
స్టాక్ మార్కెట్‌లో మరో కొత్త ఆవిష్కరణ చేయనున్నారు. మార్కెట్‌ని సాధారణ పౌరులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకురానుంది. ఎంత పెద్ద కంపెనీ షేరు అయినా మనం వందరూపాయలకు కొనుక్కోవచ్చు. అదెలాగో చూద్దాం..
సాధారణంగా రిలయన్స్ షేరు ధర రూ. 2500. ఇంత ధర పెట్టి ఒక షేరు కొనాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు ఆలోచిస్తారు. కొనడానికి సాహసం చేయరు. కానీ అదే షేరును ఇప్పడు వంద రూపాయలకు అమ్మితే ఎవరైనా కొనేస్తారు. అందుకే సరికొత్తగా ఏ షేరునైనా వంద రూపాయలకే కొనేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఇలా చేస్తే ఒక షేరులో ఆ వందరూపాయలకు తగ్గ భాగాన్ని మనకు ఎలాట్ చేస్తారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ మరింత పెరగనుంది.
మార్కెట్‌లోకి ఎక్కువ నిధులు..
కంపెనీ లా కమిటీ తన నివేదికలో దేశంలో పాక్షిక షేర్లను అనుమతించాలని సిఫార్స్ చేసింది. ఇప్పటి వరకు యూఎస్, యూకే, జపాన్ తో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి ఆప్షన్ అందుబాటులో ఉంది. ప్రస్తుత కంపెనీస్ యాక్ట్ ప్రకారం కంపెనీలకు బయట నుంచి షేర్లను జారీ చేయడానికి అనుమతి లేదని కమిటీ తెలిపింది. దీన్ని అనుమతించినట్లయితే, రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువ విలువ కలిగిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు. దీనివల్ల క్యాపిటల్ మార్కెట్ కు ఎక్కువ నిధులు వస్తాయన్నారు. స్టాక్ మార్కెట్ లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని లెక్కలోనికి తీసుకుంటే ప్రాక్షనల్ షేర్ల ట్రేడింగ్ ను అనుమతించాలనే సిఫార్స్ మంచి నిర్ణయం. ఇది ప్రస్తుతం పెట్టుబడి పెట్టలేని స్టాక్స్ ల్లో చిన్న పెట్టుబడిదారులు డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం వస్తుందన్నారు.
what is the benefit with fractional stocks
ఫ్రాక్షనల్ స్టాక్ తో మేలే..
ఫ్రాక్షనల్ స్టాక్ నిర్ణయం కంపెనీలకు, పెట్టుబడిదారులకు విన్ విన్ స్ట్రాటజీగా చెప్పుకోవాలి. దీనివల్ల ఇద్దరికీ లాభం ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని పెట్టుబడికి కనీస యూనిట్ షేర్. అంటే కంపెనీలో కనీసం ఒక్క షేర్ అయినా కొనాలని నిబంధన ఉంది. టైర్ కంపెనీ ఎమ్ ఆర్ఎఫ్ షేరు రూ.67,500 అత్యంత ఖరీదైనది. పాక్షిక వాటా అనేది షేర్ లో కొంతభాగం. మీరు ఎమ్ఆర్ఎఫ్ లో 100 రూపాయలు పాక్షిక వాటాను తీసుకుంటే, మనం దానిలో 675వ వంతున పొందవచ్చు.
* పెట్టుబడిదారులు వాటిని ట్రస్టీ ద్వారా కూడా అమ్మవచ్చు. షేర్ హోల్డర్లు తమ వాటాను అమ్మినపుడు సమానమైన మొత్తాన్ని పొందవచ్చు. అటువంటి వాటాదారులు కంపెనీ జారీ చేసిన డివిడెండ్ ను వారీ వాటా రేషియాలో పొందుతారు. ఎవరైనా ప్రతి నెలా ఎక్కువ షేర్లను కొనాలనుకుంటే రిలయన్స్, టీసీఎస్ లేదా నెస్లే షేర్లను ప్రస్తుత పద్ధతిలో కొనలేరు. ఎందుకంటే ఈ షేర్ల ధర 1000 రూపాయల కంటే ఎక్కువ.