
జీవిత చరమాంకంలో పెన్షన్ పొందేందుకు ఉన్న ఒక అవకాశం అటల్‌పెన్షన్ యోజన పథకం. అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్నిప్రవేశపెట్టింది.
ఇప్పుడు అటల్ పెన్సన్ యోజన పథకానికి ఆన్ లైన్ లోనూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఎవరైనా అటల్ పెన్సన్ యోజన ఖాతాను ఓపెన్ చేయాలనుకున్నవాళ్ళు ఎటువంటి బ్రాంచ్ కి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆధార్ ఇ- కేవైసీతో ఆన్ లైన్ లో తెరవొచ్చు. ఈ పథకంలో రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
ఖాతాను ఓపెన్ చేయాలనుకున్నవాళ్ళు ఆధార్ నంబర్ ని ఉపయోగించి బ్యాంక్ ఖాతా సహకారంతో ఆన్ లైన్ లో ప్రారంభించవచ్చు. ఏపీవై ఫారంను ఆన్ లైన్ లోనే పూర్తి చేయవచ్చు. ఆన్ లైన్ ఏపీవై ఖాతాను తెరిచేటపుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, మన ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ను తప్పనిసరిగా అందించాలి. నేషనల్ పెన్సన్ సిస్టమ్ నిర్వహించే ప్రభుత్వ సంస్థ అయిన పెన్సన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ అటల్ పెన్సన్ యోజనకి రెగ్యులేటర్ గా వ్యవహరిస్తోంది.
what are the benefits of atal pension yojana
అటల్ పెన్షన్ యోజన ప్రయోజనం ఇదీ
ఈ పథకం 2015 మే 9 ప్రారంభమైంది. ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం సమాజిక భద్రతా వ్యవస్థను రూపొందించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తోంది. సామాజిక పెన్సన్ యోజన కింద రూ.1000-రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
who are eligible for atal pension yojana
ఈ పథకం పొందడానికి ఎవరు అర్హులు
* 18-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హత గల ( అసంఘటిత రంగంలో పనిచేసే) మన దేశ పౌరులందరూ అటల్ పెన్సన్ యోజనలో చందాదారులుగా నమోదు కావచ్చు.
* ఈ చందాకు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
* చందాదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ, వార్షిక ప్రాతిపదికన ఈ పెన్సన్ స్కీమ్ కి చందా ఇవ్వవచ్చు.
* చందాదారులు కొన్ని షరతులకి లోబడి స్వచ్ఛందంగా ఈ స్కీమ్ నుంచి వైదొలగొచ్చు.
* 60 ఏళ్ళ అనంతరం నెలవారీ పెన్సన్ చందాదారునికి అందుబాటులో ఉంటుంది.
* పెన్సన్ తీసుకునే వ్యక్తి చనిపోయినా అతని భార్యకి చందాదారుని 60 ఏళ్ళ వయస్సు వరకు సేకరించిన పెన్షన్ నిధిని తిరిగి ఇస్తారు.
* ఏపీవైలో దాదాపు 8 సాతం వడ్డీ రాబడి హామీ ఉంటుంది.