
import of edible oils increases
ఇటీవల దేశీయంగా వంటనూనెలు హాట్ టాపిక్‌గా మారాయి. మన దేశానికి అవసరమైన నూనంతా ప్రధానంగా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నదే కావడం దీనికి ప్రధానం కారణం. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో ప్రపంచ దేశాల మధ్య రవాణా సదుపాయాలు కొంచెం మందగించాయి. ఈ కారణంగా ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సాకు చూపి దేశీయంగా కొందరు వ్యాపారులు నూనె ధరలు పెంచి అమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నూనెల దిగుమతులు మాత్రం పెరిగాయి అని చెప్తోంది.
refined oil imports increases
ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలోకి వంటనూనెలు 9,83,608 టన్నుల మేర దిగుమతి అయినట్లు పరిశ్రమ సంఘం ఎస్ఈఏ (సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. 2021 ఇదే నెల దిగుమతులు 7,96,568 టన్నులతో పోలిస్తే ఈసారి 23 శాతం అధికమని తెలిపింది. సుంకం తక్కువగా ఉన్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గత నెలలో మొత్తం వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతుల 10,19,997 టన్నులుగా నమోదయ్యాయని, ఏడాది క్రితం ఇవి 8,38,607 టన్నులేనని వివరించింది. నెలకు మన దేశంలోకి 1.75-2 లక్షల టన్నుల సన్‌ప్లవర్ నూనె దిగుమతి అవుతుంటుందని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలోనూ నెలకు 1.52 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనె ఫిబ్రవరిలో దిగుమతి అయ్యిందన్నారు. యుద్ధం కొనసాగితే ఈ నూనె దిగుమతులు కొంత తగ్గినా, దేశీయంగా పండుతున్న సోయాబీన్, ఆవాల వల్ల కొరత ఏమీ రాదని పేర్కొంది.