ఆంధ్రప్రదేశ్‌లో బయట భోజనం చేసేవారికి ఇకపై జేబులు ఖాళీ కాక తప్పదు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూ ధరలను (rise in food price)పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (APSHA) వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరను రూ. 933 పెంచడంతో ఒక్క సిలిండర్ ధర రూ. 3,315కు చేరింది. దీంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరలు పెరగడంతో, మన దేశంలోనూ దాని ప్రభావం కనిపిస్తోంది.
మూడు నెలల్లో మూడింతలు
మే 1వ తేదీ నుండి ఒక్కో సిలిండర్‌పై రూ. 993 పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్ వంటి నగరాల్లో సిలిండర్ ధర సుమారు రూ. 3,315కి చేరుకుంది. పెరిగిన పెట్టుబడి వ్యయాలను తట్టుకోవడానికి మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో వాణిజ్య గ్యాస్ ధరలు దాదాపు రూ. 1,303 వరకు పెరిగాయని పేర్కొన్నారు. ఇది హోటల్(rise in food price) పరిశ్రమపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎల్‌పీజీ మాత్రమే కాకుండా, పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న వారు కూడా ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. సవాలక్ష కష్టాలు
హోటల్ నిర్వహణలో గ్యాస్ ప్రధాన ఇంధనం అయినప్పటికీ, ఇతర నిత్యావసరాల ధరలు కూడా తోడవ్వడం యజమానులకు (rise in food price) శాపంగా మారింది.
నిత్యావసర వస్తువులు: వంట నూనెలు, పప్పు దినుసులు, కాయగూరల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్యాకేజింగ్ ఖర్చులు: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మరియు టేక్-అవే సర్వీసులకు అవసరమైన ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.
నిర్వహణ వ్యయం: విద్యుత్ ఛార్జీలు, కార్మికుల వేతనాలు కలిపి హోటల్ నడపడం గగనంగా మారుతోంది.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏపీఎస్హెచ్ఏ ముఖ్యంగా గ్యాస్ ధరలపై సబ్సిడీలు ఇవ్వాలని లేదా పన్ను మినహాయింపులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హోటల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
వినియోగదారులపై ప్రభావం
సాధారణ మధ్యతరగతి ప్రజలకు హోటల్ భోజనం ఇక విలాసంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఈ 10% అదనపు (rise in food price) భారం మరింత ఒత్తిడిని పెంచనుంది. ఏది ఏమైనా, పెరిగిన ధరల ప్రభావం మే నెల నుండే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
