![STOCK MARKET](https://www.dhanammoolam.com/wp-content/uploads/2023/03/STOCK-MARKET.webp)
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీల స్థితిగతులను బట్టి, లక్షణాల ఆధారంగా స్టాక్ లను రకరకాల పేర్లతో విభజిస్తాం. ఇన్వెస్ట్ చేసే ముందు లేదా ట్రేడింగ్ చేసే ముందు ఆ సంబంధిత స్టాక్ ఏ కోవకు చెందుతుంది.. ఏ ఉద్దేశం ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి.. మనం ఎంచుకున్న స్టాక్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి వంటి విషయాలను ఆ స్టాక్ రకాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం.
అందుకే ముందుగా స్టాక్ మార్కెట్‌లో షేర్లకు ఉండే రకరకాల పేర్లు, వాటిని ఎందుకు అలా పిలుస్తారు, వాటిని మనంఎలా వర్గీకరించగలమో వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం. ఇందులో కంపెనీ సైజును బట్టి, లాభాలను ఆధారంగా చేసుకుని, కంపెనీ సెక్టార్‌ని బట్టి, చేస్తున్న వ్యాపారాన్ని బట్టి విభజిస్తారు. ఇందులో మొదటిరకం ఏమిటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవాలి.
Market capitalization
దీనిని బేస్ చేసుకుని మొత్తం స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క కంపెనీకి ఎంతంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది అని పరిశీలిస్తారు.
రూ.20 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటే దానిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం.
రూ.5వేలు కోట్ల నుంచి రూ.2వేల కోట్ల మధ్యలో క్యాపిటల్ ఉంటే దానిని మిడ్ క్యాప్ అంటాం.
రూ.500 కోట్ల నుంచి రూ. 5000కోట్ల మధ్యలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ ఉంటే దానిని స్మాల్ క్యాప్ అంటాం.
రూ. 500 కోట్ల కంటే తక్కువగా రూ. 50 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే దానిని మైక్రో స్మాల్ క్యాప్ అంటారు. ఇలా మనకి 4 రకాల క్యాపిటల్స్ ను విశ్లేషించి మార్కెట్లో తెలియజేశారు.
LARGE CAP COMPANIES
లార్జ్ క్యాప్ కంపెనీ అనేది మంచి రెవెన్యూస్ సంపాదిస్తుంది. వాటికి మంచి క్యాష్ ప్లో ఉంటుంది. ఈ కంపెనీలు నిలకడగా వ్యాపారం చేస్తాయి. లార్జ్ క్యాప్ కంపెనీలు కొత్త వ్యాపారాల జోలికి పెద్దగా వెళ్లవు. ఉన్న వ్యాపారాన్ని బాగా నడిపించుకుని, వాటిని విస్త్రుత పరుచుకోవడమే వీరి లక్ష్యం. లార్జ్ క్యాప్ కంపెనీలకి చాలా క్యాష్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు సంపాదించుకున్న డబ్బు చాలా ఉంటుంది. వీళ్ళకి మిగతా కంపెనీస్ తో చూస్తే మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటుంది.
MID CAP COMPANIES
లార్జ్ క్యాప్ కంపెనీలకు ఉన్నంత స్థిరత్వం మిడ్ క్యాప్ కంపెనీలకి ఉండదు.
ఈ కంపెనీలు ఇంకా ఎదుగుదలకి ప్రయత్నిస్తుంటాయి. కనుక వీళ్ళకి రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది.
కొత్త వ్యాపారం వస్తుందని, అది సక్సెస్ పుల్ అవుతుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో లార్జ్ క్యాప్ కంపెనీలతో పోల్చితే రిస్క్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ మిడ్ క్యాప్ అనేవి స్మాల్ క్యాప్ కంపెనీల కంటే మంచి పొజిషన్ లో ఉంటాయి.
లార్జ్ క్యాప్ కంపెనీస్ తో చూస్తే మిడ్ క్యాప్ కంపెనీల క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉంటుంది.
SMALL CAP COMPANIES
వీళ్ళకి మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉంటుంది.
ఈ కంపెనీలలో రిస్క్ రేటింగ్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీల్లో ఇంకా ఎదుగుదలకి స్కోప్ ఎక్కువగా ఉన్నప్పటికీ, వ్యాపార వ్యూహం బెడిసి కొట్టి కంపెనీ మొత్తం తీవ్రంగా నష్టపోతుందేమోనన్న భయం కూడా ఎక్కువగా ఉంటుంది.
రిస్క్ అనేది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీల్లో ఎక్కువ.
కొత్తగా వచ్చిన ఈ కంపెనీలు మార్కెట్‌లో చాలా ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో సఫలమైతే గొప్ప కంపెనీగా ఎదుగుతుంది.. లేదంటే కనుమరుగవుతుంది.
Types of stocks based on Dividend
Dividend paying stocks & non dividend stocks
కొన్ని కంపెనీలు డివిడెండ్ ను ఇస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్ ఇవ్వకుండానే వ్యాపారం చేస్తాయి. అసలు ముందు మనం డివిడెండ్ ఇవ్వడం మంచిదా కాదా అని అర్థం చేసుకోవాలి.
డివిడెండ్ అంటే ఒక కంపెనీ సంపాదించిన లాభాల్లో కొంత వాటాను షేర్ హోల్డర్స్ కి ఇవ్వడం.
కొన్ని మంచి కంపెనీలు క్రమం తప్పకుండా డివిడెండ్‌ను ఇస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు డివిడెండ్ ఇవ్వనంత మాత్రాన అవి మంచి కంపెనీలు కాదు అని మనం చెప్పలేం. ఇక్కడ ఎందుకు డివిడెండ్ ఇవ్వడం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కంపెనీలు సంపాదించిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాపారాన్ని ఇంకా బలపర్చడానికి లేదా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఉపయోగించుకుంటే మనకి డివిడెండ్ ఇవ్వకపోయినా నష్టం లేదు. అంటే ఇక్కడ ప్రాఫిట్స్‌ని కంపెనీ అభివృద్ధికి వినియోగిస్తుంది అన్న మాట. కొన్ని మంచి కంపెనీలుగా చెప్పుకునే వాటిలో ఐటీసీ రెగ్యులర్ గా డివిడెండ్ ఇస్తూ వస్తోంది.
Types of stocks based on INVESTING STYLE
కొంతమంది ఇన్వెస్ట్ మెంట్ ని బేస్ చేసుకుని కూడా స్టాక్స్‌ను ఎనాలసిస్ చేస్తారు. అందులో కూడా రకారకాల స్టాక్స్ గురించి చెబుతూ ఉంటారు. అందులో growth stocks, value stocks, momentum investing ఇలా 3 రకాలుగా విభజించుకోవచ్చు.
GROWTH STOCKS
అంటే ప్రస్తుతానికి కంపెనీకి అంత వాల్యూ ఉండకపోవచ్చు. కాక పోతే ఈ కంపెనీ ఫ్యూచర్లో బాగా ఎదుగుతుంది, భవిష్యత్తులో ఈ స్టాక్ మంచి లాభాలు ఇస్తుందని ముందే కొంతమంది స్టాక్స్ కొనేస్తారు. అలాంటి పరిస్థితుల్లో స్టాక్ ప్రైస్ కొంచెం ఎక్కువగానే మార్కెట్లో ఉంటుంది.
VALUE STOCKS
ఈ స్టాక్స్ అనేవి నిజానికి మంచి స్టాక్స్. కంపెనీకి ఉన్న పొటన్షియల్ కన్నా ప్రస్తుతం ఆ కంపెనీ వాల్యూ చాలా తక్కవగా ఉండవచ్చు. అయితే ఆ రేటులోనే స్టాక్స్ ట్రేడ్ అయితే వాటిని వాల్యూ స్టాక్స్ అంటారు.
ఏ కంపెనీవి వాల్యూ స్టాక్స్ అవుతాయంటే ఆ కంపెనీ ఇదివరకే మంచి లాభాలు ఇచ్చి, నిలకడ గల వ్యాపారంగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత కూడా అదే విధంగా ఆ కంపెనీని మేనేజ్ చేస్తే అప్పుడు దానిని వాల్యూ స్టాక్ అంటారు.
ఈ స్టాక్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఎప్పుడొస్తాయంటే ఎక్స్ టర్ననల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. ఎందుకంటే వీళ్ళు కొత్త వ్యాపారం మొదలుపెట్టడమో లేదా బిజినెస్ ఎక్స్ పాన్షన్‌కి వెళ్లడమో వంటి చర్యలు జరిగితే మాత్రం కంపెనీ స్టాక్స్ రేట్లు పెరుగుతాయి. లేకపోతే ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉండకపోవచ్చు.
MOMENTUM INVESTING
ఇందులో 3 రకాలు ఇన్వెస్ట్ మెంట్స్ ఉంటాయి.
ఒక షేర్ ట్రెండ్ బేస్ చేసుకుని స్టాక్ లో ప్రాఫిట్స్ వస్తాయా లేదా లాసెస్ వస్తాయో అనే దాని బట్టి ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు.
momentum investing లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, మీడియమ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ఉంటుంది.
లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్ మెంట్ చేసి ఎక్కువ కాలం వదలేయడం.
మీడియమ్ టర్మ్ అంటే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు గడువు పెట్టుకుని దానిని బేస్ చేసుకుని రాబడి తెచ్చుకోవడం.
చిన్నచిన్న టైమ్ ఫ్రేంలో మనకి ప్రాఫిట్స్ రావాలి… అందులో మనం జాగ్రత్తగా ఎంచుకుని ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ను ఎంచుకుంటాం.
Types of stocks based on
ECONOMIC CYCLES
ఎకానమిక్స్ సైకిల్ బేస్ చేసుకుని కొన్ని స్టాక్స్ ని క్లాసిఫైడ్ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో ఒక కమోడిటీకి మార్కెట్ తగ్గితే దాని వల్ల స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ ప్రైస్ కూడా పడిపోతుంది. లేకపోతే కమోడిటీకి డిమాండ్ ఎక్కువ ఉంటే దాని వల్ల స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్ కూడా పెరుగుతుంది.
మార్కెట్లో డిమాండ్ ఉంటే స్టాక్స్ రేట్లు పెరుగుతాయి. మార్కెట్లో డిమాండ్ లేకపోతే స్టాక్ రేట్లు తగ్గిపోతాయి. అలాంటి స్టాక్స్ ని Cyclical stocks అంటారు.
Non cyclical stocks అంటే మార్కెట్లో డిమాండ్ కి సప్లై కి ఎటువంటి సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి రేటు ఉంటుంది. వీటిని Non cyclical stocks అంటారు. అంటే ఏ కాలానికి అయినా ఈ స్టాక్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది.
Blue chip and penny stocks
BLUE CHIP STOCKS
ఏదైనా ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉన్న పెద్ద కంపెనీని బ్లూ చిప్ కంపెనీ అంటాం. అలాంటి పెద్ద కంపెనీ స్టాక్ ని బ్లూ చిప్ స్టాక్ అంటాం. ఏ కంపెనీ అయినా బ్లూచిప్ కంపెనీ అయితే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20వేల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కంపెనీల రెవెన్యూ, క్యాష్ ప్లో, డివిడెండ్లు అన్ని చాలా పక్కగా ఉంటాయి. ఇలాంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ లో ఒక స్టేబుల్ గ్రోత్ ఉంటుంది.
PENNY STOCKS
ఏ కంపెనీలకి అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.100 కోట్ల కంటే తక్కువ ఉంటుందో వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. ఇలాంటి కంపెనీలలో మార్కెట్ ప్రైస్ రూ.10 లేదా రూ.20 రేంజ్ లో ఉంటుంది. ఈ కంపెనీలకి రిస్క్ చాలా ఎక్కువ. ఇలాంటి స్టాక్స్ లలో మనకి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చెయ్యాలి.
అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక కీలక విషయమేమిటంటే మనం ఏ ఉద్దేశంతో మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్నాం అనేది కీలకం. మన అవసరాలు, లక్ష్యాలు, మానసిక స్థిరత్వం బట్టి స్టాక్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు స్టాక్‌ల తీరు తెన్నులు కూడా మారిపోతుంటాయి.
కొద్ది కొద్ది మొత్తాలతో లాభాలను గడించుకుంటూ పోతే దీర్ఘకాలంలో మనం ఎక్కువ ఆదాయం ఉత్పత్తి చేయ గలుగుతాం.