Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate

Posted on 02/02/2026 By admin No Comments on బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate

దేశ ఆర్థిక వ్యవస్థకు ( Indian Economy) మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతుల నిర్మాణానికి గాను రూ. 12.21 లక్షల కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ పెట్టుబడుల ఆధారిత వృద్ధి నమూనా స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది. ఈ దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని మరింత పెంచుతూ ఆర్థిక వృద్ధికి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేసింది. మౌలిక సదుపాయాల ఆస్తుల సృష్టినే ప్రధాన లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ బడ్జెట్‌ దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తోంది.

రూ. 12.21 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయం.. Capital Expenditure at an All-Time High
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రభావవంతమైన మూలధన వ్యయాన్ని (Capital Expenditure) రూ. 12.21 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇది మొత్తం బడ్జెట్‌ పరిమాణం రూ. 53.47 లక్షల కోట్లలో దాదాపు 22 శాతానికి సమానం. 2025–26 సవరించిన అంచనాలైన రూ. 10.95 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 11.5 శాతం పెరుగుదల కావడం గమనార్హం. పెట్టుబడుల ద్వారా వృద్ధిని ముందుకు నడిపించాలన్న ప్రభుత్వ వ్యూహం ఈ సంఖ్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.

అభివృద్ధికి ఇంధనంగా మౌలిక వసతులు.. Infrastructure as the Engine of Growth
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో మౌలిక సదుపాయాలు (Infrastructure) కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ‘క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్’పై మరింత దృష్టి సారించింది. కొత్త రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, హైస్పీడ్ రైళ్ల అభివృద్ధి, లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం వంటి రంగాలకు ఈ నిధులు ఉపయోగించనున్నారు. దీని వల్ల పరిశ్రమలకు అవసరమైన కనెక్టివిటీ మెరుగుపడనుంది.

ఉపాధి అవకాశాలకు ఊతం.. Boost to Jobs and Livelihoods
మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెరిగితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిర్మాణ రంగం ద్వారా నేరుగా, అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనివేళలు పెరగడంతో ప్రజల ఆదాయాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడనుంది.

రాష్ట్రాలకు ప్రయోజనం.. States to Gain from Capital Investment
కేంద్రం ప్రకటించిన ఈ భారీ (Budget ) కేటాయింపులు రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగా మారనున్నాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉండటంతో కేంద్ర సహకారం మరింత పెరుగనుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో రహదారులు, నీటి సరఫరా, పట్టణ వసతుల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడనున్నాయి.

పెట్టుబడిదారులకు సానుకూల సంకేతం.. Positive Signal to Investors
బడ్జెట్‌ (Budget )లో మౌలిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే అంశంగా మారింది. దీర్ఘకాలిక అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాన్ని ఈ కేటాయింపులు ఇస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడు తున్నారు. దీని ప్రభావంతో భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు.

2014తో పోలిస్తే ఆరు రెట్లు పెరుగుదల.. Six-Fold Jump in Capex Since 2014
పార్లమెంటులో బడ్జెట్ (Budget ) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పెరుగుదలపై కీలక వివరాలు వెల్లడించారు. 2014–15లో కేవలం రూ. 2 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం, 2025–26 నాటికి రూ. 11.2 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. 2026–27లో దీన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యయం ద్రోత్‌రూపంలో పెరుగుతూ 2022–23లో రూ. 7.4 లక్షల కోట్ల నుంచి 2023–24లో రూ. 9.5 లక్షల కోట్లకు, 2024–25లో రూ. 10.5 లక్షల కోట్లకు, 2025–26 సవరించిన అంచనాల్లో రూ. 11 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.

రోడ్లు, రైల్వేలకే ప్రధాన వాటా.. Roads and Railways Take the Lead
ప్రభుత్వ పెట్టుబడుల్లో ప్రధాన భాగం రోడ్లు–రహదారులు, రైల్వేలు వంటి కీలక మౌలిక రంగాలకే దక్కుతోంది. 2026–27లో రైల్వే మంత్రిత్వ శాఖకు రూ. 2.92 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 2025–26 సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదల. అలాగే రోడ్డు రవాణా, రహదారుల రంగానికి రూ. 3.09 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 7.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. మౌలిక సదుపాయాలకు బలమైన మద్దతు ఇవ్వడమే ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి నిలబెట్టే మార్గమని నిర్మలమ్మ స్పష్టం చేశారు.

కొత్త కార్యక్రమాలు, ఆధునిక సాంకేతికతలపై దృష్టి.. New Initiatives to Strengthen Infrastructure
2026–27లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది. అధిక విలువ కలిగిన నిర్మాణ పరికరాల దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక సమూహాల్లో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయనుంది. గత దశాబ్దంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు, NIIF, NABFID వంటి నిధి వ్యవస్థలు ప్రభుత్వ పెట్టుబడులకు బలమైన ఆధారంగా నిలిచినట్లు మంత్రి పేర్కొన్నారు.

పట్టణాలు, కొత్త రంగాలకు ఊతం.. Focus on Cities and Future Sectors
ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న మధ్యతరహా నగరాలు, చిన్న పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో అణుశక్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌, కార్బన్ సంగ్రహణ–వినియోగం–నిల్వ వంటి భవిష్యత్‌ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రణాళికలు రూపొందించింది. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువులపై 2035 వరకు కస్టమ్స్ సుంకం మినహాయింపును పొడిగించింది. విద్యుత్, ఉక్కు, సిమెంట్, శుద్ధి, రసాయన రంగాల్లో CCUS సాంకేతికతల అమలుకు రూ. 20,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించడం మరో కీలక నిర్ణయం.

వృద్ధికి నిరంతర బలం.. Sustaining Long-Term Economic Growth
మొత్తంగా చూస్తే 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని నిరంతరంగా వేగవంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.

‘ఆరెంజ్‌ ఎకానమీ’కి బూస్ట్‌.. Big Push to Creative Economy in Union Budget
సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆరెంజ్‌ ఎకానమీ’పై ప్రత్యేక దృష్టి సారించింది. కంటెంట్‌ క్రియేటర్లు, క్రియేటివ్‌ రంగాల్లో పనిచేసే యువతను ప్రోత్సహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా, 2026 కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చోటుచేసుకున్నాయి. సృజనాత్మక రంగాలే భవిష్యత్‌ ఉపాధి అవకాశాలకు కేంద్రబిందువుగా మారనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా కంటెంట్‌ క్రియేటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. భవిష్యత్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలు కలిగిన యువతను తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కంటెంట్‌ క్రియేటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీస్‌ (IICT) నేతృత్వంలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్‌ క్రియేటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఏవీజీసీ రంగంలో భారీ డిమాండ్‌.. 20 Lakh Professionals Needed by 2030
యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌ వంటి ఏవీజీసీ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఈ రంగానికి దాదాపు 20 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శిక్షణ, మౌలిక వసతులు, పరిశ్రమలతో అనుసంధానం పెంచేలా బడ్జెట్‌లో చర్యలు చేపట్టారు. దీని వల్ల దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత యువతకు అవకాశాలు పెరగనున్నాయి.

స్టార్టప్‌లకు ఊతం.. డిజైన్‌కు కొత్త దిశ.. Boost to Startups and Design Ecosystem
కంటెంట్‌ క్రియేషన్‌, డిజిటల్‌ మీడియా, క్రియేటివ్‌ టెక్నాలజీల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా కొత్తతరం సృష్టికర్తలను పెంపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో తూర్పు భారతంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (NID)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశంలో డిజైన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, శిక్షణ పొందిన డిజైనర్ల కొరత ఉందని ఆమె పేర్కొన్నారు. కొత్త సంస్థలతో ఆ లోటును భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా చూస్తే, ‘ఆరెంజ్‌ ఎకానమీ’కి బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాధాన్యం యువతకు కొత్త అవకాశాల తలుపులు తెరవనుంది. సృజనాత్మకత, సాంకేతికత, నైపుణ్యాలను మేళవించి ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్రం వేసిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

159
FEATURE NEWS Tags:20 Lakh Professionals Needed by 2030, Big Push to Creative Economy in Union Budget, Boost to Jobs and Livelihoods, Boost to Startups and Design Ecosystem, Capital Expenditure at an All-Time High, Focus on Cities and Future Sectors, Infrastructure as the Engine of Growth, New Initiatives to Strengthen Infrastructure, Positive Signal to Investors, Roads and Railways Take the Lead, Six-Fold Jump in Capex Since 2014, States to Gain from Capital Investment, Sustaining Long-Term Economic Growth

Post navigation

Previous Post: బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers
Next Post: గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్‌.. ఏప్రిల్‌ నుంచి రూల్స్‌ మార్పు.. New Rules to Impact Gold Bond Investors from April

Related Posts

  • టారిఫ్ లు రద్దు.. స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఉంటుందంటే? Tariffs Scrapped: How Will Stock Markets, Gold, and Silver Prices Be Impacted? FEATURE NEWS
  • ఎయిరిండియా పేరు ఇలా what is the story behind the name of  air india FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • పాన్–ఆధార్ లింక్ కావడం లేదా? PAN–Aadhaar Link Not Working? Here’s the Real Solution FEATURE NEWS
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted? FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో కొత్త అధ్యాయం.. Mutual Fund Reclassification – A New Era of Transparency FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS
  • హోం లోన్ తో సొంత ఇళ్లు సాధించుకోవ‌డం ఎలా How to get own house with home loan FINICAL PLANNING
  • నిఫ్టీ డౌన్ ఉన్నపుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? How to Invest When the Nifty Is Down? MARKET
  • గ‌డువులోగా గృహ రుణం తీర్చేయొచ్చా..? Can You Pay Off a Home Loan Within the Tenure? FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్స్‌ రాబ‌డుల‌పై ఎంత పన్ను చెల్లించాలి How Much Tax on Returns on Mutual Funds? MUTUAL FUNDS
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government FEATURE NEWS
  • ఆరోగ్య బీమా వైపు ప్ర‌జ‌ల చూపు… రూ.1.2 లక్షల కోట్లకు చేరిన‌ ప్రీమియం.. People Turning Towards Health Insurance… Premiums Reach ₹1.2 Lakh Crore INSURANCE
  • ఐడీబీఐ ఇక ప్రైవేటుకే idbi privatisation MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme