భారతీయ కమోడిటీస్ మార్కెట్ 18వ శతాబ్దానికి చెందిన బొంబాయి కాటన్ ట్రేడ్ అసోసియేషన్ స్థాపనతో మొదలైంది. మరే ఇతర దేశమూ కమోడిటీస్‌లో ట్రేడింగ్ ప్రారంభించక ముందే ఇక్కడ మొదలైంది. సంవత్సరాలుగా, భారతదేశంలోని వస్తువుల మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2003లో ప్రభుత్వం అన్ని వస్తువుల్లో ఫ్యూచర్ ట్రేడింగ్ అనుమతించింది. ఇంత సుదీర్ఘమైన, సుసంపన్నమైన చరిత్రతో, ఇది క్రమంగా సంపదను సృష్టించడానికి, హెడ్జింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే మార్గాల్లో ఒకటిగా మారింది.
How to do trading in commodity
మెటల్స్, క్రూడ్ ఆయిల్, ఎనర్జీ, స్పైసెస్, సాధారణ గ్యాస్ లు తదితర అనేక వస్తువుల వ్యాపారాన్ని సులభతరం చేసే మార్కెట్‌ను కమోడిటీస్ మార్కెట్ అంటారు. కమోడిటీస్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీల ద్వారా జరుగుతుంది. ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ కింద భారతదేశం అటువంటి 22 కమోడిటీ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసింది. మనం ప్రతిరోజు బంగారం, వెండి ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి లేదా తగ్గుతున్నాయి అని వింటూ ఉంటాం కదా! ఇలా రేట్లు పెరగడానికి తగ్గడానికి కారణం ఈ కమోడిటీ మార్కెట్సే.
స్టాక్ మార్కెట్లో కంపెనీలకి సంబంధించిన షేర్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో అదేవిధంగా కమొడిటీ మార్కెట్లో కమొడిటీస్ ట్రేడ్ అవుతాయి.
కమొడిటీ మార్కెట్లో ఏ ఏ కమొడిటీస్ ట్రేడ్ అవుతాయో తెలుసుకుందాం..
కమొడిటీస్ ని రెండు రకాలుగా విభజించారు.
1.Soft commodities 2. Hard commodities
Soft commodities
అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ ఈ Soft commodities లోకి వస్తాయి.
ఉదాహరణ… బియ్యం, గోదుమలు, సోయాబీన్, పసుపు, నూనె మొదలైనవి.
Hard commodities
దీనిలో రెండు రకాలు ఉన్నాయి. 1. Metal Commodities 2. Energy Commodities
Metal Commodities అంటే భూమి నుంచి తీసే మెటల్స్, మినరల్ ప్రొడక్ట్స్.
ఉదాహరణ… గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం.
Energy Commodities …
క్రూడాయిల్, న్యాచురల్ గ్యాస్, గ్యాసోలీన్ వంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి వాటిని ఎనర్జీ కమొడిటీస్ అంటారు. ఇలా సుమారుగా 50 రకాల వస్తువులు కమొడిటీస్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిలో మనం దేనిలోనైనా ట్రేడ్ చెయ్యవచ్చు.
స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చెయ్యడానికి ఎక్స్ఛేంజస్ ఎలా ఉన్నాయో కమొడిటీ మార్కెట్ లో కూడా ఎక్స్ఛేంజీస్ ఉన్నాయి. మనదేశంలో చాలా కమొడిటీ ఎక్స్ఛేంజీల్లో ఉన్నప్పటికీ MCX (Multi Commodity Exchange In India), NCdex (National Commodity& Derivatives Exchanged Ltd ) ముఖ్యమైనవి.
మెజారిటీ కమొడిటీ ట్రేడింగ్ అంతా వీటిలో జరుగుతుంది. ఈ ఎక్స్ఛేంజిల ద్వారా మనం కమొడిటీ అమ్మడం, కొనడం చెయ్యవచ్చు. అయితే అన్నీ ఎక్స్ఛేంజీలలో కమొడిటీ ట్రేడింగ్ చెయ్యడం కుదరదు. ప్రతి ఎక్స్ఛేంజీ కూడా కొన్ని ప్రత్యేకమైన కమొడిటీస్ ని ట్రేడ్ చెయ్యడానికి అనుమతి ఇస్తుంది.
- MCX లో ఎక్కువగా నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ ట్రేడ్ అవుతూ ఉంటాయి.
- Ncdex లో ఎక్కువగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ కమొడిటీ మార్కెట్ ను కూడా సెబీనే రెగ్యులర్ చేస్తుంది.
- కమొడిటీ ట్రేడింగ్ విషయానికి వస్తే దీనిలో ప్రతి కమొడిటీకి కూడా ఒక Lot size ఉంటుంది. మనం కొనాలి అనుకుంటే మొత్తం Lot అంతా కొనాలి.
what are the timings of commodity market
కమొడిటీ మార్కెట్లో టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
- ఈక్విటీ మార్కెట్లో అయితే 9.15 am- 3.30 pm వరకు ఉంటుంది. అదే కమొడిటీ మార్కెట్లో టైమింగ్స్ 9.00 am – 11.30 pm వరకు ఉంటుంది.
- నాన్ అగ్రి కమొడిటీస్ అన్ని కూడా 11.30 pm వరకు ట్రేడ్ అవుతాయి.
- International Referenceable Agri Commodities అంటే కాటన్, క్రూడ్, పామాయిల్ ఇవి 9.00 am నుంచి 9.00 pm వరకు ట్రేడ్ అవుతాయి. మిగిలిన కమొడిటీస్ అన్ని 9.00 am నుంచి 5.00 pm వరకు ట్రేడ్ అవుతాయి.
- కమొడిటీ మార్కెట్స్ Monday – Friday వరకు పనిచేస్తాయి.
- కమొడిటీ ప్రైస్ అన్ని demand and supplyపై ఆధారపడి ఉంటాయి.
- ఈ కమొడిటీ మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంటాయి. ఎందుకంటే వీటిని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. ఎలక్షన్స్, యుద్దాలు జరిగినపుడు, రుతుపవనాలు సరిగ్గా లేనపుడు,టెక్నాలజీలో వచ్చిన డెవలప్ మెంట్ వల్ల ఎలక్ట్రానిక్స్ లో ఎక్కువగా ఉపయోగించిన కాపర్ వంటి మెటల్స్ విషయంలో తీవ్ర ప్రభావం ఉంటుంది.
కమొడిటీ మార్కెట్లో ఇన్‌వెస్ట్ చేసేందుకు మనం కొన్ని రకాల ప్రత్యేక పద్ధతులను పాటించవచ్చు. ఈ కింది 5 రకాలుగా ఇన్వెస్ట్ చెయడం అనేది కొంత లాభదాయకం.
Investing in commodity ETFs
కమొడిటీ ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్ అనేది ఒకే కమొడిటీలో లేదా కలెక్షన్ ఆఫ్ కమొడిటీలో ఇన్వెస్ట్ చేసే ఫండ్. ఈ కమొడిటీ ఈటీఎఫ్ అనేవి స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అవుతూ ఉంటాయి.
Investing in commodity mutual funds
కమొడిటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి రకారకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది ఎక్స్ పర్ట్స్ అయిన ఫండ్ మేనజర్స్ వీటిని మేనేజ్ చేస్తూ ఉంటారు.
Investing in Commodity options
ఈక్విటీలో ఎలాగైతే ఆప్షన్స్ ఉంటాయో అలాగే కమొడిటీలో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ద్వారా కమొడిటీలో ట్రేడింగ్ చెయ్యవచ్చు.
Investing in commodity futures
ఈ కమొడిటీస్ ని ప్రొడ్యూస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు కమొడిటీ ప్రైస్ వల్ల వచ్చే రిస్క్ ను త్గగించుకోవడం కోసం హెడ్జింగ్ చేయడం కోసం కమొడిటీ ప్యూచర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు.
Investing in physical commodities
ఈ ఫిజికల్ కమొడిటీలో ఎక్కువగా ట్రేడింగ్ జరగదు. ఎందుకంటే ఈ కమొడిటీస్ ని ట్రాన్సఫర్ చెయ్యడం, స్టోర్ చెయ్యడం, వాటికి ఇన్సురెన్స్ చెయ్యడం వంటి ఖర్చులన్నీ ఉంటాయి.
అందువలన మనం ఇన్ని విధాలుగా కమొడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు.
కమొడిటీస్ లో ట్రేడ్ చెయ్యడం వలన లాభాలు ఏమిటి?
what are the Advantages of commodity market
Advantages : సాధారణంగా ఈక్విటీ అండ్ కమొడిటీ మార్కెట్లు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఒకటి తగ్గినపుడు మరొకటి పెరుగుతుంది. ఈక్విటీ మార్కెట్లో లాస్ వస్తున్న కమొడిటీ మార్కెట్లో అది కవర్ అవుతుంది. కాబట్టి ఈక్విటీ పోర్ట్ ఫోలియోలో రిస్క్ ను తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్ చెయ్యాలనుకుంటే కమొడిటీలో ఇన్వెస్ట్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్. ఇన్ ఫ్లేషన్ సమయంలో దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాంటి సమయంలో కమొడిటీస్ ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల కలిగే ఇంపాక్ట్ మనమీద తగ్గుతుంది.
ఒక కాంటాక్ట్ విషయంలో మొత్తం మార్జిన్ చెల్లించవలిసిన అవసరం లేదు. కమొడిటీని బట్టి 5 నుంచి 20 శాతం పే చేస్తే సరిపోతుంది. కాబట్టి చాలా తక్కువ అమౌంట్ తో కూడా ట్రేడింగ్ చెయ్యవచ్చు.
ఇందులో షేర్ ప్రైజ్ ని మేనుప్యులేట్ చెయ్యడం కుదరదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అవుతుంది.
Disadvantages
- ఇందులో వలాటిలిటీ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ట్రేడింగ్ చెయ్యకపోతే లాస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
- కొత్తగా కమొడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలనుకున్నవాళ్ళు ఎక్కువగా లిక్విడిటీ ఉండే గోల్డ్, సిల్వర్, క్రూడాయిల్ లో ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది.
- కమొడిటీస్ లో ట్రేడింగ్ చెయ్యాలంటే టెక్నికల్స్ లో కూడా మంచి పట్టు ఉండాలి.
- కమొడిటీస్ లో ట్రేడింగ్ చేస్తూ పొజిషన్స్ ని ఓవర్ నైట్ లో హోల్డ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

