which is the best investment option
మనం సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు చాలా మార్గాలు అన్వేషిస్తాం. ఏది ఎక్కువ లాభాలను ఇస్తుందో, ఏది పూర్తి సురక్షితమైనదో, ఎక్కడ ఎటువంటి మోసాలు ఉండవో అని వెతుకుతాం. అప్పడే పొదుపు నిర్ణయం తీసుకుంటాం. మన అందరికీ బాగా తెలిసిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తాం. అయితే బంగారం, లేదా భూమి. మిగిలినది అతి తక్కువ మంది ప్రిఫర్ చేసేది ఈక్విటీ. వీటిలో ఏది ఎక్కువ లాభాలను ఇస్తుందో ఓసారి చూద్దాం.
gold or real estate or equity
సాధారణంగా ఈ మూడూ వేరు వేరు సెక్టార్స్. ఒకదానితో ఒకటి పోల్చలేము.
గోల్డ్ అంటే మన దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మనకు బాగా ఉపయోగపడేది. అందుకే దీనిని అత్యవసర ద్రవ నగదు అనవచ్చు. బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే గత 25 ఏళ్ళ చరిత్రలో ఏవరేజ్ గా 8-10 శాతం రిటర్న్ వచ్చింది.
is gold funds are good
గోల్డ్ ఫండ్స్…
గోల్డ్ ప్రపంచ వ్యాప్తంగా రెండుసార్లు మూవ్ అయింది. మన ఇండియాలో అయితే ఆభరణాలకు ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి ఇయర్లీ 10 శాతం రిటర్న్స్ వస్తుంది. ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా బాండ్లు, ఈటీఎఫ్ రూపంలో కూడా గోల్డ్ దొరుకుతుంది. ఈటీఎఫ్ ల రూపంలో అందుబాటులో ఉండే దానిని గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ ఈటీఎఫ్ ను ట్రేడింగ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. ఎస్ఐపీ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. తర్వాతది గోల్డ్ బాండ్స్. గవర్నమెంట్ అప్పుడప్పుడూ ఈ బాండ్స్‌ని ఇష్యూ చేస్తుంది. దీనిలో మనకు సంవత్సరానికి 2 శాతం వడ్డీ ఇస్తారు. మనం 8 సంవత్సరాలు తర్వాత అమ్ముకుంటే మనకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. మనకు 2 శాతం ఉచితంగా వడ్డీ వస్తుంది. మనకు 8 సంవత్సరాల తర్వాత మార్కెట్ లో ఏ రేటు ఉంటే ఆ రేటుకే మనం గోల్డ్ బాండ్స్ ను అమ్ముకోవచ్చు.
రియల్ ఎస్టేట్.
రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు నష్టం రాదు. కానీ అర్జెంటుగా కావాలంటే అమ్మలేం. మనం దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ లో ఫండ్స్ గురించి చూసుకుంటే ఇవి నిరంతరం పెరుగుతూ ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ లో చాలా రకాలు ఉంటాయి.
రెంటల్ ఇన్ కమ్, కమర్షియల్ బిల్డింగ్ కొనడం అమ్మడం, ప్రీ లాంచింగ్..
ప్రీ లాంచింగ్ అంటే ప్రోజెక్ట్ మొదటిలో ఇన్వెస్ట్ చేసి ప్రోజెక్ట్ పూర్తయిన తర్వాత అమ్మడం.
ఓపెన్ ప్లాట్స్ అమ్మడం లేదా కొనడం. మనం ఏవరేజ్ గా రియల్ ఎస్టేట్ లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి సంపదను కూడబెట్టుకోవచ్చు.
most profitable sector is equity
ఈక్విటీ ఫండ్స్…
ఈక్విటీ ఫండ్స్ అన్నింటిలోకల్లా ఉత్తమమైనవి. గోల్డ్ ఫండ్, రియల్ ఎస్టేట్ ఫండ్ ఈ రెండు ఫండ్స్ తో పోల్చుకుంటే ఈక్విటీ ఫండ్స్ చాలా లాభదాయకమైనవి.
ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు చాలా నాలెడ్జ్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్ పర్ట్స్ మేనేజ్ చేస్తారు. మనకు మ్యూచువల్ ఫండ్స్ లో పూర్తిగా తెలియకపోయినా మనకి ఏవరేజ్ మీద 15-20 శాతం వచ్చే ఛాన్సస్ ఉంటుంది.
గత 27 సంవత్సరాల నుంచి రిలయన్స్ గ్రోత్ ఫండ్ లో 22 CAGR రిటర్న్స్ వస్తోంది. గత 10 సంవత్సరాల నుంచి ఎస్బీఐ 26 శాతం రిటర్న్స్ ఇస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ టైంలో ఇన్వెస్ట్ చేస్తే వాలటాలిటీ ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఫండ్స్ కన్నా లాభాలు అధికంగా వస్తాయి. ఇక్కడ స్థిరత్వం ఉండదు. కొన్ని సార్లు నెగిటివ్ రిటర్న్స్, పోజిటివ్ రిటర్న్స్, జీరో రిటర్న్స్ కూడా ఉంటాయి. అందుకే వీటిని హ్యాండిల్ చేయడం రావాలి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలి.