
how much charges for buying a share in stock trading
స్టాక్ మార్కెట్‌లో మనం నిత్యం చేసే ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్‌లో ప్రతి ట్రేడ్ పైనా చార్జీలు ఉంటాయి. మనకు లాభం వచ్చినా, నష్టం వచ్చినా తప్పకుండా ఈ చార్జీలను చెల్లించాల్సిందే.
ఒక స్టాక్ ని కొని అమ్మినప్పుడల్లా ఖచ్చితంగా బ్రోకర్ కి అమౌంట్ పే చేయాలి. కొంతమంది బ్రోకర్స్ డెలివరీ ట్రేడింగ్‌కి ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. కానీ ఇంట్రాడే కి మాత్రం తక్కువ రూ.1 ఛార్జీస్ ఎక్కువగా రూ.20 ఛార్జ్ చేస్తారు. ఇలా చేసే వారు డిస్కౌంట్ బ్రోకర్స్. అదే ట్రెడిషినల్ బ్రోకర్స్ అయితే ట్రాన్సక్షన్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. మనం మంచి బ్రోకర్స్ ఎంచుకోవాలనుకుంటే డిస్కౌంట్ బ్రోకర్స్ ను తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డెలివరీ బేస్డ్ ఫ్రీ గా ఇస్తారు.
మొత్తం ఇంత..
ఈక్విటీ ఇంట్రాడే లో బ్రోకర్ తక్కువ అంటే రూ.1 కలెక్ట్ చేస్తారు. ఎక్కువ అంటే రూ.20 కలెక్ట్ చేస్తారు.
మనం 1 లక్ష రూపాయలు బై చేసిన, లక్ష సెల్ చేసినా బ్రోకర్ 2 ట్రాన్జాక్షన్ కింద లెక్కవేసి గరిష్ఠంగా రూ.40 ఛార్జీ తీసుకుంటారు.
* మనం ఏ ఎక్స్చేంజీలో నుంచి ట్రాన్జాక్షన్ చేస్తున్నామో వారు రూ.7 ఛార్జస్ తీసుకుంటారు.
* సెబీకి కూడా ట్రాన్సక్షన్ ఛార్జస్ ఉంటాయి.
* పైన తెలిపిన మూడు నిబంధనలను కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మనం GST and STT (Security Transaction Tax ) ఈ రెండు పే చేయవలిసి ఉంటుంది.
* మనం పాన్ కార్డ్ ను ఎక్కడైతే ఓపెన్ చేశామో వాళ్ళకి, అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి స్టాంప్ ఛార్జస్ పే చేయవలిసి ఉంటుంది.
ఇలా మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో బై అండ్ సెల్ చేస్తే మొత్తం కలిపి రూ.89 ఛార్జీల రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అదే డెలివరీ బేస్డ్ అయితే STT చాలా ఎక్కువ ఉంటుంది. బ్రోకర్స్ ఫ్రీ గానే డెలివరీ చేస్తారు. కాని మొత్తం ఛార్జస్ చూసుకుంటే రూ.218 ఛార్జస్ అవుతుంది. మనం రూ.1లక్ష స్టాక్స్ బై అండ్ సెల్ చేసిన మొత్తం ఛార్జస్ రూ.220 వరకు అయ్యే అవకాశం ఉంది.
ఇవి అదనం..
what are the additional charges in stock trading
ప్రతి సంవత్సరం ఇన్ కమ్ ట్యాక్స్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా మనకు ఫ్రాఫిట్ వస్తే అందులో 30 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే మనం డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే మనకి వచ్చిన లాభాల్లో 15 శాతం పే చేయాల్సి ఉంటుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో నైనా 1 సంవత్సరం కన్నా ఎక్కువకాలం మనం ఇన్వెస్ట్ చేస్తే మొదటి 1 లక్షకి ట్యాక్స్ ప్రీ తర్వాత నుంచి 10 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ వేరు. ట్రాన్జాక్షన్ ఛార్జెస్ వేరు. మనం ట్రాన్జాక్షన్ లో బ్రోకర్ కి, ఎక్స్చేంజ్ కి, సెబీకి, సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి మనకి ఫ్రాఫిట్ వచ్చినా రాకపోయిన ఛార్జస్ చెల్లించవలసి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కేవలం ఫ్రాఫిట్ మీద ట్యాక్స్ కడతాం. ప్రతి ఒక్క ట్రేడర్స్ కూడా లాస్ పొజిషన్ లో ఉంటే మార్చి 31 లోపు లాస్ పొజిషన్ ను క్లోజ్ చేసుకుంటే మనం గవర్నమెంట్ కట్టవలిసిన ట్యాక్స్ తగ్గుతుంది.