ఒంటికి సరే.. ఇంటికో..? * హోం ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే
why home insurance is necessary
ఆరోగ్యానికి, ప్రాణానికి, ఏక్సిడెంట్ లకు మనం ఇన్సూరెన్స్ చేస్తాం. బైకులకు, కార్లకి బీమా చేయిస్తాం. కానీ వాటికన్నా విలువైనది మన ఇళ్లు. ఇంటికీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్న విషయాన్ని మాత్రం మరిచి పోతుంటాం. ఆ వివరాలేమిటో ఓ సారి చూద్దాం.
సొంతింటి కల నెరవేరాక..
ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక పెద్ద కల సొంతిల్లు. జీవితలో కొంత కాలానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్న దానితో ఒక ఇంటిని నిర్మించుకుంటాం. కానీ ఆ ఇంటికి ఏదైనా జరిగితే…? ఇంటిలో ఉన్న వస్తువులు ఏదైనా కారణంతో ధ్వంసంమైతే..? మనం నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలి
* ఇంటిపై రుణం తీసుకున్నపుడు దానికి అనుగుణంగా లోన్ కవర్ టర్మ్ పాలసీని తీసుకుంటారు. రుణం తీసుకున్నవారికి ఏదైనా అనుకోనిది జరిగినపుడు ఈ పాలసీ రుణాన్నిచెల్లించేందుకు తోడ్పడుతుంది. కానీ నిర్మాణానికి, ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టానికి బాధ్యత వర్తించదు. దీనికోసం ప్రత్యేకంగా గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
* మన ఇంటికి, ఇంటిలోని వస్తువులకు ఏదైనా నష్టం జరిగినపుడు ఆర్థికంగా ఆ నష్టాన్ని తగ్గించేది గృహ బీమా. ఇందులో విద్యుత్ ఉపకరణాలు, వస్తువులు, ఆభరణాలు వాటిన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తికి నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. ఈ పాలసీలు తప్పనిసరిగా తీసుకోవలిసిన అవసరం లేదు.
* మన ఇల్లు ఎక్కడ ఉంది అనే దానిని బట్టి, ఏ తరహా పాలసీ తీసుకోవలన్నది నిర్ణయించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్నపుడు స్ట్రక్చరల్ హోం ఇన్సురెన్సూ పాలసీని ఎంచుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేనపుడు కంటెంట్ ఇన్సురెన్స్ సరిపోతుంది.
మనం ఎలాంటి పాలసీ తీసుకున్నా ముందుగా ఆ పాలసీలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకోవాలి. ప్రీమియం అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలించాలి. ఇతర కంపెనీలు అందించే పాలసీలను పరిశీలించి అందులో మంచిది ఎంచుకోవాలి.
take home insurance on the value of house
విలువ ముఖ్యం..
మన ఆస్తి విలువను లెక్కించి అందుకు తగ్గ పాలసీ తీసుకోవాలి. ఒక వేళ మనం కంటెంట్ ఇన్సురెన్సూ తీసుకోవాలని అనుకున్నపుడు, వస్తువుల జాబితా తయారు చేసుకోవాలి. వాటి విలువ ఎంత ఉంటుందో అంచనా వేయాలి. వస్తువు పోతే, దాని వలన మనకి జరిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాలి. దీన్ని బట్టి, మన వస్తువుల విలువ ఎంత అనేది అంచనా వస్తుంది. ఇంటి విలువ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పాలసీని సమీక్షిస్తూ ఉండాలి.
Leave a Reply