Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

తక్కువ వెయిటింగ్‌ పీరియడ్ తో బీమా పాలసీని ఎలా తీసుకోవాలంటే? How to Choose a Health Insurance Policy with a Low Waiting Period

Posted on 10/12/2025 By admin No Comments on తక్కువ వెయిటింగ్‌ పీరియడ్ తో బీమా పాలసీని ఎలా తీసుకోవాలంటే? How to Choose a Health Insurance Policy with a Low Waiting Period

ఆరోగ్య బీమా అనేది నేటి ప్ర‌తి కుటుంబాలకు తప్పనిసరి భద్రత. అయితే పాలసీ తీసుకున్న వెంటనే మొత్తం ప్రయోజనాలు లభించవు. ఎక్కువశాతం పాలసీల్లో ముందస్తుగా నిర్దేశించిన వెయిటింగ్‌ పీరియడ్‌ కారణంగా కొన్ని రుగ్మతలకు తక్షణంగా క్లెయిమ్‌ చేయలేని పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో తక్కువ వెయిటింగ్‌ గల పాలసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. మరి అలాంటి పాలసీని ఎంచుకోవాలంటే ఏం చూడాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కనిష్ఠ వెయిటింగ్‌ పీరియడ్‌తో..With the Minimum Waiting Period…

పెరుగుతున్న వైద్య ఖర్చులు మధ్యప్రదేశ్‌, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోను కుటుంబాలకు పెద్ద భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఒక తప్పనిసరి రక్షణ గా మారింది. అయితే అనారోగ్య చరిత్ర ఉన్న వారికి వెయిటింగ్‌ పీరియడ్ ‌యనే అంశం పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. వెంటనే కవర్‌ కావాలనుకునే వారికి ఇది క్లిష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కనిష్ఠ వెయిటింగ్‌ పీరియడ్‌ గల బీమా పాలసీలు మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయి.

రైడర్లు కీలకం..Riders Are Crucial

తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ గల పాలసీ తీసుకోాలంటే రైడర్లు, ప్రత్యేక ఆన్‌లైన్‌ ఆఫర్లు, టాప్‌-అప్‌ ప్లాన్లు, PED నిబంధనలను సరిచూసుకోవడం కీలకం. కొంచెం పరిశీలనతోనే కుటుంబానికి అత్యవసర సమయాల్లో బీమా రక్షణను పొందవచ్చు. బీమా సంస్థలు కొన్ని ప్రత్యేక రైడర్లతో తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఆప్షన్లు ఇస్తుంటాయి. ఇవి కొంత అదనపు ప్రీమియం చెల్లించాల్సి వచ్చినా, ప్రయోజనం మాత్రం ఎక్కువే. ముఖ్యంగా మేటర్నిటీ కవర్‌, క్రిటికల్‌ ఇల్ల్నెస్‌, డే-1 కవరేజ్‌ వంటి రైడర్లను ఎంపిక చేస్తే వేచిచూడాల్సిన రోజుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

ఆన్‌లైన్‌ పాలసీల్లో ప్రయోజనం..Advantages of Online Insurance Policies

చాలా కంపెనీలు ఆన్‌లైన్‌ కొనుగోలుకు ప్రత్యేక ప్లాన్లు అందిస్తున్నాయి. వీటిలో వెయిటింగ్‌ పీరియడ్‌ తక్కువగా ఉండే అవకాశం ఎక్కువ. మధ్యవర్తులు లేకపోవడంతో కస్టమర్‌కి తక్కువ ప్రీమియంతోనే మెరుగైన కవరేజ్‌ దొరుకుతుంది.

ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌ (PED) చెక్‌ చేయాలి..Check Pre-Existing Diseases (PED) Carefully

ముందుగా ఉన్న వ్యాధులకు సాధారణంగా 2–4 సంవత్సరాల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. అయితే కొన్ని నూతన ప్రోమోషనల్‌ పాలసీల్లో దీనిని 1 సంవత్సరం వరకూ తగ్గిస్తున్నారు. పాలసీ కొనుగోలు ముందు PED వెయిటింగ్‌ పీరియడ్‌ వివరాలు తప్పనిసరిగా చదవాలి.

టాప్‌-అప్‌ ప్లాన్లలో వేయిటింగ్‌ తక్కువ.. Shorter Waiting Period in Top-Up Plans

టాప్‌-అప్‌, సూపర్‌ టాప్‌-అప్‌ ప్లాన్లలో సాధారణంగా వెయిటింగ్‌ పీరియడ్‌ తక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్య బీమా ఉన్నవారు ఈ ప్లాన్లు తీసుకుంటే అధిక కవరేజ్‌తో పాటు తక్కువ వేచిచూచే కాలం లభిస్తుంది.

కొత్తగా వచ్చిన ప్లాన్లపై దృష్టి పెట్టాలి…Focus on Newly Launched Plans

బీమా రంగంలో పోటీ పెరగడంతో చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి 0–30 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌తో కూడిన ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌, IRDAI పోర్టల్‌ను పరిశీలిస్తే ఈ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

మెడికల్‌ చెకప్‌ ఉంటే వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గొచ్చు.. Medical Check-Up Can Reduce the Waiting Period

పాలసీ తీసుకునే సమయంలో హెల్త్‌ చెకప్‌ చేయిస్తే ఇన్సూరెన్స్‌ కంపెనీలు రిస్క్‌ను స్పష్టంగా అంచనా వేయగలవు. దీంతో కొన్ని సందర్భాల్లో ప్రత్యేక రుగ్మతలపై వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గించే అవకాశముంది.

పాలసీ డాక్యుమెంట్‌ పూర్తిగా చదవాలి..Read the Policy Document Thoroughly

వెయిటింగ్‌ పీరియడ్‌ వివరాలు పాలసీ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉంటాయి. ఏ రుగ్మతకు ఎంత కాలం వేచి ఉండాలి? ఏవి డే-1 నుంచే కవర్‌ అవుతాయి? వంటి వివరాలు తెలుసుకోకుండా పాలసీ కొనుగోలు చేయడం మంచిది కాదు.

వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే..? What Is a Waiting Period?

పాలసీ కొనుగోలు చేసిన వెంటనే అన్ని ప్రయోజనాలు అమల్లోకి రావు. బీమా పొందిన వ్యక్తి కొన్ని ప్రయోజనాలకు అర్హత పొందే వరకు ఉండే గడువునే వెయిటింగ్‌ పీరియడ్‌ అంటారు. ఇది మొత్తం పాలసీకి లేదా కొన్ని ప్రత్యేక వ్యాధులకు వర్తిస్తుంది. సాధారణంగా ఒక నెల ప్రారంభ వెయిటింగ్‌ పీరియడ్ ఉంటే ప్రమాదాలు మాత్రం మినహాయింపు ఉంటుంది. నిర్దిష్ట వ్యాధులు , ENT సమస్యలు, హెర్నియా, ఆస్టియోపోరోసిస్, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ వంటి వాటికి ముందే నిర్ణయించిన వెయిటింగ్‌ పీరియడ్లు ఉంటాయి. ఇటీవల IRDAI తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, ముందస్తు వ్యాధుల (PED) కవరేజీకి ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ను 48 నెలల నుంచి 36 నెలలకు కుదించారు. అంటే పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాలు పూర్తయ్యాక ఆ వ్యాధిని కారణంగా చూపి కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించలేవన్నమాట.

అదనపు ప్రీమియంతో డే–1 కవర్‌ కూడా! Day-1 Coverage with an Extra Premium!

ప్రతి బీమా సంస్థ PEDలకు వేర్వేరు వెయిటింగ్‌ పీరియడ్‌ను నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో మధుమేహం, బీపీ వంటి వ్యాధులున్న వారికి 3–4 ఏళ్ల తరువాతే పూర్తి కవరేజీ లభిస్తుంది. కానీ అదనపు ప్రీమియం చెల్లించి డే–1 కవరేజ్‌ అడాన్‌ ప్లాన్‌లు పొందొచ్చు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఇది మరింత ప్రయోజనకరం. కొందరు బీమా సంస్థలు కో–పే నిబంధనతో వేయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించే అవకాశాన్ని కూడా ఇస్తున్నాయి. ప్రసూతి బీమాలో వెయిటింగ్‌ పీరియడ్‌ ఇప్పటివరకు 3–4 సంవత్సరాలు ఉండేది. కానీ ఇటీవల 9–24 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌తో కూడిన ప్లాన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. డెలివరీ, ప్రీనేటల్‌ చెకప్‌లు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువు టీకాలు వంటి ఖర్చులు విస్తృతంగా కవర్‌ అవుతాయి. ప్రస్తుత పాలసీలో మెటర్నిటీ కవర్‌ లేకపోతే టాప్–అప్‌ లేదా రైడర్‌ ప్లాన్‌ ద్వారా తక్కువ వెయిటింగ్‌తోనే ప్రయోజనం పొందవచ్చు. పెళ్లైన దంపతులు తొందరగా మెటర్నిటీ కవర్‌ తీసుకోవడం మంచిది. గర్భధారణకు ముందే వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తవుతుంది.

యువతకు బంగారు అవకాశం.. A Golden Opportunity for Youth

వెయిటింగ్‌ పీరియడ్‌ను అధిగమించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే సంపాదన ప్రారంభ దశలోనే పాలసీ కొనుగోలు చేయడం. ఈ వయసులో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోయే అవకాశం ఉండడంతో, వెయిటింగ్‌ పీరియడ్‌ ఆటోమేటిగానే గడిచిపోతుంది. తద్వారా అవసరమైన సమయంలో పూర్తి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

జీరో వెయిటింగ్‌ పీరియడ్‌ పాలసీలు కూడా..! Zero Waiting Period Policies Too..!

కొన్ని కంపెనీలు అధిక ప్రీమియంతో సంపూర్ణంగా వెయిటింగ్‌ పీరియడ్‌ లేని పాలసీలను కూడా అందిస్తున్నాయి. తక్షణ కవరేజీ అవసరమున్నవారు వీటిని పరిశీలించవచ్చు.

తక్కువ / జీరో వెయిటింగ్ పీరియడ్ గల కొన్ని populaires పాలసీలు (2025 అప్‌డేట్ ప్రకారం)

Some Health Insurance Policies with Low/Zero Waiting Period

– ACKO Platinum Health Plan : ఇది డే-1 కవర్ (Zero Waiting) కోసం ఒక ఆప్షన్. ప్రస్తుతం ఈ ప్లాన్ “జీరో వెయిటింగ్” గమనించింది.

– Aditya Birla Activ Health Platinum Plan : ఇది Wellness / Chronic-conditions కవరేజ్ కోసం ఉప‌యోగ‌ప‌డుతుంది. తక్కువ వెయిటింగ్ లేదా ప్రత్యేక రైడర్‌లతో వచ్చిన వేరియంట్‌లను అందిస్తుంది.

– Niva Bupa ReAssure 3.0 : Elite / Black వేరియంట్‌లలో “Day-1 PED Cover” ఎంపికతో వేచి ఉండే కాలాన్ని తొలగిస్తుంది.

– Digit Health Plus : కొన్ని వేరియంట్‌లలో pre-existing conditions కోసం రూపొందించిన ప‌థ‌కం. తక్కువ వెయిటింగ్ ఆప్షన్లను అందిస్తుంది.

 

 

279
INSURANCE Tags:A Golden Opportunity for Youth, Advantages of Online Insurance Policies, Check Pre-Existing Diseases (PED) Carefully, Day-1 Coverage with an Extra Premium!, Focus on Newly Launched Plans, Medical Check-Up Can Reduce the Waiting Period, Read the Policy Document Thoroughly, Riders Are Crucial, Shorter Waiting Period in Top-Up Plans, Some Health Insurance Policies with Low/Zero Waiting Period, What Is a Waiting Period?, With the Minimum Waiting Period…, Zero Waiting Period Policies Too..!

Post navigation

Previous Post: లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing!
Next Post: కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents

Related Posts

  • ఆరోగ్య బీమా , అత్యవసర నిధిలో ఏది అవ‌స‌రమంటే? Health Insurance vs Emergency Fund – Which Is the Right Choice? INSURANCE
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాల‌సీలు.. అవేమిటో తెలుసుకుందాం! Two New LIC Policies — Let’s Find Out What They Are! INSURANCE
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • ఆరోగ్య బీమా.. అన్ని వ‌య‌స్సుల్లో ఆదుకునేలా? Health Insurance – A Lifeline for All Ages! FINICAL PLANNING
  • ఆఫీసు ఇన్సూరెన్స్‌పై మాత్రమే ఆధారపడితే ప్రమాదమే! Relying Only on Office Insurance Can Be Risky! INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • `అత్య‌వ‌స‌ర నిధి` చాలా అవ‌స‌రం FINICAL PLANNING
  • ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable? FEATURE NEWS
  • రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again FEATURE NEWS
  • ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions? FEATURE NEWS
  • నెలకు రూ.4వేల పెట్టుబడితో.. రిటైర్మెంట్ త‌ర్వాత రూ.కోటి! ఇదెలా సాధ్య‌మో తెలుసుకుందామా! ₹4,000 Monthly Investment… ₹1 Crore After Retirement! Let’s See How It’s Possible! INVESTMENTS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • GST అంటే ఏమిటి what is GST FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme