
స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలంటే మనలాంటి సాధారణ వ్యక్తులకు చాలా కష్టమైన పని. మార్కెట్‌ను నిరంతరం వాచ్ చేస్తూ , ఫాలో అవుతూ ఉండాలి. దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. టైం కూడా ఎక్కువ అవసరం. కానీ మనం వేరే పని, లేదా ఉద్యోగంలో ఉంటే ఇలా చేయడం కుదరదు. మన పని, ఉద్యోగం కొనసాగిస్తూ అదనంగా ఫ్రీ టైంలో అప్పుడప్పుడు మార్కెట్‌లో ఉండాలనుకునేవారు మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకోవాల్సిందే. ఇన్వెస్ట్ చేయాలంటే అంత సమయం అక్కర్లేదు. మార్కెట్ బాగా పడినప్పడు మనం ఎంచుకున్న మంచి స్టాక్స్‌లో కొంచెం కొంచెం డబ్బులు పెడుతూపోవడమే. మరి దీనికి మనం ఎలాంటి స్ట్రాటజీ ఎంచుకోవాలో, ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలో ఓ సారి చూద్దాం.
ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండి, బలమైన మేనేజ్‌మెంట్లో ఉన్న పెద్ద కంపెనీలను ఎంచుకోవాలి. వాటి ప్రొడక్ట్స్‌కు డిమాండ్ ఉండి, ఆదరణ ఉంటే వాటిని సురక్షితమైన కంపెనీలుగా భావించవచ్చు. అటువంటి వాటిని ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైనవిగా భావించవచ్చు.
ఇక్కడ కొన్ని సెక్టార్‌కు చెందిన స్టాక్స్‌ను పరిశీలిద్దాం.
1. ఎవర్‌గ్రీన్ సెక్టార్..ఐటి
ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ముందు ఉండేది టీసీఎస్. కరోనా సంక్షోభం నుంచి తట్టుకొని నిలబడిన High and Grow కంపెనీ. ప్రపంచంలోనే తిగురులేని కంపెనీ ఇది. మనం మొదటి స్టాక్ కింద టీసీఎస్‌ను ఎంచుకోవచ్చు.
2. నిత్యావసరాల రంగం (ఎఫ్.ఎమ్.సీ.జీ)
మనుషులకు నిత్యం అవసరం ఉండే వస్తువులను తయారు చేసే రంగం ఎఫ్.ఎం.సీ.జీ. ఇంటి అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులను తయారు చేసే కంపెనీలల్లో ది బెస్ట్ ఐ.టీ.సీ. ఇండియాలో ఇప్పటి వరకు 100 శాతం ఫర్ఫార్మెన్స్ లో ఉన్నకంపెనీ ఇది. ఏటా సుమారు 4.5 శాతం డివిడెండ్ ఇస్తోంది. ప్రతి 6 సంవత్సరాలకు బోనస్ షేర్లను ఇస్తుంది. ఇండియాలో ఇది బెస్ట్ కంపెనీగా చేప్పవచ్చు. అంతే కాకుండా ఈ కంపెనీ ఇప్పడు ఆకర్షణీయమైన ధరకే దొరుకుతుంది.
3.మెటల్స్ రంగం
గృహ నిర్మాణాలకు అవసరమైన ప్రధాన ముడి సరకు ఐరన్. భారీ నిర్మాణాలకు, పరికరాల తయారీకి అవసరమయ్యే ఉక్కు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఉక్కు కంపెనీల్లో ది బెస్ట్ సెయిల్(ఎస్.ఏ.ఐ.ఎల్). ఇది మెటల్స్ సీజనల్ స్టాక్. కరోనా కాలంలో కొంచెం తగ్గినా, తర్వాత బాగా పెరిగేందుకు అవకాశం ఉన్న స్టాక్ ఇది.
4. ఆటోమోబైల్ సెక్టారు…
ఇప్పడు మోటార్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. కార్లు నిత్యావసరమైంది. అందరూ వీటి వాడకానికి అలవాటు పడ్డారు. అందుకే ఈ రంగానికి విపరీతమైన డిమాండ్. అలాంటి కార్ల తయారీలో ఉన్న గొప్ప కంపెనీ టాటా మోటర్స్. ఇప్పడు ఎలక్ట్రికల్ వెహికల్స్ హవా నడుస్తోంది. వీటిని కూడా టాటా మోటార్స్ ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అన్ని కాంపోనెంట్స్ టాటా గ్రూప్‌లోనే దొరుకుతాయి. కాబట్టి తన ఓన్ ఇంటిగ్రేషన్స్ తో తయారు చేసుకోవచ్చు.
5. టెలికాం..
జోబులో రూపాయి లేకపోయినా ఫోన్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పడు అలా తయారైంది టెక్నాలజీ. అత్యంత అవసరంగా మొబైల్ మారిపోయింది. ఈ రంగానికి ఇప్పడు తిరుగులేదు. టెలికం సర్వీసులను అందించేవి అతి కొద్ది కంపెనీలే ఉండడం మరింత విశేషం. అందులో భారతీ ఎయిర్ టెల్ ముఖ్యమైనది. ఈ సంవత్సరం 5జీ ని మొదలుపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న డేటా కన్నా 10 టైమ్స్ ఎక్కువ డేటా వినయోగం భవిష్యత్తులో పెరుగుతుంది. కాబట్టి చాలా స్కోప్ ఉన్న కంపెనీ.
ఈ స్టాక్స్ లో నెలనెలా కొంచెం మొత్తం పెట్టుకుంటూ పోతే పెరగడం ఖాయం. ఇలా ట్రై చేయండి.
ఇక్కడ మేం చెప్పిన స్టాక్స్ కేవలం ఒక సమాచారం కోసం ఇచ్చినవే. మీరు ఇన్వెస్ట్‌చేసే ముందు పూర్తి స్థాయిలో స్టడీ చేసి, మీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న, మీకు అర్థమైన తరువాతే ఇన్వెస్ట్ చేయండి. అడ్వైజర్ సలహాలను తీసుకోండి.
Inka konni stocks
sure..thankyou