Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్స్ ఎంచుకోండి.. FEATURE NEWS
  • లోన్ వద్దనుకుంటున్నారా.. అయితే రద్దు చేసుకోండి ! ‘కూలింగ్-ఆఫ్’ నిబంధనతో సేఫ్ ఎగ్జిట్! Don’t Want the Loan? Cancel It! Safe Exit with ‘Cooling-Off’ Rule! FEATURE NEWS
  • క్రిప్టోపై పెట్టుబ‌డుల‌తో జాగ్ర‌త్త is crypto investments are safe FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • ఇలా చేస్తే సిప్ మ‌రింత లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..LIC Housing Finance cuts home loan interest rates FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again FEATURE NEWS
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted? FEATURE NEWS
  • సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc FEATURE NEWS

కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car

Posted on 19/05/202204/01/2025 By admin No Comments on కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car

మ‌న‌లో చాలా మంది కొత్త ఉద్యోగం రాగానే, లేదా చిన్న వ్యాపారం మొద‌లుపెట్ట‌గానే కారు కొనాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. వీలైనంత ఖ‌రీదైన‌ది, న‌లుగురిలో గొప్ప‌గా అనిపించే కారును తీసుకుంటారు. బ్యాంకులోన్ వాడి జీతంలో అధిక భాగం ఈఎంఐ కోసం కేటాయించి కారు న‌డుపుతారు. అయితే ఇది ఎంత వ‌ర‌కు స‌రైన నిర్ణ‌యం అనేది ఓ సారి స‌మీక్షిద్దాం.

DISADVANTAGES OF HAVING A CAR
మ‌న ఆదాయం మొద‌లుకాగానే కారు కొనాల‌నుకోవ‌డం పొర‌పాటే అవుతుంది. కారు అనేది మ‌న ప్రాధాన్యాల్లో మూడో లేదా నాలుగో స్థానంలో ఉండాలి. ఎందుకంటే అంత‌క‌న్నా ముఖ్య‌మైనవి కొన్ని ఉన్నాయనే విష‌యాన్ని గుర్తించాలి. మొద‌ట్లోనే మీరు కారు కొంటే ఆదాయంలో ఆదా చేయ‌డానికి, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి, ఆస్తులు కూడ‌బెట్ట‌డానికి అవ‌కాశం ఉండ‌దు.
* పొదుపు చేయ‌డం, ఇన్వెస్ట్‌మెంట్ మొద‌లుపెట్ట‌డం, ఇళ్లు కొనుక్కోవ‌డం అనే వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఆస్తుల‌వుతాయి. అంటే వీటి నుంచి మ‌న‌కి ఆదాయం వ‌స్తుంది.
* కారు అనేది ల‌గ్జ‌రీ. అంటే దీనినుంచి మ‌న‌కు ఆదాయం రాక‌పోగా దీనిపై మ‌నం తిరిగి ప్ర‌తినెలా, ప్ర‌తి సంవ‌త్స‌రం ఖ‌ర్చు చేస్తూ ఉండాలి. ఎంత ఖ‌రీదైన కారు కొంటే అంత ఎక్కువ‌గా మెంటెనెన్స్ చార్జీలు ఉంటాయన్న విష‌యం మ‌ర‌వొద్దు.
* మనం కారు కొనేముందు ఆలోచించుకోవలిసినది మన బడ్జెట్. ఈ విషయంలో మనకి కొంత క్లారిటీ ఉండాలి. మన ఆర్థిక స్థోమతు ప్రకారం మన కారు కొనాలనుకున్నప్పుడు మన సంవత్సర ఆదాయం దాటి ఖర్చు చేయకూడదు. ఎందుకంటే కారు విలువ రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది. అదేమిటంటే కేవలం కారు కొనుక్కుంటే సరిపోదు. దానిని ఖచ్చితంగా మనం మెంటైన్ చేయాలి. కాబట్టి మనం ఎక్కువ ఖర్చుపెట్టి కారు కొంటే, దానికి సర్వీసు చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.
* పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు, ఇన్సూరెన్స్, ట్యాక్స్‌, డ్రైవ‌ర్‌, మెంటెన‌న్స్‌, పార్కింగ్ ఫీజులు ఇవ‌న్నీ మ‌న‌పై అధ‌న‌పు భారం మోపుతాయి.

WHEN SHOULD YOU TAKE A CAR
ఇలా ఉంటేనే కారు..
* మనం కారు కోసం ఖర్చు చేయవలిసిన డబ్బు మన సంవత్సర ఆదాయం దాటి ఉండకూడదు. అంటే సంవ‌త్స‌ర ఆదాయం ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు అనుకుంటే మీరు కొనాల‌నుకున్న కారు అంత‌క‌న్నా త‌క్క‌వ ధ‌ర ఉండేలా చూసుకోవాలి.
* మనకారు లోన్ ఈఎమ్ఐ మన నెలజీతంలో 10 శాతం కన్నాతక్కువ‌గా ఉండాలి. అంటే మీకు 50 వేలు జీతం వ‌స్తుంటే మీ కార్ లోన్ ఈఎంఐ నెల‌కు రూ. 5వేలు మాత్ర‌మే ఉండాలి. అంత కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు.
* కారు మనకి ఆస్తి కాదు. అది డిప్రీసియేటింగ్ అసెట్‌. అంటే విలువ త‌గ్గే వ‌స్తువు. రోజురోజుకి దీని విలువ తగ్గుతుంది, కానీ పెరగదు. అంటే కారుపై మీరు పెట్టే డ‌బ్బు వృథా అయినట్టే లెక్క‌.
* చాలామంది ఏ అసెట్స్ కొనకుండానే కారును కొంటారు. అలా చేయకూడదు.
* అద‌న‌పు ఆదాయ మార్గాలు త‌యారు చేసుకుని కారు కొనుక్కుంటే న‌ష్టం ఉండ‌దు.

మ‌నం సొంతంగా కారు కొన‌లేన‌ప్పుడు లోన్ కోసం వెళ్తారు. అయితే కార్ లోన్ తీసుకునే ముందు మ‌నం చాలా విష‌యాలు దృష్టిలో పెట్టుకోవాలి.

CAR LOAN PROCESS
మనం మొదట షోరూమ్ కి వెళ్ళి కారుని ఎంచుకోవాలి. మనం కారు కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తారా లేదా లోన్ తీసుకుంటారా అని మనకి అడుగుతారు. అప్పుడు క్యాష్ ఇచ్చి తీసుకుంటే సమస్యే లేదు. లేకపోతే మనం లోన్ తీసుకుని కారు కొనాలంటే మనకి షోరూమ్ వాళ్ళు ఒక కొటేషన్ ఇస్తారు. అందులో కారుక్ సంబంధించిన వివరాలు అన్ని పూర్తిగా ఉంటాయి. మనం ఆ కొటేషన్ తీసుకుని ఏ బ్యాంకులో అయితే కారు లోన్ వడ్డీ త‌క్కువ‌గా ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఇస్తాం. ఆ కొటేషన్ తో పాటు మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా గత 3నెలలు జీతం స్లిప్, గత 6నెలలు మన బ్యాంకు స్టేట్ మెంట్ అండ్ మన గత రెండు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి. మనం ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్ కి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఇవ్వాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు ఇవ్వాలి. ఇవన్నీ ఆధారాలు చూసాక బ్యాంకు మనకి లోన్ ఇస్తుంది.

* మన కారు on road price అనేది రూ.10లక్షలు అయితే కొన్ని బ్యాంకులు మన సిబిల్ స్కోర్, ఆదాయం అంతా బాగున్నట్లయితే 100% on road price ఇస్తున్నాయి. కానీ చాలా బ్యాంకులు 75 శాతం మాత్రమే ఇస్తున్నాయి. కారు on road price అనేది రూ.10లక్షలు అయితే 2.5 శాతం డౌన్ పేమెంట్. ఆ డౌన్ పేమెంట్ ఖచ్చితంగా సేవింగ్ సైడ్ ఉండాలి. ఆ మొత్తాన్ని మనం షోరూమ్ లో కట్టాలి. మిగతా అమౌంట్ బ్యాంకు లోన్ ఇస్తుంది. దానితో మనం కారుని తీసుకోవచ్చు.

* మన దగ్గర డౌన్ పేమెంట్ చేసేంత కెపాసిటీ లేకపోతే మనం కారు తీసుకోకూడదు. అందుకు స‌రిప‌డా మొత్తం మ‌న ద‌గ్గ‌ర సేవింగ్స్ ఉంటే మాత్రమే కారు లోన్ తీసుకోవాలి. కారు తీసుకున్న తర్వాత నెలనుంచి మనకి ఈఎమ్ఐ కట్టవలిసి ఉంటుంది.

EMI TENURE
ఈఎంఐ పదవీకాలం మనం 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువమంది 5 సంవత్సరాలు టెన్యూర్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే చివ‌రి ఈఎమ్ఐ కడతామో అప్పుడు క్లియర్ అయిపోతుంది. అప్పుడు మనం No objection certificate తీసుకుంటాం.
అప్పటివరకు మన కారు ఆర్సీ పై ఫలానా బ్యాంకు లోన్ తీసుకున్నాం అనేది ఉంటుంది.
ఒకవేళ మనం తీసుకోవాలనుకున్న కారు షోరూమ్ బ్యాంక్స్ తో లింక్ అయ్యి ఉంటే మనం కారు కోసం లోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ లో వడ్డీ రేటు 6 నుంచి 10 శాతం ఉంటుంది. కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ తో లింక్ అయితే మనం లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే అందులో వడ్డీ రేట్లు 10 నుంచి 18 శాతం వరకు ఉంటుంది.

ఎలాంటివాళ్ళు ఈ లోన్ కి అర్హులు
జాబ్ చేస్తున్న లేదా వ్యాపారం చేస్తున్నవారు, లేదా నెలనెలా ఆదాయం వచ్చే వారు ఈ లోన్ పొందడానికి అర్హులు. మన వయసు 21నుంచి 60 మధ్య‌లో ఉండాలి. అదే మనం వ్యాపారం చేసేవాళ్ళమయితే 21 నుంచి 65 వరకు కూడా లోన్ తీసుకోవచ్చు.

మనం జాబ్లో జాయిన్ అయి మినిమమ్ 2 సంవత్సరాలు అయి ఉండాలి. మన జీతం మినిమమ్ రూ.25వేలు ఉండాలి. అదే మనం వ్యాపారం చేసినవాళ్ళమయితే మన ఆదాయం సంవత్స‌రానికి రూ.2 లక్షలు నుంచి రూ. 3 లక్షలు వచ్చి ఉండాలి.
మనం ప్రస్తుతం ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నామో ఆ కంపెనీలో మినిమమ్ 1సంవత్సరం అనుభవం ఉండాలి.

ప్రతి బ్యాంకులో documentation charge ఉంటుంది. మినిమమ్ రూ.1000 ఉంటుంది.
అదేవిధంగా part payment charges ఉంటుంది. మనం లోన్ తీసుకున్న తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నా ఒక్కసారి పే చెయ్యడం అవ్వదు. దానికోసం 1సంవత్సరం వరకు వెయిట్ చెయ్యాలి. సంవత్సరం తర్వాత మాత్రమే part payment చెయ్యగలం. ఇక్క‌డ‌ మనం కట్టే డబ్బులో 5 శాతం ఛార్జ్ తీసుకుంటారు.

Pre Closure Charge: మనం ఎంత డబ్బులు అయితే కట్టి క్లోజ్ చెయ్యాలనుకుంటున్నామో దానిలో 5 శాతం ఖచ్చితంగా ఛార్జ్ కట్టాలి. దానితో పాటు స్టాంప్ డ్యూటీ, లీగల్ ఛార్జ్, సిబిల్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి.

లోన్-ఈఎమ్ఐ
మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే తక్కువ టెన్యూర్ పెట్టుకుని లోన్ తీసుకోవాలి. ఇలా అయితే మనం వడ్డీ తక్కువ కట్టవలిసి ఉంటుంది.
* మన దగ్గర డబ్బు ఎక్కువ లేకపోతే ఎక్కువ టెన్యూర్ పెట్టుకోవాలి. వడ్డీ కూడా ఎక్కువ కట్టవలిసి ఉంటుంది.
* ఎవరికైతే సిబిల్ స్కోర్ ఆదాయం ఎక్కువ ఉందో వాళ్ళకి వడ్డీరేట్లు తక్కువ ఉంటాయి.
* లోన్‌కి అప్లై చేసేట‌ప్పుడు అద‌నంగా ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విష‌యాలు గుర్తు పెట్టుకోవాలి
* మన సంవత్సర ఆదాయం కంటే మనం కొనే కారు ధర ఎక్కువ ఉండకూడదు.
* అన్ని ఈఎమ్ఐ లు కలిపి మన నెలజీతంలో 50 శాతం కంటే తక్కువ ఉండాలి.
* డౌన్ పేమెంట్ ఖచ్చితంగా మన సేవింగ్స్ అయ్యి ఉండాలి.
* మనం ఇన్సురెన్స్ తప్పకుండా తీసుకోవాలి.
* మన దగ్గర డబ్బు ఉండి, డ్రైవింగ్ వచ్చి ఉంటే మనం కొత్త కారు కొనుక్కోవచ్చు. అదే మన దగ్గర డబ్బు ఉండి డ్రైవింగ్ రాకపోతే సెకెండ్ హ్యాండిల్ కారు కొనుక్కోవాలి. ఎందుకంటే డ్రైవింగ్ రాకపోయి ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు ఎదుర్కోవలిసి ఉంటుంది.

248
FEATURE NEWS, FINICAL PLANNING Tags:is it necessary to have a car, what are the disadvantages of having a car

Post navigation

Previous Post: ఒంటికి స‌రే.. ఇంటికో..? * హోం ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే
Next Post: స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ లో లాభాలే

Related Posts

  • అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani FEATURE NEWS
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS
  • టెక్నిక‌ల్ ఎనాల‌సిస్‌తో లాభాలే.. FEATURE NEWS
  • డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education?
  • ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver!
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • భార్యకు భారీగా న‌గదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory! FEATURE NEWS
  • How to improve CIBIL Score సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి FEATURE NEWS
  • మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market? MARKET
  • లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing! FEATURE NEWS
  • ఇంట్రాడే లో ఇండికేట‌ర్లు ముఖ్యం MARKET
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • `సైకాలజీ ఆఫ్ మనీ` బుక్‌ స‌మ‌రీ తెలుగు psychology of money book review telugu BOOKS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme