what is trailing stop loss
స్టాక్ మార్కెట్‌లో ప్రాథమికంగా చెప్పే సూత్రం ఏమిటంటే మనం లాభాలను పొందలేకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఇది కొంతవరకు కష్టమే అయినా ఈ పద్ధతిని ఫాలో అయితే కొంతవరకు నష్టాలనుంచి మనం బయటపడవచ్చు. దీనికి ప్రధానంగా తోడ్పడేది స్టాప్‌లాస్ టెక్నిక్.
benefits of trailing stop loss
ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఒక రకమైన డే ట్రేడింగ్ ఆర్డర్. ఇది మనం ట్రేడింగ్ లో పొందగలిగే గరిష్ఠ విలువ లేదా నష్ట శాతాన్ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. సెక్యూరిటీ ధర మనకు అనుకూలంగా పెరిగితే లేదా తగ్గితే స్టాప్ ధర దానితో కదులుతుంది. మనకు వ్యతిరేకంగా ధర పెరిగినా లేదా తగ్గిన స్టాప్ లాస్ అలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో అత్యల్ప, అత్యధిక స్థానాన్ని రేంజ్ అంటారు. True రేంజ్ అంటే ముందురోజు స్టాక్ ఎంత మూవ్ అయ్యింది అని అర్థం.
what is ATR: AVERAGE TRUE RANGE
4 రోజుల్లో స్టాక్స్ తక్కువ నుంచి ఎక్కువకి ఎంత మూవ్ అయ్యిందో తెలుసుకోవడాన్ని ATR అంటారు. స్టాప్ లాస్ లో ప్రపంచ వ్యాప్తంగా వాడేది స్టాప్ లాస్ ATR. ఇంట్రాడే ట్రేడింగ్ లో నైనా ట్రైలింగ్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చు.
ట్రైలింగ్ స్టాప్ లాస్ లాభాలను అడ్డుకోదు. కానీ నష్టాలను అడ్డుకుంటుంది. చాలామంది బ్రోకర్స్ ట్రేడింగ్ సిస్టమ్ లలో ఆటోమేటిక్ గా పనిచేసేలా ట్రైలింగ్ స్టాప్ లాస్ ను సెటప్ చేస్తారు. ఒక వేళ లేకపోతే టెక్నికల్ ట్రూత్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం మార్కెట్లో తొందరగా బయటకు రాకుండా లాభాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వేళ లాస్ వస్తే వెంటనే బయటకు వెళ్ళపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ATR స్టాప్ లాస్ లేకుండా 100 శాతం స్టాప్ లాస్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం. మనం సూపర్ ట్రెండ్ వాడినపుడు ATR ట్రూ పెట్టాలి. డెలివరీ బేస్ట్ కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ వాడడం వల్ల లాభాలను పొందవచ్చు.