what are position opening, square off, short selling..? పొజిషన్ ఓపెనింగ్, స్కేర్ ఆఫ్, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..?
what is square off
స్టాక్ మార్కెట్‌లో నిత్యం ట్రేడింగ్ చేసేవారు కొన్ని కనీస విషయాలను తెలుసుకోవాలి. అందులో ప్రధానమైనవాటిని ఓ సారి చూద్దాం..
* మార్కెట్లో మనం ఎంటర్ అవ్వడాన్నే పొజిషన్ ఓపెనింగ్ అంటారు.
* మార్కెట్ నుంచి ఎక్జిట్ అవ్వడాన్ని స్కేర్ ఆఫ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ పద్దతిని ఉపయోగిస్తారు. మనం మార్కెట్లో ఇంట్రా డే కోసం ఎదో ఒక స్టాక్ ను కొన్న తర్వాత లాభమైనా నష్టమైనా దానిని అదే రోజు అమ్మేయాల్సి ఉంటుంది. ఇలా ట్రేడ్ ని క్లోజ్ చేయడాన్ని స్క్వేర్ ఆఫ్ అంటాం . మార్కెట్లో స్క్వేర్ ఆఫ్ సమయం సాయంత్రం 3.20 నిమిషాలు. ఈ సమయం లో మనం ట్రెడ్ ని క్లోజ్ చెయ్యక పోతే సిస్టం ఆటోమేటిక్ గా ట్రేడ్ ని క్లోజ్ చేస్తుంది.
* మార్కెట్లో బై బటన్ క్లిక్ చేసి ఎంటర్ అయితే దానిని లాంగ్ స్ట్రేటజీ అంటారు.
* మార్కెట్ కొద్దిగా పెరిగిన తర్వాత క్లోజ్ చేసిన దానిని ప్రోఫిట్ బుకింగ్ అంటారు.
* మన అకౌంట్ లో మనీ ఉంటే మన దగ్గర స్టాక్స్ లేకపోయినా మనం అమ్మవచ్చు. అలా స్టాక్స్ లేకుండా అమ్మేదానిని షార్ట్ సెల్లింగ్ అంటారు. మళ్ళీ తిరిగి ఆ పొజిషన్ ని కవర్ చేయడాన్ని షార్ట్ కవరింగ్ అంటారు.
* నష్టాలను పరిమితం చేయడానికి ఉపయోగించే ఒక పధ్ధతి స్టాప్ లాస్.
what are benefits of stoploss
స్టాప్ లాస్ బెనిఫిట్స్(benifits of stop loss)
స్టాప్ లాస్ పెట్టినపుడు మార్కెట్ అక్కడికి వస్తేనే ఎక్జిక్యూట్ అవుతుంది. దీనినే ట్రిగ్గర్ ప్రైస్ అంటారు. సాధారణంగా లాస్ ని కట్ చేసుకోవడం కోసం, ప్రోఫిట్ ని మినిమైజ్ చేసుకోవడం కోసం, ప్రాఫిట్ ప్రొటక్షన్ కోసం సెల్లింగ్ చేసేటపుడు స్టాప్ లాస్ వాడుతాం. మనం లైవ్ లో లేని ప్రైస్ కోసం మనం ఆర్డర్ ఇచ్చినపుడు, ముందు అక్కడికే వస్తే ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పడాన్ని స్టాప్ లాస్` బై’ లేదా `సెల్’ అంటారు.
* అర్జెంట్ గా మనం కొనాలంటే మార్కెట్ ఆర్డర్ వాడుకోవచ్చు. ప్యూచర్ లో వచ్చే ప్రైస్ కి మనం అమ్మాలంటే, లేదా కొనాలంటే స్టాప్ లాస్ ఆర్డర్ వాడుకోవాలి.
Leave a Reply