
what is sgx nifty
SGX అంటే సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్
నిఫ్టీ అనేది మన ఇండియాకి సంబంధించినది ఇండెక్స్
మన నిఫ్టీకి సంబంధించిన ప్యూచర్ కాంట్రాక్ట్ లు సింగపూర్ స్టాక్ ఎంక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంటాయి. దీనినే SGX NIFTY అంటారు. అయితే ఇండియాలో ఉండే నిఫ్టీ కాంట్రాక్ట్ కి SGX NIFTY కాంట్రాక్ట్ కి చాలా తేడా ఉంటుంది. దీనిని బట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ గమనాన్ని అంచనా వేయవచ్చు.
* ఇండియాలో ఉండే నిఫ్టీకి 1Lot కు 75 Shares ఉంటాయి. కానీ SGX NIFTY లో అలా కాదు. ఇక్కడ లాట్ సైజ్ షేర్ల బట్టి కాకుండా యూఎస్ డాలర్ల బట్టి ఉంటుంది.
what are the timings of sgx nifty
SGX మార్కెట్ టైమింగ్స్:
మన ఇండియాలో టైమ్ కి సింగపూర్ టైమ్ కి రెండుగంటల ముప్పై నిమిషాలు తేడా ఉంటుంది.
మన ఇండియాలో 9.15AM TO 3.30 PM వరకు మార్కెట్లు ఓపెన్ చేసి ఉంటాయి.
కానీ సింగపూర్ లో చాలా ఎక్కువసేపు మార్కెట్లు ఓపెన్ చేసి ఉంటాయి. ఇక్కడ T, T+1 అనే రెండు సెషన్ లో సింగపూర్ ఎక్స్చేంజ్ ఓపెన్ లో ఉంటుంది.
మన ఇండియా టైమ్ ప్రకారం చెప్పుకుంటే
T Session : 6.30am-3.40 pm
T+1 Session: 4.10 pm-2.45 am
మన ఇండియాలో మార్కెట్లు కేవలం 6 గంటలపాటు ట్రేడ్ అవుతాయి. కానీ సింగపూర్ లో దాదాపు 20 గంటలు ఓపెన్ లో ఉంటాయి. ఇలా ఎక్కువసేపు మార్కెట్ ట్రేడ్ అవ్వడం వల్ల ఒకవేళ మన మార్కెట్ మూసేసిన సమయంలో గ్లోబల్ గా ఎటువంటి వార్త వచ్చినా SGX NIFTY రియాక్ట్ అవుతుంది. ఆ గ్లోబల్ న్యూస్ కి SGX NIFTY ఎలా రియాక్ట్ అవుతుందో దానిని బట్టి మన నిప్టీ ఎలా ఉందో అని మనం అంచనా వేస్తాం.
who are eligible to trade in sgx nifty
SGX NIFTY లో మనం ట్రేడింగ్ చేయవచ్చా?
మనం SGX NIFTY లో ట్రేడ్ చేయవచ్చా అంటే చేయలేం. SGX NIFTY లోనే కాదు ఇతర ఏ దేశాలలో కూడా మనం ట్రేడ్ చేయడానికి అనుమతి లేదు. కానీ మన దేశానికి చెందిన NRI లు ఎవరైనా ఉంటే వాళ్ళు SGX NIFTY లో ట్రేడ్ చేయవచ్చు. మరి ఎవరు SGX NIFTYలో ట్రేడ్ చేస్తారంటే ఎవరికైతే మన ఇండియాలో ట్రేడ్ చేయడానికి అనుమతి లేదో వాళ్ళు SGX NIFTY లో ట్రేడ్ చేయవచ్చు. FII లు పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ వాళ్ళు ఇండియాలో పెట్టుబడి పెట్టి ఉంటారు. అలాంటివారు వాళ్ళ పొజిషన్ హెడ్జింగ్ కోసం ఇందులో ట్రేడ్ చేస్తారు.
SGX NIFTY ని ఎక్కడ, ఎలా చెక్ చేయాలి ..?
SGX NIFTY ని ఇన్వెస్టింగ్ డాట్ కామ్, లేదా మనీ కంట్రోల్ యాప్ లో చూడవచ్చు. లేదంటే డైరెక్ట్ గా SGX .COM WEBSITE లో చెక్ చేసుకోవచ్చు.
మనీ కంట్రోల్ యాప్ లో వెంటనే అప్ డేట్ అవుతుంది.
దీనిని చెక్ చేయడానికి మన దగ్గర మనీ కంట్రోల్ యాప్ ఉంటే, ఆ యాప్ లో పైన 3 లైన్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మార్కెట్ లో గ్లోబల్ ఇండిసెస్ అనే ఆప్షన్ ఎంచుకుంటే అక్కడ SGX NIFTY ఉంటుంది.
మన మార్కెట్ క్లోజ్ అయిన టైమ్ లో కూడా SGX NIFTY ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి గ్లోబల్ న్యూస్ ని ముందే తెలుసుకోవడంతో SGX NIFTY లో ముందే మూమెంట్ ఏర్పడుతుంది. కాబట్టి చాలా మంది ట్రేడర్స్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ SGX NIFTY ని గమనించి మనం మార్కెట్లో ఎలా ఓపెన్ అవ్వవచ్చు అని అంచనా వేసుకుని మన ట్రేడర్స్ దానికి తగ్గట్టుగా ట్రేడింగ్ కి ప్రిపేర్ అవుతారు. కాబట్టి దాదాపుగా SGX NIFTY ని బట్టి మన నిప్టీ కూడా ఓపెన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాని 100 శాతం అలా ఉంటుందని గ్యారంటీ లేదు. మనం ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మన మార్కెట్లు ఓపెన్ అవ్వకముందే గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా SGX NIFTY ఎలా ఉంది చూసుకోవడం మంచిది.