
reliance in retail market
రిటైల్ విభాగంలో భారతదేశంలో రిలయన్స్ ఎదురులేని శక్తిగా మారుతోంది. ముకేష్ అంబానీ తన మార్క్ వ్యూహాలతో వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత రిటైల్ విక్రయశాలలు 39 శాతం పెరిగాయి. బహుళ బ్రాండ్ లు, డిజిటల్ కామర్స్ లో విస్తరణ సంస్థకు దోహదపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్యూచర్ రిటైల్ స్టోర్లను దక్కించుకోనుండటమూ మరింత కలిసిరావొచ్చని భావిస్తున్నారు.
biggest retail business in india
రెవెన్యూ, విక్రయశాలల పరంగా భారత్ లో అతి పెద్ద రిటైల్ సంస్థ రిలియన్సే.
ప్రస్తుతం సంస్థకు భారత్ వ్యాప్తంగా 14,412 స్టోర్ లు ఉన్నాయి. గత ఐదేళ్ళలో కంపెనీ ఆదాయం 5 రెట్లు అధికమైంది. మూల రిటైల్ ఆదాయమైన 18 బిలియన్ డాలర్లు, పోటి సంస్థల మొత్తం కన్నా ఎక్కువ కాగా, వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్) 40 శాతం అధికం. `న్యూ కామర్స్` ఆఫ్ లైన్ రిటైల్, ఇ-కామర్స్ విభాగాల్లో ఎండ్ టూ ఎండ్ వ్యూహాన్ని కంపెనీ నెలకొల్పడం మరింత లాభదాయకంగా కనిపిస్తుంది.
గ్రోసరీ రెండంకెల వృద్ధి సాధించగా, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం కూడా రెట్టింపయ్యింది. డిజిటల్/న్యూకామర్స్ మొత్తం కోర్ రిటైల్ లో 20 శాతం వాటాకు చేరాయి. కోర్ రిటైల్ లోని గ్రోసరీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు బలమైన వృద్ధి కొనసాగించాయి. నాన్ కోర్ రిటైల్ లో జియో స్టోర్లు, రిటైల్ భాగాస్వాముల వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ గణాంకాల ప్రకారం.. ఆదాయంలో గ్రోసరీ 21.2 శాతం కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ 27.4 శాతం, ఫ్యాషన్ 8.3 శాతం, జియో స్టోర్లు 34.3 శాతం, పెట్రోల్ రిటైల్ 8.7 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.