Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years? FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth? FEATURE NEWS
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS

కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs

Posted on 07/02/2026 By admin No Comments on కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిదైన ఆరో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలను (RBI Announces) ప్రకటించింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయన్న అంచనాతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు, చిన్న పరిశ్రమలు, ఎన్‌బీఎఫ్‌సీలు, రియల్‌ ఎస్టేట్‌ రంగం వంటి విభాగాలకు గణనీయమైన ఊరట కలిగించే ప్రకటనలు చేసింది.

డిజిటల్‌ మోసాల బాధితులకు ప‌రిహారం .. Compensation for Victims of Digital Fraud
డిజిటల్‌ మోసాల బారిన పడిన బ్యాంకు వినియోగదారులకు రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించడం ఈ సమీక్షలో అత్యంత కీలకాంశంగా నిలిచింది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈ) హామీ లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ పారిశ్రామిక వర్గాలకు పెద్ద భరోసా ఇచ్చింది. చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు కూడా ఆర్‌బీ ((RBI ) స్పష్టం చేసింది.

రెపో రేటు 5.25 శాతం వద్దే.. Repo Rate Kept Unchanged at 5.25%
బ్యాంకులకు ఆర్‌బీఐ((RBI ) ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు అయిన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆరుగురు సభ్యులతో కూడిన పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల వల్ల వృద్ధిపై ఉన్న భయాలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా ఆర్‌బీఐ పేర్కొంది. విధాన ధోరణిని ‘తటస్థం’గా కొనసాగించడంతో, కీలక రేట్లు ప్రస్తుతం ఉన్న తక్కువ స్థాయిల్లోనే కొనసాగుతాయన్న సంకేతాలను కేంద్ర బ్యాంకు ఇచ్చింది. 2025 ఫిబ్రవరి తర్వాత ఇప్పటివరకు మొత్తం 1.25 శాతం మేర వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించిన సంగతి తెలిసిందే. డిసెంబరు సమీక్షలో 25 బేసిస్‌ పాయింట్ల కోత వేశారు. ఈ కోతల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై క్రమంగా కనిపిస్తున్నట్లు ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాల్లో స్వల్ప పెంపు.. Slight Upward Revision in Inflation and Growth Projections
– ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను ఆర్‌బీఐ 2 శాతం నుంచి 2.1 శాతానికి సవరించింది. అయినప్పటికీ ఇది ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్దేశించిన 4 శాతం కంటే చాలా తక్కువగానే ఉందని స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
– ఆర్థిక వృద్ధి విషయంలోనూ సానుకూల సంకేతాలే ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి వృద్ధి అంచనాను 6.75 శాతం నుంచి 6.95 శాతానికి పెంచింది. 2026–27 తొలి త్రైమాసికంలో వృద్ధి 6.7 శాతం, రెండో త్రైమాసికంలో 6.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. సవరించిన జీడీపీ ప్రాతిపదిక సిరీస్‌ విడుదల అనంతరం, ఏప్రిల్‌ సమావేశంలో పూర్తి సంవత్సర అంచనాలు ప్రకటిస్తామని తెలిపింది.

ఓటీపీ చెప్పి మోసపోయినా పరిహారం… Compensation Even If OTP Is Shared
– డిజిటల్‌ ఆర్థిక మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకింగ్‌ వినియోగదారులకు ఆర్‌బీఐ((RBI ) చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఒక మోసపూరిత లావాదేవీకి గరిష్ఠంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించింది. మోసగాళ్లకు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) చెప్పడం వల్ల డబ్బులు పోగొట్టుకున్న సందర్భాల్లో కూడా ఈ పరిహారం వర్తిస్తుందని గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. రూ.85,000 కోట్ల డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) ఫండ్‌ నుంచి ఈ పరిహారాన్ని చెల్లించనున్నారు. మోసపోయిన వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సాయం అందుతుంది. మోసం దురుద్దేశంతో జరగలేదని నిరూపించాల్సి ఉంటుంది.
– ఒకవేళ మోసమైన మొత్తం రూ.25,000లోపే ఉంటే, అందులో 15 శాతం మొత్తాన్ని బాధితుడే భరించాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ మొత్తంలో మోసపోయిన వారికి మాత్రమే గరిష్ఠ పరిహారం అందుతుంది. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయాల కోసం ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. మోసాలను అరికట్టేందుకు అదనపు భద్రతా టూల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు, ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు అదనపు అథెంటికేషన్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

మిస్‌సెల్లింగ్‌పై కఠిన వైఖరి..Tough Stance on Mis-Selling
– ఆర్థిక ఉత్పత్తులు, సేవలను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కాకుండా అనైతిక పద్ధతుల్లో విక్రయించడం వల్ల వినియోగదారులతో పాటు సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు కౌంటర్ల వద్ద విక్రయించే థర్డ్‌పార్టీ ఉత్పత్తులు వినియోగదారుల రిస్క్‌ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండాలని గవర్నర్‌ పేర్కొన్నారు.
– ఆర్థిక ఉత్పత్తులు, సేవల ప్రకటనలు, మార్కెటింగ్‌, విక్రయాలపై నియంత్రిత సంస్థలకు విస్తృత స్థాయిలో నిబంధనలు తీసుకురానున్నట్లు చెప్పారు. రికవరీ ఏజెంట్ల వ్యవహారంపైనా సమీక్ష చేపట్టి, దీనికీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎంఎస్‌ఎమ్‌ఈలకు రెట్టింపు రుణ పరిమితి.. MSME Loan Limit Doubled
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెద్ద ఊరటగా, ఎంఎస్‌ఎమ్‌ఈలకు హామీ లేకుండా ఇచ్చే రుణ పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 2026 ఏప్రిల్‌ 1 తర్వాత మంజూరయ్యే లేదా పునరుద్ధరించబడే అన్ని రుణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇది చిన్న పరిశ్రమలకు పెట్టుబడుల లభ్యతను పెంచి, ఉపాధి సృష్టికి దోహదపడుతుందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

బిజినెస్‌ కరెస్పాండెంట్లపై దృష్టి.. Focus on Business Correspondents
గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందించడంలో కీలకంగా ఉన్న బిజినెస్‌ కరెస్పాండెంట్ల కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవల విభాగం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, నాబార్డ్‌ అధికారులతో కూడిన ఈ కమిటీ సూచనల ఆధారంగా సవరించిన మార్గదర్శకాలను త్వరలో ప్రజాభిప్రాయాల కోసం విడుదల చేయనుంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనల సవరణపైనా ముసాయిదా రానుంది.

చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సడలింపులు.. Relaxations for Small NBFCs
రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులు ఉండి, ప్రజల నిధులు వినియోగించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వీటికి వ్యవస్థాగత నష్టభయం తక్కువగా ఉండటంతో నియంత్రణల్లో సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. 1,000 కంటే ఎక్కువ శాఖలు తెరవడానికి అవసరమైన ముందస్తు అనుమతి నిబంధనను కూడా తొలగించనున్నారు.

రీట్స్‌కు బ్యాంకు రుణాలపై ప్రతిపాదన.. Proposal to Allow Bank Loans to REITs
రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌)కు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అనుమతించాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ ముందుకు తెచ్చింది. దీని ద్వారా స్థిరాస్తి రంగానికి నగదు సరఫరా మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం దేశంలో బ్రూక్‌ఫీల్డ్‌, ఎంబసీ, మైండ్‌స్పేస్‌, నెక్సస్‌, నాలెడ్జ్‌ రియాల్టీ వంటి ఐదు లిస్టెడ్‌ రీట్స్‌ ఉన్నాయి.

పసిడి రుణాలపై ఆందోళన లేదన్న ఆర్‌బీఐ.. RBI Says No Concern Over Gold Loans
పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, పసిడి తనఖా రుణాల విషయంలో ఎటువంటి ఆందోళన లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లోన్‌ టు వేల్యూ నిష్పత్తి పరిశ్రమ ప్రమాణాల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. డిసెంబరుతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, వృద్ధి దిశగా ముందడుగు పడిందని గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు కీలక వడ్డీ రేట్లు తక్కువ స్థాయుల్లోనే కొనసాగుతాయని, అవసరమైతే మరింత తగ్గే అవకాశమూ ఉందని తెలిపారు. అయితే తుది నిర్ణయం ఎమ్‌పీసీ చేతుల్లోనే ఉంటుందన్నారు.

158
FEATURE NEWS Tags:Compensation Even If OTP Is Shared, Compensation for Victims of Digital Fraud, Focus on Business Correspondents, MSME Loan Limit Doubled, Proposal to Allow Bank Loans to REITs, RBI Says No Concern Over Gold Loans, Relaxations for Small NBFCs, Repo Rate Kept Unchanged at 5.25%, Slight Upward Revision in Inflation and Growth Projections, Tough Stance on Mis-Selling

Post navigation

Previous Post: రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
Next Post: క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!

Related Posts

  • వెండి ధర పైపైకి.. కిలో రూ.2ల‌క్ష‌లు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh FEATURE NEWS
  • EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year FEATURE NEWS
  • సిబిల్‌ స్కోరుపై క్రెడిట్‌ కార్డుల ప్రభావం ఎంత ? జాగ్రత్తగా వాడితే లాభం, లేకపోతే నష్టమే! Credit Cards & CIBIL Score: A Boon if Used Wisely, a Risk if Misused FEATURE NEWS
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • మ్యూల్‌ ఖాతాల వలలో సామాన్యులు! అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు! Ordinary People Caught in Mule Account Traps! Trouble Is Inevitable If You’re Not Careful! FEATURE NEWS
  • ట్రంప్‌ సుంకాల వేళ … భారత్‌ వైపు చూస్తున్న ఐటీ దిగ్గ‌జ‌ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years?
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible?
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns?
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth?
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మ‌నీ మాస్ట‌ర్ ది గేమ్ బుక్ స‌మ‌రీ money master the game book summary telugu BOOKS
  • FDలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులివే.. Planning to Invest in an FD..? Here Are the Banks Offering the Highest Interest Rates.. FINICAL PLANNING
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING
  • బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest? FINICAL PLANNING
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users NEWS
  • రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme