
how much income tax on stock market profits
అన్ని లాభాల లాగానే స్టాక్ మార్కెట్‌లో వచ్చే లాభాలపై కూడా ఇన్కం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ ట్యాక్స్ ఎలా కట్టాలో మనలో చాలా మందికి తెలియదు. మరి నష్టం వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. స్టాక్స్ అదే రోజు కొని ఆ రోజే అమ్మితే వాళ్ళను ట్రేడర్స్ అంటారు. వీళ్లు ప్యూచర్ అండ్ ఆప్షన్ లో కూడా ఆ రోజే స్టాక్స్ కొని ఆ రోజే అమ్మేస్తారు. అయితే ఇక్కడ స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ కింద ట్యాక్స్‌లు మారుతుంటాయి.
what is speculation in stock market
Speculative: ఇంట్రాడే లో స్టాక్స్ ను ట్రేడింగ్ చేయడాన్నే Speculative అంటారు.
non speculative : ప్యూచర్ అండ్ ఆప్షన్ లో ఇంట్రాడే లేదా పొజిషినల్ గా ట్రేడింగ్ చేయడాన్నే non speculative అంటారు.
స్టాక్స్ ను మనం ఇంట్రాడే లో చేస్తున్నామంటే దాని అర్థం డెలివరీ తీసుకోవడం అనేది మన మైండ్ లో లేదు. మనం ఇంట్రాడేలో కొని అమ్మేస్తున్నామంటే ప్రైస్ మూమెంట్ ను పట్టుకుని దానిలో నుంచి డబ్బులు సంపాదించాలనుకోవడం. అందువలన స్టాక్స్ లో చేసే ట్రేడింగ్ ను speculative అంటారు. మరి ప్యూచర్ అండ్ ఆప్షన్ లో కూడా ఇంట్రాడే చేస్తున్నాం కదా అనుకోవచ్చు. కానీ ప్యూచర్ అండ్ ఆప్షన్ ను డిజైన్ చేసిందే హెడ్జింగ్ కోసం. కాబట్టి దానిని non speculative అంటారు.
మనకు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను ఇన్ కమ్ ట్యాక్స్ చెప్పిన టైమ్ లోపు మనం ఫైల్ చేయగలిగితే ఆ నష్టాలను మనం 4 సంవత్సరాల వరకు కేరీ చేసుకోగలరు. ఒక వేళ మనం నష్టాలను ఫైల్ చేయకపోతే అది ఆ సంవత్సరంతో పోతుంది. పాత సంవత్సరం నష్టాలను మనం ఇప్పుడు ఫైల్ చేయలేం. అలాగే ప్యూచర్ అండ్ ఆప్షన్ లో కూడా మనకి వచ్చిన నష్టాలను ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన టైమ్ లోపు మనం ఐటీఆర్ ఫైల్ చేయగలిగితే 8 సంవత్సరాల వరకు మన నష్టాలను అరికట్టవచ్చు.
మనం ఎంత ట్యాక్స్ పే చేయాలనేది మన ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఇంట్రాడే ట్రేడింగ్ లో వచ్చిన లాభాలను అలాగే ప్యూచర్ అండ్ ఆప్షన్ లో వచ్చిన లాభాలకు కలిపి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇది మనకి డైరెక్ట్ ఇన్ కమ్ కి కలిసిపోతుంది. కాబట్టి ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్ కూడా పెరగడానికి స్కోప్ ఉంటుంది.
మనం స్టాక్స్ ను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయడం ద్వారా మనకి 50,000 నష్టం వచ్చింది అనుకుందాం. అదే టైమ్ లో 50,000 ప్యూచర్ అండ్ ఆప్షన్ లో లాభం వస్తే ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలమా…అంటే ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయలేం. కాని 50,000 ఒక వేళ ఇంట్రాడే లో లాభం వస్తే అదే టైమ్ లో ప్యూచర్ అండ్ ఆప్షన్ లో 50,000 నష్టం వస్తే దానిని మనం బ్యాలెన్స్ చేసి 50,000 కి ట్యాక్స్ కట్టవసరం లేదు.
మనకు speculative సెక్షన్ లో నష్టం మనకు వస్తే ఆ నష్టాన్ని మనం 4సంవత్సరాల వరకు carry చేయగలం. లాభం వస్తే ముందు వచ్చిన నష్టంతో బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే ప్యూచర్ అండ్ ఆప్షన్ లో వచ్చిన నష్టాలతో బ్యాలెన్స్ చేయవచ్చు. మనకు non speculative సెక్షన్ లో నష్టం వస్తే దానిని వదిలివేయకుండా 8 సంవత్సరాల వరకు కేరి అవుతుంది.
మనకు ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ప్యూచర్ అండ్ ఆప్షన్ లో నష్టం వచ్చిందో అదే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ ఇన్ కమ్, రెంటల్ ఇన్ కమ్ అదే సంవత్సరానికి సంబంధించిన వాటిలో నుంచి తీసేయాలి. ముందు సంవత్సరాన్ని టచ్ చేయకూడదు. ఒక వేళ ముందు సంవత్సరం మనకి లాభం వస్తే మనకి ప్యూచర్ అండ్ ఆప్షన్ లో మనకి వచ్చిన నష్టాలను ఫైల్ చేసి కేరీ చేసుకుంటూ వస్తున్నట్లయితే అక్కడ వచ్చిన నష్టం ను ఇక్కడ వచ్చిన లాభాలతో బ్యాలెన్స్ చేసుకుని మిగిలిన ఇన్ కమ్ కి మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.
మనకు ఇంట్రాడే, ప్యూచర్ అండ్ ఆప్షన్ లో వస్తున్న మొత్తం ఇన్ కమ్ 2,50,000 కంటే తక్కువ ఉంటే ట్యాక్స్ కట్టనవసరం లేదు. అదే 2,50,000- 5 లక్షల మధ్య ఉంటే ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి తద్వారా రీబేటు పొందవచ్చు.
tax on stocks and mutual funds
స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ పై..
అదే రోజు స్టాక్స్ కొని అదే రోజు అమ్మితే దానిని speculative Businss income లోకి వెళ్తుంది. ఇది మన ఇన్ కమ్ కి add అవుతుంది. speculative Businss income అనేది కేవలం ఇంట్రాడేలో చేసిన స్టాక్స్ మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అదే రోజు కొని అదే రోజు అమ్మలేం కాబట్టి.
మనం స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్ లోనైనా సంవత్సరం లోపు అమ్మితే వచ్చిన లాభాలను short term capital gains అంటారు. దీనిపై మనం 15 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ పే చేస్తాం. అదే మనం 1 సంవత్సరం కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే అది long term capital gains అవుతుంది. మనకి లాభం 1 లక్ష కంటే ఎక్కువ వస్తే దానికి 10 శాతం ట్యాక్స్ కట్టవలిసి ఉంటుంది.
ప్యూచర్ ఆప్షన్ లో వచ్చిన ఇన్ కమ్ ను non speculative Businss income అంటారు. ఆ బిజినెస్ ఇన్ కమ్ అనేది మన నార్మల్ ఇన్ కమ్ తో add అయ్యి దాని ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.