
which is the best investment in india
ఆదాయం పొందడానికి, ఆస్తులు కూడగట్టుకోడానికి మనం అనేక మార్గాలను అన్వేషిస్తుంటాం.
ఖచ్చితమైన రాబడులను పొందడానికి ఎలాంటి పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టాలో మనకి తెలియనపుడు ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. మన లక్ష్యాలను అందుకోవడానికి కొన్ని రకాల పెట్టుబడ్ మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం…
is gold investment is profitable
గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్..
మన దేశంలో బంగారానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. బంగారం సరఫరా తగ్గి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, బంగారం విలువ ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో బంగారాన్ని విక్రయించడం లేదా దానిపై రుణం తీసుకోవడం ద్వారా ఆర్థిక అవసరాల నుంచి బయటపడొచ్చని అనుకుంటాం. కానీ బంగారం విక్రయించే సమయంలో మనం ఆశించినంత విలువ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
* బంగారం అమ్మే సమయంలో దాని రేటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది.
* బంగారాన్ని నిల్వ చేయడానికి కూడా కొంత ఖర్చు అవుతుంది. కొనుగోలు, అమ్మకం చేసేటప్పడు పన్నులు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
* బంగారం కొనేటపుడు అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బంగారాన్ని అమ్మే సమయంలో మనం సదరు ఛార్జీలను కోల్పోవడంతో పాటు తరుగుదల ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
ఫిక్స్డ్ డిపాజిట్…
మన దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడులను అందించే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి పొందే మొత్తం, ప్రణాళికబద్ధమైన ఖర్చులను సమకూర్చకోవడానికి సహాయపడుతుంది. నగదు ఉపసంహరణ ప్రక్రియ చాలా సులువుగా ఉండడంతో పాటు, కాలపరిమితి ఎంపిక, పన్ను ఆదా ఆప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల ఆధారంగా రుణం కూడా తీసుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు కేవలం డబ్బులు దాచుకోవడానికే తప్ప, ఎక్కువ డబ్బు సంపాదించడానికి పనికిరావు. వడ్డీపై పన్ను విధిస్తారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇది సరిపోదు. వడ్డీ రేట్లలోని హెచ్చుతగ్గులు మన దీర్ఘకాలిక నిధులపై ప్రభవం చూపవచ్చు.
స్థిరాస్తి…
సంప్రదాయంగా వస్తున్న పెట్టుబడి మార్గల్లో గొప్పది సొంత ఇళ్లు. ఇంటిని నిర్మించి సొంతం చేసుకుంటే దాని విలువ క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. దీని వల్ల స్థిరాస్తిపై పెట్టుబడి పెడితే మనం మంచి లాభాలను పొందవచ్చు.
సొంత ఇంటిని నిర్మించుకోవడానికి అవసరమైన స్థలాన్ని కొనాలని అనుకుంటాం. స్థిరత్వం, భద్రతను అందించే స్థిరాస్తి లో పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఆస్తి విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. మన ఆస్తిని మనకి నచ్చినవారికి వారసత్వం గా బదిలీ చేయవచ్చు.
* ముప్పయ్యేల్ల క్రితం పదిలక్షలతో మనం ఒక ఆస్తిని కొన్నాం అనుకుందాం. ఇప్పుడు దాని విలువ సుమారు 3 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అది భారీ లాభం. అప్పడు మనం అంత మొత్తం ఒకేసారి పెట్టుకోకుండా బ్యాంకు లోన్ తీసుకుని ఈఎంఐలు పే చేయడం ద్వారా మనం డబ్బును కోల్పోకుండా ఆస్తిని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పడు ఆ ఆస్తిని మనం కావాలంటే అమ్ముకుని డబ్బును పొందవచ్చు. లేదంటే మన తర్వాత తరానికి అందించవచ్చు.
* స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీ మొత్తంలో సాగే వ్యవహారం. కొనుగోలుకు ఎక్కువ డబ్బు కావాలి. అమ్మాలంటే అంత తొందరగా అయ్యే అవకాశం తక్కువ. వెంటనే మనం చెప్పే రేటు రాకపోవచ్చు.
* నకిలీ పత్రాలు, కబ్జాలు, భూ తగాదాలకు అవకాశం ఉంటుంది.
why equity is more profitable than others
ఈక్విటీ లో ఇన్వెస్ట్ మెంట్..
అత్యుత్తమ, ఆధునిక పెట్టుబడి సాధనం స్టాక్ మార్కెట్. మన దేశంలో దీనిపై అవగాహన తక్కువ. అనుమానాలు ఎక్కువ. ఈ భయాలు దాటి వస్తే చక్కని రాబడి పొందడం ఎవరికైనా సాధ్యం. కాకపోతే ఇక్కడ చూపించుకోవడానికి, గొప్పలు పోవడానికి ఎటువంటి ఆస్తి ఉండదు. కేవలం కంపెనీలో వాటాలు మాత్రమే ఉంటాయి.
* సంపదను సృష్టించుకోవడానికి ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందిస్తాయి. అత్యవసర సమయంలో సులభంగా నగదు పొందవచ్చు. మనం పెట్టుబడులు పెట్టడానికి సిప్ మార్గాన్ని ఎంచుకున్నట్లైతే , క్రమం తప్పకుండా ప్రతి నెలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మనం దీర్ఘకాలంలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడులు పొందవచ్చు.
* రాబడి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటుంది. మనం ఈక్విటీలో సంపాదించే నగదు మనం ఎంచుకున్న స్టాక్ లపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ల పై అవగహన లేనివారు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం కష్టం. ఇది వారి పెట్టుబడులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. మనం షేర్ల బదులు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు రిస్క్ తగ్గించుకోవచ్చు.