
కొత్తగా వచ్చీ రావడం స్టాక్ మార్కెట్లో లాభాలను గడించాలి అనుకోవడం అమాయకత్వం అవుతుంది. మార్కెట్ పైన స్థిర అభిప్రాయం, కనీస అవగాహన ఉంటే గాని నిలదొక్కువడం కష్టం. అందుకే ముందుగా కొంతకాలం అధ్యయనం చెయ్యడం చాలా అవసరం. ఇలా అధ్యయనం చేసే క్రమంలో కొన్ని విషయాల పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి. మార్కెట్లో ఒక అనుభవం ఉన్న ట్రేడర్ లాగా ట్రేడ్ చేయడానికి మీకు కొంత సమయం పడుతుంది. కానీ మీరు ఈ సులభమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. మార్కెట్‌లో లాభం పొందాలంటే దిగువ విషయాలను ప్రాక్టిస్ చేయాల్సిందే.
try to understand market
* మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి.
* మార్కెట్ పై బాగా పరిశోధన చేయండి.
* డబ్బులు తొందరగా సంపాదించాలనే ఆశతో కంగారు పడకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి.
* మొదట తక్కువ మొత్తంతో ప్రారంభించండి. ప్రారంభంలో ఒకటి లేదా రెండు స్టాక్ లు చాలు.
* పేపర్ ట్రేడింగ్ చేయడం మర్చిపోకండి
* లాభం గురించి ప్రాక్టికల్‌గా ఆలోచించండి.
* మార్కెట్లో అత్యంత రద్దీగా ఉండే సమయంలో ఇంట్రాడే ట్రేడింగ్ జరుగుతుంది. మార్కెట్ తెరిచిన కనీసం ఒక గంట తర్వాత మీ పొజిషన్ తీసుకోండి.
* పరిమిత ఆర్డర్లతో మీ నష్టాలను తగ్గించుకోండి. ఇది మరింత ఖచ్చితంగా ట్రేడింగ్ చేయడానికి అనుమతిస్తుంది.
* మీకు సరిపడిన, అర్థమైన ఒకే పద్ధతిలో ట్రేడింగ్ చేయండి.
important things in stock trading
వీటిని దృష్టిలో పెట్టుకోండి..
* ఇంట్రాడేలో అదే రోజు స్టాక్స్ కొని అమ్మాల్సి ఉంటుంది. షేర్లను మరిసటి రోజుకు బదిలీ చేయడం కుదరదు. మీరు స్టాక్సును అమ్మక పోతే 3.30 నిముషాలకు అవే అమ్ముడవుతాయి.
* ఇంట్రాడే ట్రేడింగ్ కు తక్కువ బ్రోకరేజ్, అత్యధిక నాణ్యత, వేగవంతమైన అమలుగల ట్రేడింగ్ అకౌంట్ ఎంచుకోండి.
* అధిక పరిమాణం, లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ను ఎంచుకోవాలి. మార్కెట్ ప్రవేశం ప్లాన్ చేయండి. నష్టాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టాప్ లాస్ ఉంచండి.
* మార్కెట్ అత్యంత చురుకుగా ఉన్నప్పుడు ధరల కదలికలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రేడ్ చేయడానికి సరైన సమయం. రోజువారి ట్రేడింగ్ ప్రారంభమైన 30 నిమిషాల్లోప్రతి స్టాక్ ఒక పరిధిని సృష్టిస్తుంది. దీనిని ఓపెనింగ్ రేంజ్ అంటారు. ఓపెనింగ్ రేంజ్ పైన స్టాక్ ధర ఉంటే కొనండి. అదేవిధంగా ఓపెనింగ్ రేంజ్ దిగువన ఉన్న స్టాక్ ధర అమ్మకాన్ని సూచిస్తుంది.
* ఇంట్రాడే వ్యాపారులు మార్కెట్ అస్థిరత నుంచి లాభం పొందుతారు. ట్రేడింగ్ మొదటి గంటలో ట్రేడ్ చేయకండి. ఈ సమయంలో మార్కెట్ మరింత అస్థిరంగా ఉంటుంది. ఓపెనింగ్ రేంజ్ గురించి అవగాహనన కలిగిన తరువాత ట్రేడింగ్ ప్రారంభించండి.