఆ ఫీజు వీలైతే మాఫీ చేయడానికి అడగాలి. మనకి వడ్డీ ఎక్కువ పడితే వాళ్ళతో మాట్లాడి తక్కువ పడేలా చూసుకుని క్రెడిట్ కార్డ్ అమౌంట్ మొత్తం కట్టేయాలి.
బ్యాంక్స్..
ప్రతి ఒక్కరికి 2 లేదా 3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. 1.శాలరీ అకౌంట్ 2.సేవింగ్ అకౌంట్
మనకి శాలరీ పడగానే సేవింగ్ అకౌంట్ కి కొంత అమౌంట్ పంపించాలి. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ కి కొంత పంపించాలి. మనం మనీ సేవ్ చేయాలనుకుంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో సేవింగ్ చేయాలి. మనకి సంవత్సరానికి ఎక్కువ ఛార్జెస్ పడుతున్న బ్యాంకులను ఆపేయాలి. బ్యాంకులతో ప్యూచర్ లో చాలా అవసరం ఉంటుంది కాబట్టి వాటిని ప్రోపర్ గా మెంటైన్ చేయాలి.
types of investments
ఇన్వెస్ట్ మెంట్
ఇన్వెస్ట్ మెంట్ ని 4 కేటగిరిలుగా విభజించుకోవాలి
1.మ్యూచువల్ ఫండ్స్ 2.స్టాక్ మార్కెట్ 3.ల్యాండ్ 4.గోల్డ్
మనం ఎందులో ఇన్వెస్ట్ చేసినా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని చెయ్యాలి.
* మనం ఇన్వెస్ట్ చేసేటపుడు పిల్లల చదువులు దృష్టిలో పెట్టుకుని, ఇన్వెస్ట్ చెయ్యాలి. మన పిల్లల పెళ్ళిళ్ళకి ఎంత అవసరముంటుంది, దానికోసం మనం ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అని చూసుకోవాలి.
* మన పిల్లల మీద మనం ఆధారపడకుండా ఉండడానికి రిటైర్ మెంట్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి.
* అప్పడప్పుడూ వచ్చే అదనపు ఆదాయాలు, అనుకోకుండా మిగిలిన డబ్బులను జనరల్ ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవాలి.
కాన్సియస్ స్పెండింగ్
Conscious spending
మన డబ్బును కాన్సియస్ గా ఖర్చుపెట్టాలంటే మన స్పెండింగ్ అలవాట్లు ఎలా ఉన్నాయనేది పరిశీలించాలి. మనం బడ్జెట్ ను ప్రోపర్ గా ప్లాన్ చేసుకున్నపుడు ఇవన్నీ మనకి తెలుస్తాయి. మనకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అప్పుడు ఖర్చులు తగ్గించుకుని మిగిలినది సేవింగ్ చేసుకోవచ్చు. మన ఎంటర్ టైన్ మెంట్ కు కూడా లిమిట్ పెట్టుకోవాలి.
సేవింగ్
మనకొచ్చిన అమౌంట్ సేవింగ్ కి, ఇన్వెస్ట్ మెంట్ కి, స్పెండింగ్ కి డివైడ్ అయిపోవాలి. సేవింగ్ అంటే ఎమర్జన్సీ ఫండ్ ను ఎక్కువ వడ్డీ వచ్చేదానిలో పెట్టుకోవాలి. తర్వాత అకౌంట్ స్పెండింగ్స్ లో ఆటో డెబిట్ అయిపోవాలి. అంటే మన ఖర్చులన్నీ అకౌంట్ లో వెళ్ళాలి. ఇన్వెస్ట్ మెంట్ కి ఒక అకౌంట్ ఉండాలి.
invest with help of experts
ఫైనాన్షియల్ ఎక్స్ పెర్టైజ్ మిథ్స్
ఫైనాన్సియల్ ఎక్స్‌పెర్ట్ సహకారంతో ఇన్‌వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన చేయాలి. మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ లో ఛార్జస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా దేనిలోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి. నెలా నెలా ఈ గోల్డ్ లో తక్కవ మొత్తాలతో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలను పొందవచ్చు. దేనిలో ఇన్వెస్ట్ చేసినా దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఇలా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వారం కేటాయించి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ పక్కాగా చక్కదిద్దుకోవచ్చు. ఆ తర్వాత దానిని మెంటైన్ చేసుకుంటే సరిపోతుంది.