
power sector is good to invest
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు దూసుకుపోతోంది. ఇక భవిష్యత్తు అంతా పర్యావరణ హితం కోరుకునే కంపెనీలదే కానుంది. ఈ నేపథ్యంలో పవర్ సెక్టార్‌లోని కంపెనీలు మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. దీంతో ఈ స్టాక్స్‌కు డిమాండ్ పెరుగుతుంది.
TATA power is best to invest
టాటాపవర్ ది బెస్ట్..
పవర్ సెక్టార్లో పనిచేస్తున్న కంపెనీల్లో ప్రధానమైనది టాటా పవర్. చక్కని గ్రోత్ అవకాశం ఉన్న కంపెనీ ఇది. టాటా పవర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మనం టాటా పవర్ లో దీర్ఘకాలంలో పోర్ట్ ఫోలియో చేసుకుంటే మంచి రిటర్న్స్ రావచ్చు. కరెంట్ ప్రైస్ కూడా ఇంతకు ముందు మిస్ అయినవాళ్ళు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కోల్ ప్రైస్ తగ్గించింది. కోల్ ప్రైస్ తగ్గించడం వల్ల మనీ సేవ్ అవుతుంది. సోలార్ ఎనర్జీ బాగా వచ్చిన తర్వాత రూప్ సోలార్ పేనల్స్ మీద పెట్టి కరెంట్ తియ్యడం అందరికీ సాధ్యమవుతుంది. దానిని మళ్ళీ పవర్ కంపెనీలకి అమ్మడం వీలవుతుంది. మొత్తంమీద ఇండియన్ పవర్ సెక్టార్స్ అన్నింటిలో మంచిగా ఉన్న స్టాక్స్ టాటాపవర్. మన ఇండియాలో ఈ కంపెనీ తన ఫ్యూచర్ గ్రోత్ కోసం చాలా పెట్టుబడి పెడుతోంది. అయితే ఈ కంపెనీతో పాటు రిలయన్స్, అదానీ గ్రూప్ఫ్, టాటా మోటార్స్… ఇలా మరికొన్ని కంపెనీలు ఈ సెక్టార్లో పెట్టుబడులు అధికంగా పెడుతున్నాయి.
long term investment in power sector is more profitable
లాంగ్ టర్మ్ లో లాభాలు..
టాటా మోటార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వస్తాయా అనే సందేహం అందరికీ కలగవచ్చు. ఇప్పటి వరకూ చూసుకుంటే టాటా మోటార్స్ అంత గొప్ప లాభాలను ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ నడుపుతున్న ఎలక్ట్రికల్ బస్సులన్నీ టాటా మోటార్స్ కు చెందినవి కావడంతో ఈ కంపెనీపై ఆశలు పెరుగుతున్నాయి. టాటా గ్రూప్ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పవర్ సెక్టార్ కి సంబంధించి క్లీన్ ఎనర్జీ, సోలార్ సిగ్మెంట్ మీద పెద్ద ఎత్తున వర్క్ చేస్తోంది.