
గతంలో అందరూ ఫుల్ టైం( ఫ్రాంచైజ్) బ్రోకర్ల దగ్గరే ట్రేడింగ్ చేసేవారు. అప్పుడు అన్నీ పుల్ టైం బ్రోకింగ్ సంస్థలే ఉండేవి. అయితే జిరోదా ట్రేడింగ్ యాప్ వచ్చాక డిస్కౌంట్ బ్రోకింగ్ అనే పద్ధతి మనకి పరిచయం అయ్యింది. అత్యంత తక్కువ ధరకే ట్రేడ్ చేయగలగడం, తక్కువ చార్జీలు ఉండడం వల్ల ఇటువంటి డిస్కౌంట్ బ్రోకింగ్‌కి చాలా డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత చాలా సంస్థలు డిస్కౌంట్ బ్రోకింగ్ ను అందిస్తూ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ బ్రోకర్లతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న విషయం మనం తెలుసుకోవాలి.
who can choose discount brokers
* మార్కెట్ గురించి బాగా తెలిసినవారు డిస్కౌంట్ బ్రోకర్స్ ను ఆశ్రయించవచ్చు.
* ఎక్కువ ట్రేడింగ్ చేసే వాళ్లకి డిస్కౌంట్ బ్రోకర్స్ సరైనవి. చాలా తక్కువ ట్రేడ్ చేసే వాళ్లకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇవి అనవసరం.
* ఇక్కడ చార్జీలు తక్కువ. అందించే సేవలు తక్కువే.
* ఇందులో కొన్ని యాప్‌లు కేవలం ట్రేడింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
* ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వరు.
* డిస్కౌంట్ బ్రోకర్స్ అందించే సేవల్లో మొదటిది సులువైన మొబైల్ యాప్. చాలా ఈజీగా ట్రేడింగ్ చేయగలిగేలా ఉండడం ఇందులో ప్రత్యేకత. అయితే ఇందులో ఇతర సదుపాయాలు ఉండవు.
* స్టాక్ వివరాలు, మార్కెట్ కండిషన్, సజెషన్స్ లాంటివి డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు అందించవు.
* మనం హోల్డింగ్ ఉంచిన స్టాక్‌ల హెచ్చు తగ్గుల గురించి, అందులో జరిగే కార్పొరేట్ యాక్షన్స్ గురించి మనకు ఎటువంటి మెసేజ్‌లు కానీ, మెయిల్స్ కానీ రావు. దీంతో మార్కెట్‌పై అవగాహన లేని వారు మార్కెట్లో వచ్చే అప్ అండ్ డౌన్ లతో కంగారు పడే అవకాశం ఉంది.
what are the services of discount brokers
* ప్రత్యేకించి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉండదు. మనకు ఏదైనా సందేహం వచ్చి అడుగుదామన్నా ఎవరూ అందుబాటులో ఉండకపోవచ్చు.
* స్టాక్ సలహాలు, సజెషన్స్ ఏవీ ఉండవు. కొత్తగా మార్కెట్‌కి వచ్చే వారికి ఇది కొంచెం కష్టమైన పనే.
* వేరే ప్రొఫెషన్, జాబ్‌లో ఉండేవారు, మార్కెట్ ని నిత్యం వాచ్ చేయలేరు. అలాంటి వారికి తమ పోర్టిఫోలియో స్థితి గతులు తెలుసుకోవడం డిస్కౌంట్ బ్రోకర్స్ తో కుదరదు.
* మార్కెట్ సెలవుల గురించి, సర్కర్‌లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఆగిపోయినా ఇందులో ఎటువంటి సమాచారం తెలుసుకోలేం.