
మనం స్టాక్ తీసుకునేటప్పుడు సాధారణంగా అది ఎంత లాభదాయకంగా ఉంది, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తోంది అన్న విషయాలను చూస్తాం. చాలా లాభాలను ఇస్తోంది కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనని అనుకుంటాం. కానీ అంత లాభాలను ఇచ్చిన కంపెనీ షేర్ ధర ఎంత వరకు పెరిగిందో అన్న విషయాన్ని మనం గమనించం. ఎంతైనా పర్వాలేదు కొనేద్దాం, లాభాలు వస్తున్నాయి కదా, ఇంకా షేర్ ప్రైస్ పెరుగుతుందిలే అనుకుంటాం. కానీ అలా అనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఆ షేర్ ఎంత ఎక్స్పెన్సివ్‌గా ఉందో గుర్తించగలగాలి.
when to buy a stock
ఒక షేర్ పెరిగితే ఎందుకు పెరిగింది.. ఎందుకు తగ్గింది అనే విషయాలను చూడటం చాలా ముఖ్యం. ఆ కంపెనీ మార్కెట్ వేల్యూ, ప్రాఫిట్, భవిష్యత్తు లో పెరిగే అవకాశం.. ఇలా అనేక అంశాలు ప్రభావం చేస్తాయి. ఆ కంపెనీ న్యూస్ కూడా షేర్ ప్రైస్ ని ప్రభావితం చేస్తాయి. ఆ సెక్టార్ లాభదాయకత, మార్కెట్ ట్రెండ్ కూడా ఇందులో భాగమే. ఇవన్నీ చూసాకే మనం ట్రేడ్ తీసుకోవాలి. అప్పుడే లాభాలను పొందగలుగుతాం.
is IT sector is better to invest
ఇప్పుడు ఐటీ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో టీసీయస్ ఫ్రాఫిట్ 10,000కోట్లు. సంవత్సరం మొత్తం మీద 40,000 కోట్ల వెల్త్ క్రియేట్ చేసింది. కొత్తగా 30,000 ఉద్యోగాలను కూడా ఇచ్చారు. అలాగే ఇన్ఫీ కూడ మంచి ఫలితాలు ఇచ్చింది. గత సంవత్సరం అందరి కంటే ఎక్కువగా రిక్రూట్ చేసుకున్న సెక్టార్ కూడా ఐటీ కావడం విశేషం. కానీ మొత్తం మీద చూసుకుంటే ఈ సెక్టార్ చాలా ఎక్స్ పెన్సివ్ జోన్ లో ఉంది. ఇప్పటి వరకూ కొద్ది కాలంగా ఐటీ బాగా పుంజుకుని షేర్ ధర బాగా పెరిగింది. 34 PEలో ఐటీ నిఫ్టీ సెక్టార్ ట్రేడ్ అవుతుంది. హిస్టారికల్ డేటా చూసుకుంటే చాలా ఎక్కవ ధర. హిస్టారికల్ డేటా ప్రకారం ఐటీ ఎప్పుడూ స్థిరంగా లేదు. ఐటీ ఫలితాలు బాగున్నాయని స్టాక్స్ కొనేయకుండా కొద్దిగా వెయిట్ చేస్తే మంచిది. ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్లో రిస్క్ ప్రొఫైల్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ డబ్బును సేఫ్టీ అసెట్స్ కి మూవ్ చేస్తున్నారు. వాలటాలిటీ అప్ ట్రెండ్ లో ఉంది. గోల్డ్ అప్ మూడ్ లో ఉంది. అయితే ఐటీ ఎక్స్ పెన్సివ్ జోన్ లో ఉంది. కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. PE చాలా ఎక్కువ కాబట్టి తక్కువ ధర వచ్చినపుడు కొనుక్కొవడం ఉత్తమం. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా హెల్దీ ఎకానమీ లేదు.