
What is NFO in mutual funds
ఇన్వెస్టర్‌కి లాభాలను పంచడం కోసం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు రకరకాల కొత్త పథకాలను మార్కెట్‌లోకి తీసుకువస్తుంటాయి. ఒక్కో ఫండ్ ఒక్కో స్టైల్ లో పనిచేస్తుంది. ప్రత్యేక స్ట్రాటజీ అనుసరిస్తుంది. ఫైనల్‌గా లాభాలను పంచుతుంది. ఇలా ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ కొత్త కొత్త వ్యూహాలతో ఏఎంసీలు కొత్త ఫండ్స్‌ను స్టార్ట్ చేస్తుంటాయి. అలా వచ్చిన కొత్త మ్యూచువల్ ఫండ్స్‌నే NFO ( New Fund Offer) అంటారు.
What is the NAV of NFO
ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ లో కొత్త ఫండ్ ని తీసుకువచ్చినపుడు దానిని ప్రారంభంలో 15 రోజులు NFO గా ప్రకటించి ఆ 15 రోజుల్లో రూ.10 NAV తో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఆసక్తి ఉన్న మదుపరులు ఒక యూనిట్‌ని 10 రూపాయలకే కొనుక్కోవచ్చు. NFO ద్వారా ఫండ్ మేనేజర్ ఒక కొత్త ఆలోచనతో మార్కెట్ లోకి మ్యూచువల్ ఫండ్ రిలీజ్ చేస్తారు.
* ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో దాదాపు 50 వెరైటీ మ్యూచువల్ ఫండ్స్ఉంటాయి.
NFOను బయటకు తీసుకువచ్చే ముందు సెబీకి తెలియజేయాలి. సెబీ దానిని పరిశీలించిన అనంతరం మాత్రమే ఫండ్ ని మార్కెట్ లో రిలీజ్ చేయవలిసి ఉంటుంది.
NFO is profitable or not
మ్యూచువల్ ఫండ్ లో దీర్ఘకాలంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు 100 శాతం, 200 శాతం లాభాలను ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఒకప్పుడు NFO గా వచ్చినవే. మిడ్ క్యాప్ ఫండ్స్ 150 శాతం రిటర్న్ ఇచ్చాయి. అదే విధంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ 2014 నుంచి చాలా బాగా పెర్ఫార్మ్ చేశాయి. 2014 నుంచి 2017 వరకు 203 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
How to invest in NFO
కొత్తగా మ్యూచువల్ పండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1000 రూ. లతో స్టార్ట్ చేయవచ్చు. ఇందులోనూ సిప్ లేదా లంప్సం ఆప్షన్స్ ఉంటాయి. అలా చేస్తూ ఉంటే దీనిపై అవగాహన వస్తుంది. రూపాయి కూడా పెట్టకుండా దీనిపై పరిశోధన చేయలేరు. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ అనేవి సాధారణం.. గ్రోత్ మాత్రం తప్పకుండా వస్తుంది.