
tax benefit with children saving schemes
పన్ను ప్రయోజనం పొందడానికి మనం అనేక మార్గాలను అన్వేషిస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది అడ్డదారులు తొక్కుతుంటే కొందరు అమాయకత్వంతో డబ్బులు కోల్పోతుంటారు. ఈ విషయంలో మనం కొంత ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. పన్ను ప్రయోనం కోసం పిల్లల పేరిట పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వారికి ఆర్థిక భరోసానివ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేటపుడు పిల్లల పేరున పెడితే మంచిది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య సమృద్ది యోజన, సంప్రదాయ బీమాపథకాలు కొన్ని రకాల ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను రాయితీ పొందడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బులను పొదుపు చేయడం అవుతుంది.
tax benefit with PPF
పీపీఎఫ్‌తో..
పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లల విద్యకు, వివాహానికి ఉపయోగపడతాయి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. మైనర్ పిల్లల కోసం తల్లిదండ్రులు పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. అప్పటి వరకు అది వారి సంరక్షణలోనే ఉంటుంది. ఒక సారి పిల్లల వయసు 18 ఏళ్ళ దాటితే ఖాతా వారి పేరు మీదకు బదిలీ అవుతుంది. ఒక వేళ తల్లిదండ్రులు వారి పేరిట కూడా పీపీఎఫ్ ఖాతాను నిర్వహిస్తుంటే .. పన్ను మినహాయింపు కోసం రెండింట్లో కలిపి చేసే మదుపు రూ.1.5 లక్షల దాటొద్దు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు కోసం మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులిద్దరిలో ఎవరైనా ఒకరు పీపీఎఫ్ తెరవొచ్చు. దీనికి ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం, సంరక్షకుడి పాన్ వంటి పత్రాలు అవసరం. పిల్లల వయసు 18 ఏళ్ళు దాటితే ఖాతా వారి పేరు మీదకు మారిపోతుంది. వారు సొంతంగా మదుపు చేయడం ప్రారంభించొచ్చు. ఒక వేళ పీపీఎఫ్ 15 ఏళ్ళ కాలపరిమితి ముగిస్తే ప్రతి 5 ఏళ్ళ కొకసారి పొడిగింపు ఉంటుంది.
tax benefit with sukanya samruddhi yojana
సుకన్య సమృద్ధి యోజన…
ఈ పథకంలో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.6 శాతంగా ఉంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వారికి 10 ఏళ్ళ వయసు వచ్చే వరకు మాత్రమే సుకన్య సమృద్ది ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంటుంది. పదోతరగతి పూర్తయిన తర్వాత లేదా బిడ్డకు 18 ఏళ్ళు నిండిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహ సమయంలోనూ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖాతా తెరిచిన 21 ఏళ్ళు లేదా పెళ్ళి సమయంలో ఖాతాను నిలిపివేస్తారు.
ఇలాంటి మరి కొన్ని పథకాలు ఉన్నాయి. వీటన్నింటినీ గురించి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. అప్పడే ట్యాక్స్ విషయంలో మనం పొరపాట్లు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం.
సెక్షన్ 80సీ ప్రకారం ఇద్దరూ పిల్లల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపై గరిష్ఠంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. మనం ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.