జూన్ నుంచి `ఆకాశ్ ఎయిర్స్` * 66 వేల కోట్లతో ప్రారంభిస్తున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా
విమానయానానికి క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇండియాలో ప్రజలు ఇప్పడిప్పుడే విమానాల్లో ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. సమయం ఆదా కావడం, చార్జీలు కూడా మరీ అధికంగా లేకపోవడంతో సాధారణ ప్రజలకు కూడా విమానాలు చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో కొత్త కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్ బాద్‌షా, బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. `ఆకాశ్ ఎయిర్` బ్రాండ్ కింద ఎస్ఎన్ వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ల డాలర్లు(సుమారు రూ. 66వేల కోట్లు) గా ఉందని ప్రకటించినట్టు మనం ఇదివరకే విన్నాం.
5 ఏళ్లలో 72 విమానాలు..
ఇప్పడు ఈ బిగ్‌బుల్ జూన్ నుంచి విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సమయంలో ` ఆకాశ ఎయిర్ ‘ కార్యకలాపాలను జూన్ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఈ సంవత్సరం దుబాయ్ లో జరిగిన సైడ్ లైన్స్ ఆఫ్ వింగ్స్ ఇండియా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే 5 ఏళ్ళలో 72 ఆకాశ ఎయిర్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందామని తెలిపారు. అంతే కాదు తమ వద్ద 18 విమానాలు ఉండగా.. ఏడాదికి 12 నుంచి 14 విమానల్ని సేవల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకున్నట్లు దుబే చెప్పారు. ఇలా 5ఏళ్ళలో మొత్తం 72 విమానాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆకాశ ఎయిర్ లైన్ సేవల్ని మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో, మెట్రో సిటీస్ నుంచి మరో మెట్రో సిటీలకు సర్వీసులు ఉంటాయని ఆకాశ ఎయిర్ లైన్ సీఈవో తెలిపారు.
Leave a Reply