
మనం ఏటీఎం సెంటర్ కి వెళ్లి కార్డు పెట్టగానే సేవింగ్స్, లేదా కరెంట్ అంకౌంటా అని అడుగుతుంది. అక్కడే చాలా మందికి డౌట్ వచ్చేస్తుంటుంది, కరెంట్ అకౌంటా..? అంటే…?
బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అనేవి రెండు వేర్వేరు అవసరాల కోసం డిజైన్ చేసినవి. మనందరికీ తెలిసింది, మనకు బ్యాంకుల్లో ఉండేది సేవింగ్ అకౌంట్స్.. అంటే పొదుపు ఖాతా. అంటే మనం డబ్బులను దాచుకోవడానికి ఈ సేవింగ్ అకౌంట్స్ ని వాడుతాం. ఇలా దాచుకున్న డబ్బులపై బ్యాంక్ మనకు వడ్డీ ఇస్తుంది. ఇలా దాచుకున్న డబ్బులను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్ డ్రా చేసుకోవచ్చు. వేరే అకౌంట్స్ కి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. సాధారణంగా 18 సంవత్సరాలు వయసు దాటినవారు ఎవరైనా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 18 సంవత్సరాలు నిండకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి..
సాధారణంగా భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ. 1000 అకౌంట్ లో ఉంచాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మినిమమ్ బ్యాలెన్స్ రూ.10,000 అకౌంట్ లో ఉంచాల్సి ఉంటుంది. ఒక వేళ ఇలా ఉంచకపోయినట్టయితే అందుకు మనకు బ్యాంకు పినాల్టీ విధిస్తుంది. అయితే భారత ప్రభుత్వం ప్రతి ఇండియన్ కి ఒక అకౌంట్ తప్పనిసరిగా ఉండాలని జీరో బ్యాలెన్స్ తో కూడా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసినపుడు ఏ బ్యాంక్ అయినా మనకు ఒక పాస్ బుక్, ఎటీఎమ్ కార్డు, చెక్ బుక్ కూడా ఇస్తాయి. వీటితో పాటు నెట్ బ్యాంకింగ్ కిట్ కూడా కొన్ని బ్యాంకులు ఇస్తాయి. సేవింగ్ అకౌంట్ లో మనం కొన్ని లిమిట్ ట్రాన్సక్షన్ మాత్రమే చేయగలుగుతాం. అదేమిటంటే ఒక నెలలో ఎటీఎమ్ కార్డును మనం 5 సార్లు, ఉపయెగించి అదే బ్యాంకు ఏటీఎం లో క్యాష్ విత్ డ్రా చేయగలుగుతాం. 3సార్లు ఇతర బ్యాంక్ ఏటీఎం లో క్యాష్ విత్ డ్రా చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఏటీఎం ఉపయోగిస్తే ఛార్జస్ పడతాయి.
కరెంట్ అకౌంట్..
కరెంట్ అకౌంట్స్ వ్యాపార అవసరాలకు ఈ కరెంట్ అకౌంట్ ను వాడుతారు. ఈ కరెంట్ అకౌంట్స్ ను వ్యాపారులు, కంపెనీలు, ప్రభుత్వరంగ సంస్థలు మొదలైనవారు ఉపయోగిస్తారు.
వ్యక్తులు, కంపెనీలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజస్ పేర్లతో కరెంట్ అకౌంట్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ లో ట్రాన్జాక్షన్ కి ఎలాంటి లిమిట్స్ ఉండవు. ఒక వ్యక్తి లావాదేవీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కరెంట్ అకౌంట్ ఉపయోగపడుతుంది.సేవింగ్ అకౌంట్ తో పోల్చినపుడు కరెంట్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ మెంటైన్ చేయవలిసి ఉంటుంది. కరెంట్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ 10,000- 20,000 వరకు ఉంటుంది. అదే ప్రైవేటు బ్యాంకు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. కరెంట్ అకౌంట్ లో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ కి బ్యాంక్ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. సర్వీస్ ఛార్జస్ తీసుకుంటుంది. అదే సేవింగ్ అకౌంట్ లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ కి ఆ పై ఇంకా డబ్బులు ఉంటే బ్యాంకు వడ్డీ ఇస్తుంది. అయితే కరెంట్ అకౌంట్ లో ఓవర్ డ్రాప్ట్ సదుపాయం ఉంటుంది. దీనివలన ఉపయోగం ఏమిటంటే మన అకౌంట్ లో క్యాష్ లేకపోయినా వ్యాపార అవసరాల నిమిత్తం అకౌంట్ నుంచి ఎక్కువగా క్యాష్ ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎక్కువగా ఉపయోగించే సదుపాయాన్నే ఓవర్ డ్రాప్ట్ అంటారు. దీనికి లిమిట్స్ ఉంటాయి. అది పర్సన్ బట్టి, బ్యాంక్ ను బట్టి, కంపెనీ ఆస్తిని బట్టి ఉంటుంది. ఎక్కువగా ఉపయోగించిన బ్యాలెన్స్ కి మాత్రం బ్యాంక్ వడ్డీ తీసుకుంటుంది. ఇలా ఎక్కువగా తీసుకున్న క్యాష్ ను తర్వాత పే చేయాలి. కరెంట్ అకౌంట్ వల్ల బ్యాంక్స్ ఈజీగా లోన్స్ ఇస్తాయి. అది బిజినెస్ వరకు మాత్రమే.