difference between bank loan and equity
మనం ఒక మంచి ఆలోచనతో కంపెనీని ప్రారంభించాలని సిద్ధమయ్యాం. కానీ అందుకు కావాల్సిన డబ్బు మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం డబ్బుల కోసం రెండు మార్గాలను ఆశ్రయించవచ్చు.
మొదటిగా బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం
లేదా
ప్రజలనుంచి పెట్టుబడులను స్వీకరించడం(ఈక్విటీ)
బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం వల్ల మనకు కావాల్సిన డబ్బు ఒకేసారి సమకూరవచ్చు. కానీ ఇక్కడ తీసుకున్న అప్పుకు మనం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్ధేశిత సమయానికి డబ్బులు చెల్లించకపోతే బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆలస్యమయ్యే కొద్దీ మరిన్ని వడ్డీలు, జరిమానాలు జమవుతూ ఉంటాయి. వీటిని భరించడం కొంచెం కష్టం. వ్యాపారం అనుకున్నట్టుగా జరిగితే ఫర్వాలేదు.. కానీ వ్యాపారం బాగా లేకపోతే మనం నష్టాలను భరించలేక, బ్యాంకులకు వడ్డీలు చెల్లించ లేక కంపెనీని మూసేయాల్సి రావచ్చు.
what is equity
ఇప్పుడు రెండో పద్దతిని ఓ సారి పరిశీలిద్దాం. మనం ఏ కంపెనీనైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ కంపెనీ గురించి ఇన్వెస్టర్లకు వివరించి వారు ఆసక్తి చూపితే వారి నుంచి మనకు కావాల్సిన పెట్టుబడి తీసుకోవచ్చు. అందుకు ప్రతిగా వాళ్లకు మన కంపెనీలో వాటాలను షేర్ల రూపంలో ఇస్తాం. దీనిని ఈక్విటీ అంటాం.
కేవలం ఈక్విటీ ద్వారా డబ్బులను రైజ్ చేసాక ఆ కంపెనీ సంవత్సరంలో మంచి లాభాలు ఇస్తే పెట్టుబడి దారుల వాటాలకు అనుగుణంగా మనం లాభాలను పంచుకుంటాం. నష్టం వచ్చినా మనకు ఎటువంటి ఒత్తిడీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి వడ్డీలను చెల్లించక్కర్లేదు. ఖచ్చితమైన నిబంధనలేవీ ఉండకపోవడంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. కంపెనీ ఎప్పుడైతే లాభాలను ఆర్జిస్తుందో అప్పుడే వాటిని పంచుకోవచ్చు.