క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే ముఖ్యం
safety is important to credit card users
సైబర్ క్రైమ్స్ మన దేశంలో వేలల్లో జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగదారులు అత్యధికంగా ఈ మోసాల బారిన పడుతున్నారు. అయితే దీనినుంచి మనం
తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల విషయంలో బ్యాంకులు కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే. ఈ నియమాలకనుగుణంగానే వినియోగదారులకు సేవలందించాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది.
క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కరోనా సంక్షోభంలో బ్యాంకింగ్ సేవలు బాగా తగ్గాయి. కరోనా తగ్గిన తర్వాత క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఇంతకుముదు 5 కోట్ల మంది క్రెడిట్ కార్డ్స్ వాడేవారు. ఇప్పుడు 7 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. అయితే ఇక్కడ కన్జూమర్ ప్రొటక్షన్ కే అత్యంత ప్రధాన్యమని ఆర్‌బీఐ చెబుతోంది.
what are new rules to credit card companies
ఆర్బీఐ ఏమి చేసిందంటే…
* మనం క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయగానే మనకి కార్డ్ వచ్చేస్తుంది. కానీ ఆ కార్డును యాక్టివేట్ చేయడానికి మన రిజిష్టర్ మొబైల్ నెంబర్ నుంచి మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ను టైప్ చేసి సంబంధిత బ్యాంక్ నెంబర్ కి పంపిస్తే ఓటీపీ వస్తుంది. మనం ఆ ఓటీపీతోనే కార్డ్ ను యాక్టివేట్ చేసుకోవాలి. దీనివలన మనం సేఫ్.
* మనం కొత్త కార్డు తీసుకోగానే ఇంతకు ముందు బ్యాంకుల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రెడిట్ బ్యూరో ఇన్ఫర్మేషన్ కొత్త బ్యాంకులకు వెంటనే డీటైల్స్ షేర్ చేస్తుంది. కాని ఇప్పుడు అలా కాదు. మనం ఆ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ కార్డును మనం పర్సనల్ గా ట్రాన్జాక్షన్ చెయ్యాలి. మనం ట్రాన్జాక్షన్ చెయ్యనంత వరకూ మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అప్పటి వరకూ వేరే బ్యాంకులతో పంచుకునే అవకాశం మనకి లేదు.
* 0 శాతం ఈఎమ్ఐ… అంటే మనం ఒక వస్తువును ఈఎమ్ఐ ద్వారా తీసుకున్నపుడు మనకి బ్యాంక్ ఇంటరెస్ట్ కూడా వేస్తుంది. అయితే ఆ వడ్డీ వివరాలు వేరేగా స్టేట్ మెంట్ లో ఉండేవి కాదు. కానీ ఇపుడు బ్యాంక్స్ ఆ ఛార్జస్ ను క్లియర్ గా స్టేట్ మెంట్ లో తెలియజేయాలి.
* మనం బ్యాంక్ కి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినపుడు అది రిజక్ట్ అయ్యిందని మనకు మేసేజ్ పంపిస్తారు. కానీ ఆ అప్లికేషన్ ఎందుకు రిజక్ట్ అయ్యిందో బ్యాంక్స్ మనకి క్లియర్ గా తెలియజేయాలి.
* కస్టమర్ కొన్ని ప్రత్యేక కారణాలతో క్రెడిట్ కార్డ్ ను క్లోజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తే దానిని 7 రోజుల లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఒక వేళ 8వ రోజు నుంచి కార్డ్ యాక్ట్వేట్ లో ఉంటే రోజుకి రూ.500 చొప్పున కస్టమర్ కి బ్యాంక్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* కొంతమంది క్రెడిట్ కార్డ్ అప్లై చేసి ఆ కార్డ్ వచ్చిన తర్వాత ఉపయోగించరు. అలా సంవత్సరం పాటు వాడకుండా ఉంటే వాళ్ళకి ఒక సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది..
* బ్యాంక్ వాళ్ళు ఏవైనా కొత్త ఛార్జస్ మొదలుపెట్టాలనుకున్నపుడు 30 రోజుల ముందు ఆ కస్టమర్ కి ఒక కొరియర్ లేదా ఈమెయిల్ లేదా మేసేజ్ అయినా ఇవ్వాలి. మేము మీ కార్డ్ పై కొత్త ఛార్జస్ వెయబోతున్నాం అని తెలియజేయాలి. కస్టమర్ కి నచ్చితే కొనసాగిస్తారు. లేదా క్లోజ్ చేసేస్తారు.
Leave a Reply