
why anil ambani fail in business
మెల్లగా మొదలై అంచలంచెలుగా గొప్ప వ్యాపారవేత్తగా, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగిన ధీరూబాయి అంబానీకి ఇద్దరు కొడుకులు. వీళ్ళిద్దరూ బెస్ట్ స్కూల్లో చదివారు. బెస్ట్ కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు. ధీరుబాయి అంబానీ మరణాంతరం ఇద్దరికీ సమానంగా ఆస్తులు వచ్చాయి.
ఇలా జరిగిన 20 సంవత్సరాల తర్వాత పెద్దవాడైన ముఖేష్ అంబానీ దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడయ్యాడు. కానీ ఇదే సమయంలో అనిల్ అంబానీ రిచెస్ట్ పర్సన్ నుంచి దివాలా తీసే స్థితికి వచ్చారు. ఏం…? ఎలా..? ఓ సారి చూద్దాం.
what happend after dhirubhai ambani death
ధీరూబాయి మరణానంతరం..
2002లో ధీరుబాయ్ అంబానీ చనిపోయారు. ఆయన చనిపోయాక రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చైర్మెన్ గా ముఖేష్ అంబానీ, వైస్ చైర్మెన్ గా అనిల్ అంబానీ బాధ్యతలు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని నడిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడంతో ధీరుబాయ్ ఆస్తిని రెండు భాగాలుగా విభజించి పెట్రో కెమికల్ కి సంబంధించిన ఆస్తులను ముఖేష్ అంబానీకి ఇచ్చారు. అందులో రిలయన్స్ ఇండస్ట్రిస్ లిమిటెడ్, ఇండియన్ పెట్రోల్ కెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. అనిల్ అంబానీకి రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీతో పోల్చితే అనిల్ అంబానికి ఎక్కువ గ్రోత్ ఉన్న కంపెనీలు వచ్చాయి. దీనివలన అతను ప్రపంచ ధనవంతులలో 6వ స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత ఏం జరిగింది..
ప్రపంచ ధనవంతుల్లో 6వ స్థానంలో నిలిచి ఇప్పుడు ఎందుకు దివాలా తీసే స్థితిలో ఉన్నారో పరిశీలిద్దాం.
అనీల్ అంబానీ ఎప్పుడూ క్విక్ రిటర్న్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే త్వరగా లాభాలు రావాలని అనుకునేవారు. కానీ క్విక్ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయంటే రిస్క్ కూడా ఎక్కువ ఉన్నట్లే. అనిల్ అంబానీ క్విక్ రిటర్న్స్ వస్తాయని ఎక్కువ బిజినెస్ చేశారు. కానీ బిజినెస్ ప్యూచర్ గురించి తెలుసుకోలేదు. అనిల్ అంబానీ 2015లో ADLABS ENTERTAINMENT కంపెనీని కొన్నారు. మొదట్లో ఈ కంపెనీకి ఎక్కువ లాభాలు వచ్చాయి. తర్వాత భారీ నష్టాలు వచ్చాయి. ఇలా భారీ నష్టాలు రావడానికి కారణం ఏమిటంటే Poor management skills and new technologyని త్వరగా adopt చేసుకోకపోవడం.
* మరో కారణం రిలయన్స్ కమ్యూనికేషన్. ఇది అప్పట్లో చాలా ఫేమస్. రిలయన్స్ లో ఫ్రీ కాల్స్ ఉండేవి లేదా తక్కువ రేటుకి ఇతర కాల్స్ మాట్లాడే సదుపాయం ఉండేది. కానీ ఇక్కడే ఓ పొరపాటు చోటుచేసుకుంది. అప్పట్లో రిలయన్స్ సిమ్ లు CDMA టెక్నాలజీతో ఉండేవి. ప్రస్తుతం మనం ఉపయోగించేవి GSM సిమ్స్. CDMA తో పోల్చితే GSM చాలా ఎక్కువ అడ్వాన్స్డ్ గా ఉంటాయి. అలాగే 4జి అనేది GSM లోనే వర్క్ అయ్యేది. CDMAలో కేవలం 2జి, 3జి వర్క్ అయ్యేది. అలాగే టెలికాం ఇండస్ట్రీ చాలా గ్రోత్ ప్రొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి సహజంగానే కాంపిటేషన్ కూడా ఎక్కువగా ఉంది. అనిల్ కొత్త కమ్యూనికేషన్ అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల రిలయన్స్ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన దేశంలో 4జి లాంచ్ అయ్యిందో అప్పటినుంచి రిలయన్స్ కమ్యూనికేషన్ ఏకంగా దివాళా తీసింది. దీనికి ముఖ్య కారణం రిలయన్స్ కమ్యూనికేషన్ వాడుతున్న CDMA 4జి కి సపోర్ట్ చేయకపోవడం. అదే సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్ డెవలెప్ మెంట్ కోసం తీసుకున్న అప్పులు ఎక్కువ అయ్యాయి. దీనితో అప్పు తీర్చడం కోసం రిలయన్స్ కమ్యూనికేషన్ కి చెందిన లక్ష 78వేల కిలోమీటర్ల పైబర్ ఆఫ్టిక్ నెట్ వర్క్ ను మూడు వేల కోట్లకి ముఖేష్ అంబానీ కంపెనీ అయిన జియో కి అమ్మేశారు. 2007 లో రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్ ప్రైస్ రూ.700 ఉండగా 2020 లో షేర్ ప్రైస్ రూ.70 పడిపోయింది. దీంతో ఇన్‌వెస్టర్లు సైతం భారీగా నష్టపోయారు.
why reliance power falls down
`పవర్` కూడా పోయింది..
రిలయన్స్ పవర్ కంపెనీ కూడా దివాళా తీసింది. చమురు, గ్యాస్ అవి దేశ సంపద అని నిర్ణయించిన ధరకే అమ్మాలని గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేశారు. కంపెనీలకు వచ్చిన లాభాలన్నీ అప్పులు కట్టడానికే సరిపోయాయి. పవర్ ఇండస్ట్రీకి చాలా క్యాపిటల్ కావాలి. అందువల్ల దానికి బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చేవాళ్ళు. ఇలా ఒక్కొక్క కంపెనీ దివాళా తీయడంతో అనిల్ అంబానీ ఆస్తులు కూడా కరిగిపోయాయి. 2019 వచ్చే సరికి అనిల్ అంబానీ కంపెనీలన్నింటికీ కలిపి 43,800 కోట్ల అప్పులు చెల్లించాల్సి వచ్చింది.
ఇలా ముగిసింది..
2003 లో 42 బిలియన్ డాలర్ల ఆస్తిని కలిగి ఉన్న అనిల్ 2019 కి 3 బిలియన్ డాలర్లకి పరిమితమయ్యారు.
ఇందుకు ప్రధానంగా కొన్ని కారణాలను చెప్పుకోవచ్చు.
* కంపెనీల డెవలప్ మెంట్ కోసం ఎక్కువ అప్పులు చేయడం.
* ప్రతి కంపెనీలో సగం, సగం ఫోకస్ పెట్టడంతో ఏ కంపెనీ పైనా సరిగ్గా నిలబడలేక పోవడం.
* ఎంత డబ్బు ఉన్నా వాటిని మేనేజ్ చేసే స్కిల్స్ లేకపోడం.
ఇలాంటి ఎన్నో, మరెన్నో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన చేసిన పొరపాట్లతో అనిల్ అంబానీ పూర్తిగా నేలకొదిగిపోయాడు.