స్టాక్ మార్కెట్‌లో నష్టపోయారా..?
what to do if you loss in stock market
మనం ఒక జాబ్ లో జాయిన్ కావాలంటే కనీస క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్ తప్పనిసరి. ఆ అర్హతలు ఉంటేనే మనకు జాబ్ వస్తుంది. ఒక డాక్టర్ కావాలంటే నాలుగేళ్ల ఎంబీబీఎస్, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత ప్రాక్టీస్, ఆ తర్వాత డాక్టర్. ఇలా ఇంత ప్రాసెస్ అయ్యాకే మన ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది.
అలాగే ఇంజినీర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావాలన్నా కనీసం కొంత చదువు, ప్రాక్టీస్, ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం, ఆదాయం మొదలవుతాయి. కానీ స్టాక్ మార్కెట్ ఆదాయం కోసం ఎదురుచూసేవారు మాత్రం ఏ చదువు, ప్రాక్టీస్, అనుభవం లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తారు. అందుకే మార్కెట్‌లో చాలా మంది నష్టపోతుంటారు.
be aware with volatility
అవగాహన తప్పనిసరి..
స్టాక్‌మార్కెట్ అంటేనే చాలా వాలటాలిటీ ఉంటుంది. తద్వారా మన దగ్గర తక్కువ డబ్బులు ఉంటే పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్తవాళ్ళు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎంత టాలెంట్ ఉన్నా సరే ఎంత డబ్బులు మన దగ్గర ఉన్న సరే ట్రేడింగ్ చేయడానికి కొంత సమయం తీసుకోవాలి. మనకి స్టాక్ మార్కెట్ పై అవగాహన రావడానికి కొంత సమయం పడుతుంది. రియల్ టైమ్ లో వచ్చి ఉన్న క్యాపిటల్ ను పోగొట్టుకోవడం కన్నా డమ్మీ ట్రేడింగ్ లో కొన్ని నెలలు ప్రాక్టీస్ చేసుకుని మనకు ఎప్పుడైతే మార్కెట్ గురించి పూర్తి అవగాహన వస్తుందో అప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. మనం కోర్స్ నేర్చుకున్నాం కదా అని వెంటనే స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వడం లేదా యూట్యూబ్ చూసి వచ్చేసిందనుకోవడం, మిడిమిడి జ్ఞానంతో తొందర పడడం చేయకూడదు. అలాంటి టైమ్ లో మన డబ్బులు ఎక్కువగా పోగొట్టుకోవలిసి వస్తుంది.
ఆశ పడితే భంగపాటే..
ట్రేడింగ్ అంటే చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్ అనుకుంటారు. కానీ ఇక్కడ స్కాల్పింగ్ ఉంటుంది, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఉంటుంది. దీనిలో ఏది మన పెట్టుబడికి సరిపోతుందో అటువంటి ట్రేడింగ్ ను ఎంచుకోవడం ఉత్తమం. మనం అంచెలంచెలుగా మార్కెట్ గురించి తెలుసుకుని రావాలి. కానీ ఒక్కసారిగా రాకూడదు. సోషల్ మీడియా ద్వారా వచ్చే యాడ్స్ ఒక్కరోజులో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా ? సంవత్సరంలో 200 శాతం సంపాదించడం ఎలా ? అలాంటి వాటికి ఆశపడి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు.
learning is important in stock market
నేర్చుకుంటేనే…
మనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లు గురించి తెలియాలి. ఇండియా ఎకానమీ, సెక్టార్, స్టాక్స్, వాలటాలిటీ గురించి తెలియాలి. డమ్మీ ట్రేడింగ్ లో మినిమమ్ టైమ్ లో స్టాక్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకుని, అలాగే సర్వేమార్కెట్లు, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ మార్కెట్లు ఈ మూడింటితో మనకున్న జ్ఞానాన్ని బేరీజు వేసుకుని మనకి ఏదైతే బాగుంటుందో చూసుకుని మన దగ్గర ఉన్న తక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మార్కెట్లో చాలామంది ఎందుకు లాస్ అవుతారంటే అనుభవం లేనివాళ్ళు, రిస్క్ మేనేజ్ మెంట్ తెలియనివాళ్ళు లాస్ అవుతుంటారు. మనం మార్కెట్ కి కొత్త అనుకుంటే మార్కెట్ కి సంబంధించి కోర్సులు నేర్చుకోవడం గాని, వీడియోస్ చూడడం ద్వారా గానీ మార్కెట్ ను నేర్చుకోవాలి. తర్వాత డమ్మీ ట్రేడింగ్ లో అప్లై చేసుకోవాలి.
Leave a Reply