Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపర్ల జోష్‌.. Investor Enthusiasm Surges in Mutual Funds FEATURE NEWS
  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS

కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్ర‌యోజ‌నాలు.. రిస్క్‌లు ఏమిటో తెలుసుకుందామా? New Income Tax Act 2025: Let’s Understand the Benefits and Risks

Posted on 12/05/2026 By admin No Comments on కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్ర‌యోజ‌నాలు.. రిస్క్‌లు ఏమిటో తెలుసుకుందామా? New Income Tax Act 2025: Let’s Understand the Benefits and Risks

దేశంలో పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 (New Income Tax Act 2025) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1961లో రూపొందించిన పాత ఆదాయపు పన్ను చట్టానికి అనేక సవరణలు, మార్పులు, ఉపనిబంధనలు చేర్చడంతో అది సామాన్యులకు అర్థంకాని చట్టంగా మారిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు కూడా సెక్షన్ల గందరగోళంలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత చట్టాన్ని సరళీకరించి కొత్త పద్ధతిలో “న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025”ను అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా పన్ను చెల్లింపుదారులకు అనేక కొత్త సదుపాయాలు కల్పించబడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ సిబ్బంది, చిన్న వ్యాపారులు, ఎన్ఆర్ఐలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు, డిజిటల్ ఆస్తుల యజమానులు వంటి వర్గాలపై ఈ చట్టం ప్రభావం చూపనుంది. మరోవైపు సోషల్ మీడియా ఖర్చుల పర్యవేక్షణ, భారీ నగదు లావాదేవీలపై కఠిన నిబంధనలు, పాన్ నెంబర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు కూడా ఈ చట్టంలో భాగమయ్యాయి. ఇప్పటివరకు ఆదాయపు పన్ను చట్టం అంటే సాధారణ ప్రజల్లో భయం ఉండేది. ఏ సెక్షన్ ఏ ప్రయోజనం ఇస్తుంది? ఏ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి? ఏ డిడక్షన్ ఎక్కడ చూపించాలి? వంటి అనేక సందేహాలు ప్రజలను వేధించేవి. కొత్త చట్టం ద్వారా ఆ గందరగోళాన్ని తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేసినట్లు కనిపిస్తోంది.

సెక్షన్ల గందరగోళానికి చెక్.. Simplification of Tax Structure
1961 ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ప్రతి బడ్జెట్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక సెక్షన్‌కు మరో సబ్‌సెక్షన్, దానికి మినహాయింపులు, మరో ప్రత్యేక నిబంధనలు జోడించడంతో మొత్తం చట్టం భారీ గ్రంథంలా మారిపోయింది. ఫలితంగా పన్ను చెల్లింపుదారులు చిన్న విషయానికీ నిపుణులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టంలో (New Income Tax Act 2025)భారీ స్థాయిలో సరళీకరణ చేపట్టారు. పాత చట్టంలో ఉన్న దాదాపు 800 సెక్షన్లను 500కు కుదించారు. 47 చాప్టర్లను 23కి తగ్గించారు. ఒకే విధమైన నిబంధనలను ఒకేచోట చేర్చి సాధారణ భాషలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా “ఫైనాన్షియల్ ఇయర్”, “అసెస్‌మెంట్ ఇయర్”, “ప్రీవియస్ ఇయర్” అనే మూడు వేర్వేరు పదాలు చాలా మందికి గందరగోళం సృష్టించేవి. పన్ను చెల్లించే సంవత్సరం ఏది? ఆదాయం సంపాదించిన సంవత్సరం ఏది? రిటర్న్ ఫైల్ చేసే సంవత్సరం ఏది? అన్న సందేహాలు కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి. ఇప్పుడు ఆ మూడు పదాల స్థానంలో “టాక్స్ ఇయర్” అనే ఒకే పదాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల సాధారణ ఉద్యోగులకు, మొదటిసారి రిటర్న్ ఫైల్ చేసేవారికి ప్రక్రియ మరింత సులభమవుతుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు.

రిటర్న్ ఫైలింగ్‌కు అదనపు సమయం.. Extended Return Filing Deadlines
కొత్త చట్టంలో(New Income Tax Act 2025) మరో ముఖ్యమైన మార్పు రిటర్న్ ఫైలింగ్ డెడ్‌లైన్లకు సంబంధించింది. ఇప్పటివరకు జూలై 31 తేదీని సాధారణ ఉద్యోగుల రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీగా పరిగణించేవారు. ఈ వ్యవస్థలో పెద్ద మార్పు లేకపోయినా వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు మాత్రం ఉపశమనం లభించింది. ఇప్పటివరకు ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కొత్త చట్టంలో ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వడం ద్వారా వారికి అదనపు అవకాశం కల్పించారు. రివైజ్డ్ రిటర్న్స్ విషయంలో కూడా ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. గతంలో పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకునే సమయం పరిమితంగా ఉండేది. ఇప్పుడు మార్చి 31 వరకు రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల ట్యాక్స్ పేయర్లు ఒత్తిడి లేకుండా తమ లెక్కలను సరిచేసుకునే వీలు ఉంటుంది. చిన్నపాటి తప్పిదాల కారణంగా జరిమానాలు, నోటీసులు రావడం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మారిపోయిన సెక్షన్లు.. కొత్త నెంబర్లతో కొత్త గందరగోళమా? Renumbering of Important Sections
కొత్త చట్టంలో (New Income Tax Act 2025)పాత సెక్షన్లకు కొత్త నెంబర్లు కేటాయించడం మరో ప్రధాన అంశం. పన్ను చెల్లింపుదారులు సంవత్సరాలుగా గుర్తుంచుకున్న 80సీ, 80డి, 24బి వంటి సెక్షన్లు ఇప్పుడు కొత్త సంఖ్యలతో కనిపించనున్నాయి. ఉదాహరణకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇప్పటివరకు సెక్షన్ 24బి కింద ఉండేది. ఇప్పుడు అది సెక్షన్ 22గా మారింది. స్టాండర్డ్ డిడక్షన్ సెక్షన్ 16ఏ నుంచి సెక్షన్ 19కి మార్చబడింది. ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెక్షన్ 22 నుంచి 20కి వచ్చింది. అలాగే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌పై వచ్చే వడ్డీకి వర్తించే 80టిటీఏ ఇప్పుడు సెక్షన్ 153గా మారింది. ఉద్యోగులు ఎక్కువగా వినియోగించే 80సీ ఇప్పుడు సెక్షన్ 123 కిందకి వెళ్లింది. ఎన్పీఎస్ డిడక్షన్లు 124 కిందకి, హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన 80డి ఇప్పుడు 126గా మారింది. ఈ మార్పులు తొలుత గందరగోళం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఒకే రకమైన డిడక్షన్లను సమూహాలుగా విభజించి సరళమైన నిర్మాణం తీసుకురావడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ట్యాక్స్ కన్సల్టెంట్లు మాత్రం మొదటి రెండు మూడు సంవత్సరాలు పాత సెక్షన్లను గుర్తు చేసుకుంటూనే కొత్త వ్యవస్థకు అలవాటు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇన్సూరెన్స్‌పై కొత్త దృష్టి.. Insurance Beyond Tax Saving
ప్రతి ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వస్తే ఉద్యోగులు ఎక్కువగా చేసే పని ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ల కోసం పరుగులు పెట్టడం. చాలామంది చివరి నిమిషంలో ఏదో ఒక పాలసీ తీసుకొని 80సీ పరిమితిని పూర్తి చేస్తుంటారు. కానీ కొత్త చట్టం (New Income Tax Act 2025)నేపథ్యంలో నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటిని కేవలం ట్యాక్స్ సేవింగ్ కోసమే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రత కోసం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, తీవ్రమైన అనారోగ్యం వచ్చినా కుటుంబం ఆర్థికంగా కుదేలవకుండా ఉండటానికి టర్మ్ పాలసీలు కీలకం అవుతాయి. అలాగే వైద్యర్చులు భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసరమైంది. చాలామంది పాలసీ తీసుకునే సమయంలో మాత్రమే ఏజెంట్లను సంప్రదిస్తారు. కానీ క్లెయిమ్ సమయంలో సరైన సహాయం దొరకక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే నిపుణుల సలహా తీసుకొని సరైన పాలసీ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

ఫారముల సంఖ్యల్లోనూ మార్పులు.. Changes in Tax Forms and Documentation
సెక్షన్లతో పాటు ఫారముల నెంబర్లు కూడా మారాయి. సాధారణంగా బ్యాంక్ వడ్డీపై టీడీఎస్ తప్పించుకోవడానికి ఉపయోగించే ఫారం 15జీ, 15హెచ్ ఇప్పుడు కొత్త సెక్షన్ కిందకి వెళ్లాయి. ఫారం 16ఏ, ఫారం 26ఏఎస్ వంటి డాక్యుమెంట్లకు కూడా కొత్త కోడ్‌లు కేటాయించారు. ఇప్పటివరకు ఫారం నెంబర్లు గుర్తుంచుకోవడమే చాలామందికి కష్టంగా ఉండేది. ఇప్పుడు అవి కొత్త కోడ్‌లతో రావడంతో మొదట్లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం డిజిటల్ గైడ్‌లైన్లు, పీడీఎఫ్‌లు, ఆన్‌లైన్ సహాయ కేంద్రాల ద్వారా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది.

క్రిప్టోపై కఠిన పన్ను విధానం.. Tax Rules for Digital Assets
డిజిటల్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టమైన విధానం అవలంబిస్తోంది. గత కొన్నేళ్లుగా బిట్‌కాయిన్, ఈథిరియం వంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై పన్ను నియమాలను కఠినతరం చేశారు. క్రిప్టో ద్వారా వచ్చిన లాభాలపై 30 శాతం పన్ను కొనసాగనుంది. అదేవిధంగా ఒక వ్యక్తి మరొకరికి క్రిప్టో గిఫ్ట్‌గా ఇస్తే కూడా పన్ను వర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య జరిగే బహుమతులపై కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి. ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను పూర్తిగా ట్రాక్ చేయగలిగే విధంగా నిబంధనలు రూపొందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో క్రిప్టో లావాదేవీలపై మరింత కఠిన పర్యవేక్షణ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఎన్ఆర్ఐలకు ఉపశమనం.. Relief for NRIs
విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు డబుల్ టాక్సేషన్ ఎప్పటినుంచో సమస్యగా ఉంది. ఒక దేశంలో సంపాదించిన ఆదాయంపై అక్కడ పన్ను చెల్లించడంతో పాటు భారతదేశంలో కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడేవి. కొత్త చట్టంలో (New Income Tax Act 2025)డబుల్ టాక్స్ అవాయిడెన్స్ ఒప్పందాలపై మరింత స్పష్టత ఇచ్చారు. విదేశాల్లో సంపాదించిన ఆదాయం, భారత్‌లోని పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాలపై వర్తించే నిబంధనలను సులభతరం చేసే ప్రయత్నం చేశారు. ఎన్ఆర్ఐలకు పన్ను ఫైలింగ్ ప్రక్రియను డిజిటల్ రూపంలో మరింత సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.

అలవెన్సుల్లో భారీ పెంపు.. Increase in Employee Allowances
కొత్త చట్టంలో(New Income Tax Act 2025) ఉద్యోగులకు అత్యంత ఆసక్తికరమైన అంశం అలవెన్సుల పెంపు. ముఖ్యంగా పాత టాక్స్ రిజీమ్‌ను కొనసాగిస్తున్న ఉద్యోగులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్సు గతంలో చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు దానిని భారీగా పెంచారు. హాస్టల్ అలవెన్సులు, మిల్ అలవెన్సులు కూడా పెరిగాయి. నాన్ క్యాష్ గిఫ్ట్ అలవెన్సు పరిమితిని మూడు రెట్లు పెంచడం ఉద్యోగులకు ఉపయోగకరంగా మారనుంది. కంపెనీ కార్ల వినియోగంపై కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కార్ లీజ్ పాలసీల్లో డ్రైవర్ అలవెన్సులు, వాహన వినియోగ పరిమితులు పెరగడంతో కార్పొరేట్ ఉద్యోగులకు కొంత అదనపు ప్రయోజనం లభించనుంది. అదేవిధంగా విదేశీ వైద్య చికిత్స ఖర్చుల విషయంలో ఆదాయ పరిమితిని ₹2 లక్షల నుంచి ₹8 లక్షలకు పెంచడం మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగకరంగా మారనుంది. నిపుణుల లెక్కల ప్రకారం ఈ అలవెన్సులను సమర్థంగా వినియోగిస్తే 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నవారికి వేల రూపాయల మేర అదనపు పన్ను ఆదా కావచ్చు.

హెచ్‌ఆర్‌ఏలో మెట్రో నగరాలకు భారీ లాభం.. Major HRA Benefits for Metro Cities
హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో అద్దె భారం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తమ జీతంలో పెద్ద భాగాన్ని ఇంటి అద్దెకే ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొత్త చట్టంలో కొన్ని నగరాలను మెట్రోపాలిటన్ జాబితాలో చేర్చడం ద్వారా అక్కడ పనిచేసే ఉద్యోగులకు 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ ఎగ్జంప్షన్ ప్రయోజనం లభించే అవకాశం కల్పించారు. దీనివల్ల పెద్ద నగరాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు సరైన డాక్యుమెంటేషన్‌తో పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంది.

పాన్ లేకుండా లావాదేవీలు కష్టమే.. PAN Rules Become Stricter
కొత్త చట్టంలో(New Income Tax Act 2025) పాన్ నెంబర్ వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. భారీ నగదు లావాదేవీలు, వాహన కొనుగోళ్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై పాన్ తప్పనిసరి చేశారు. ఇప్పటివరకు ₹20 లక్షల నగదు ఉపసంహరణకు పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని ₹10 లక్షలకు తగ్గించారు. అంటే ₹10 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి మరింత కేంద్రీకృతం కానుంది. వాహన కొనుగోళ్ల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ట్రాక్టర్లను మినహాయించి ₹5 లక్షలకు మించిన వాహన కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేశారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లలో భారీ బిల్లుల చెల్లింపులపైనా పాన్ అవసరం అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా పెద్ద మొత్తంలో నగదు వినియోగాన్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సోషల్ మీడియాపై ఐటీ నిఘా.. Income Tax Surveillance on Social Media
కొత్త చట్టంలో (New Income Tax Act 2025)అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం సోషల్ మీడియా పర్యవేక్షణ. ఇప్పటివరకు బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, పన్ను రికార్డుల ఆధారంగా మాత్రమే ఐటీ శాఖ తన పరిశీలనలు జరిపేది. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కూడా వారి దృష్టిలోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాల్లో లగ్జరీ కార్లు, విదేశీ టూర్లు, ఖరీదైన వాచీలు, బ్రాండెడ్ దుస్తులు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తుంటే.. అతను ప్రకటించిన ఆదాయం ఆ ఖర్చులకు సరిపోతుందా లేదా అన్నది పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వేదికల్లో అధిక వ్యయ జీవనశైలిని ప్రదర్శిస్తూ తక్కువ ఆదాయం చూపితే నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల సోషల్ మీడియాలో ప్రదర్శన కోసం ఖర్చులు చేసే వారి మధ్య ఆందోళన పెరుగుతోంది. మరోవైపు పారదర్శక ఆర్థిక వ్యవస్థ కోసం ఇది అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఊరట.. No Major Shock for Investors
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు కొత్త చట్టంపై(New Income Tax Act 2025) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, పెద్ద మార్పులు లేవని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు సంబంధించిన కొన్ని మార్పులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. వాటిని మరింత స్పష్టంగా కొత్త చట్టంలో చేర్చారు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే సాధారణ ఇన్వెస్టర్లకు పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు, డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడులపై ప్రస్తుతం ఉన్న విధానాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ భవిష్యత్తులో డిజిటల్ ట్రాకింగ్, ఆటోమేటెడ్ రిపోర్టింగ్ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది.

పాత టాక్స్ రిజీమ్‌కు ముగిసిందా? Old Tax Regime Still Exists
కొత్త చట్టం అమల్లోకి రావడంతో పాత టాక్స్ రిజీమ్ పూర్తిగా రద్దవుతుందని చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాత రిజీమ్‌లో ఇంకా అనేక అలవెన్సులు, డిడక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్న ఉద్యోగులు, హోమ్ లోన్లు తీసుకున్నవారు, ఇన్సూరెన్స్ పెట్టుబడులు పెట్టేవారికి పాత రిజీమ్ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు కొత్త టాక్స్ (New Income Tax Act 2025)రిజీమ్ సరళమైనదైనా, అందులో చాలా డిడక్షన్లు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రతి వ్యక్తి తన ఆదాయం, పెట్టుబడులు, ఖర్చులు, కుటుంబ పరిస్థితులను బట్టి సరైన ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తగా లేనివారికి నోటీసుల ముప్పు.. Higher Compliance and Monitoring
కొత్త చట్టం(New Income Tax Act 2025) ద్వారా ప్రభుత్వం ఒకవైపు సరళీకరణ తీసుకొచ్చినా, మరోవైపు పర్యవేక్షణను కూడా కఠినతరం చేస్తోంది. బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, పాన్ వినియోగం, సోషల్ మీడియా ప్రదర్శనలు అన్నీ ఇప్పుడు ఒకే వ్యవస్థలోకి వస్తున్నాయి. అధిక ఖర్చులు చేస్తూ తక్కువ ఆదాయం చూపించే వారిపై నిఘా మరింత పెరగనుంది. రిటర్న్ ఫైలింగ్‌లో చిన్న పొరపాట్లు చేసినా ఆటోమేటెడ్ సిస్టమ్ వెంటనే గుర్తించే అవకాశం ఉంది. అందుకే ప్రతి పన్ను చెల్లింపుదారుడు సరైన డాక్యుమెంటేషన్ నిర్వహించడం, ఖర్చుల రికార్డులు ఉంచుకోవడం, బ్యాంక్ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మార్పులకు సిద్ధమవుతున్న మధ్యతరగతి.. Middle Class Preparing for Transition
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 (New Income Tax Act 2025)దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే కాకుండా డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడం కూడా ఈ చట్టం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఉద్యోగులు ఇప్పుడు తమ జీత నిర్మాణాన్ని మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ అలవెన్సులు కొనసాగుతాయి? ఏవి నిలిచిపోతాయి? ఏ రిజీమ్ లాభదాయకం? వంటి అంశాలపై కంపెనీలు కూడా ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా తమ ఆదాయ లెక్కల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కొత్త చట్టం పూర్తిస్థాయిలో అర్థమయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, పన్ను వ్యవస్థను సులభతరం చేసే దిశగా ఇది ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

ఆర్థిక క్రమశిక్షణే భవిష్యత్తుకు రక్షణ.. Financial Discipline is the Key
న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025(New Income Tax Act 2025) ఒక సాధారణ చట్ట మార్పు మాత్రమే కాదు. ఇది దేశంలో పన్ను చెల్లింపు విధానాన్ని పూర్తిగా డిజిటల్, పారదర్శక, నియంత్రిత వ్యవస్థ వైపు తీసుకెళ్తున్న సంకేతంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు టాక్స్ సేవింగ్ కోసం చివరి నిమిషంలో పెట్టుబడులు పెట్టే అలవాటు ఉన్నవారు ఇకపై ఏడాది ప్రారంభం నుంచే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సోషల్ మీడియా ప్రదర్శనలు, భారీ ఖర్చులు, నగదు లావాదేవీలు అన్నీ ఇప్పుడు పన్ను వ్యవస్థ దృష్టిలోకి వస్తున్నాయి. అందుకే సరైన ఇన్సూరెన్స్, పారదర్శక ఆదాయ ప్రకటనలు, సమయానికి రిటర్న్ ఫైలింగ్, ఖర్చుల సరైన రికార్డులు నిర్వహించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారుతోంది. కొత్త చట్టం తెచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, నిబంధనలను అర్థం చేసుకొని ముందుకు సాగితే పన్ను భారం తగ్గించుకోవడమే కాకుండా భవిష్యత్తు ఆర్థిక భద్రతను కూడా బలోపేతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

32
FEATURE NEWS Tags:Changes in Tax Forms and Documentation, Extended Return Filing Deadlines, Financial Discipline Is the Key, Higher Compliance and Monitoring, Income Tax Surveillance on Social Media, Increase in Employee Allowances, Insurance Beyond Tax Saving, Major HRA Benefits for Metro Cities, Middle Class Preparing for Transition, No Major Shock for Investors, Old Tax Regime Still Exists, PAN Rules Become Stricter, Relief for NRIs, Renumbering of Important Sections, Simplification of Tax Structure, Tax Rules for Digital Assets

Post navigation

Previous Post: ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
Next Post: మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపర్ల జోష్‌.. Investor Enthusiasm Surges in Mutual Funds

Related Posts

  • ప్రతీ ఒక్కరికీ 3 Portfolios ఎందుకుండాలి? Stock ఎప్పుడు అమ్మేయాలి? 3 ‘L’s సూత్రమేంటి? Why Should Everyone Have 3 Portfolios? When Should You Sell a Stock? What is the 3 ‘L’s Principle? FEATURE NEWS
  • దేశంలో కొన్ని రంగాల్లో భారీ వేతనాలు.. నైపుణ్యం ఉన్నవారికి కోట్లలో ప్యాకేజీలు! Huge Salaries in Some Sectors in India.. Companies Offering Crore Packages for Skilled Professionals! FEATURE NEWS
  • పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులివే.. ! Alert for Taxpayers: Major Changes from April 1 FEATURE NEWS
  • 2027 ఏప్రిల్‌ నుంచి ఈసీఎల్‌ నిబంధనలు.. బ్యాంకింగ్‌ రంగంలో పెను మార్పులు.. Banking Sector Transformation with ECL Rules from April 2027 FEATURE NEWS
  • క్రెడిట్‌ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options FEATURE NEWS
  • స‌రిగా వినియోగిస్తే.. క్రెడిట్‌ కార్డు ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. ఆర్థిక మిత్రుడు కూడా..!! When Used Wisely… A Credit Card Is Not Just a Financial Tool, But a Financial Companion Too!! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపర్ల జోష్‌.. Investor Enthusiasm Surges in Mutual Funds
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్ర‌యోజ‌నాలు.. రిస్క్‌లు ఏమిటో తెలుసుకుందామా? New Income Tax Act 2025: Let’s Understand the Benefits and Risks
  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • స్టాక్ మార్కెట్ లో స్మాల్ కేస్ ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి What is Small Case Investing in Stock Market INVESTMENTS
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks FEATURE NEWS
  • పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future FEATURE NEWS
  • బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి! Planning to Close Your Bank Account?.. Here’s the Simple Process FEATURE NEWS
  • ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary! FEATURE NEWS
  • తక్కువ వెయిటింగ్‌ పీరియడ్ తో బీమా పాలసీని ఎలా తీసుకోవాలంటే? How to Choose a Health Insurance Policy with a Low Waiting Period INSURANCE
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme