వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్`
patience only make you rich in stock market
మార్కెట్‌లో అతిపెద్ద అద్భుతం వాలటాలిటీ. దీన్ని చూసి చాలా మంది భయపడుతుంటారు. కానీ వేచి చూసేవారికి మాత్రం లాభాల పంటే. స్టాక్‌మార్కెట్ అనేది పెరుగుతూ పెరుగుతూ అమాంతం పడిపోతుంది. మళ్లీ పెరుగుతుంది. ఇలా భారీగా పెరిగి పడడాన్ని వాలటాలిటీ అంటారు. అలా పడిపోతే సాధారణ ట్రేడర్లు ఇన్వెస్టర్లు ఖంగారు పడి షేర్లను అమ్మేస్తుంటారు. అలా చేస్తే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే వేచి చూడగలుగుతారో వారే లాభాలు కళ్లజూస్తారు.
never go for short term investment
షార్ట్ టర్మ్ వద్దు..
షార్ట్ టర్మ్ లో మాత్రమే ఉండాలనుకునే వారు వేరే అసెట్ క్లాసెస్ చూసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది.
ఎందుకంటే అవి షార్ట్‌టర్మ్‌లోనే బాగుంటాయి, లాంగ్‌టర్మ్‌లో బాగోవు. కానీ లాంగ్‌టర్మ్ అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లే.
* మార్కెట్లో వాలటాలిటీ ఉందని మనం స్టాక్స్ కి దూరంగా ఉంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రెగ్యులర్ గా ట్రేడ్ చేసిన వారో లేదా షార్ట్ టెర్మ్ ఇన్వెస్టర్స్ కి మత్రమే మార్కెట్ వాలటాలిటీతో సంబంధం. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ చేసేవారు మార్కెట్ ను పెద్దగా పట్టించుకోనవసరం లేదు. స్టాక్ మార్కెట్లో మనీ ఎక్కువ శాతం లాంగ్ టెర్మ్ చేసే వారిదే. అందువల్ల టెంపరరీగా ఈ వాలటాలిటీ వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు బయటకు రావడం గానీ, లోపలికి పోవడం కానీ జరగదు.
* మనం లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్ గా స్టాక్ మార్కెట్లో ప్రతి నెలా కొంత కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే వాలటాలిటీతో మనకి నష్టం కలగదు. మార్కెట్ టెంపరరీ వాలటాలిటీ ఉన్న సరే అందరి పై ఎఫెక్ట్ అవ్వదు. షార్ట్ టెర్మ్ ప్లేయర్స్, ట్రేడర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. మనకున్న అసెట్స్ లో గోల్డ్ అయితే స్టెబిలిటీ ఉంటుంది. సంవత్సరానికి ఏవరేజ్ మీద 10 శాతం వస్తుంది.
what is risk management
రిస్క్‌మేనేజ్‌మెంట్ ముఖ్యం..
స్టాక్‌మార్కెట్లో రిస్క్ మేనేజ్ మెంట్ ముఖ్యం. స్టాక్ మార్కెట్ ను జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ఖచ్చితంగా లాంగ్ టెర్మ్ లో మంచి వెల్త్ ని క్రియేట్ చేయవచ్చు. షార్ట్ టెర్మ్ లో క్యాష్ పై గాని లేదా గోల్డ్ పై గాని ఇన్వెస్ట్ చేస్తే ఇవి టెంపరరీగా తక్కువ మొత్తాన్నే ఇస్తాయి. కానీ లాంగ్ టెర్మ్ లో ఈక్విటీ మార్కెట్ ను బీట్ చేయవు. మన దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు కొంత అమెరికన్ స్టాక్ మార్కెట్లో, కొంత ఇండియన్ లో, కొంత మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల రిస్క్ మేనేజ్ చేయవచ్చు. అందుకే ఏ విధంగా చూసినా స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ అసెట్ క్లాస్.
Leave a Reply