
మనం స్టాక్ మార్కెట్‌కి సూట్ అవుతామా లేదా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. మార్కెట్ అంటే అదృష్టం అనుకునేవాళ్లు.. లేదా అదో జూదం అనుకునేవాళ్లు సైతం లాభాలు వస్తాయంటే ఆగలేరు. కానీ ఆ లాభాలు స్థిరంగా సంపాదించగలమా..? అసలు మనం స్టాక్ మార్కెట్‌కు సరిపోతామా లేదా..? స్టాక్ మార్కెట్‌లోనే ఉండాలి అనుకుంటే ఎలా అనే సందేహాలకు సమాధానం ఏంటో ఓసారి చూద్దాం.
స్టాక్ మార్కెట్‌లో అత్యంత కీలకమైనది మన మనస్సే. ట్రేడింగ్ చేసేటప్పడు, ఇన్వెస్ట్ చేసేటప్పడు మన మనసును మనం అదుపులో పెట్టుకోవడం చాలా కీలకం. లాభాలు వచ్చినప్పడు పొంగిపోయి మరన్ని ఎక్కువ ట్రేడ్‌లు చేస్తే మనం నష్టాల్లోకి వెళ్తాం. ట్రేడింగ్‌లో నష్టాలు వచ్చినప్పడు ఆగకుండా ఎలాగైనా లాభం పొందాలని రివెంజ్ ట్రేడ్ చేస్తే మరన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ రెండు సందర్భాలలోనూ మనపై మనకు నియంత్రణ లేకపోవడమే కారణం. ఇలాంటి ధోరణి స్టాక్ మార్కెట్‌లో సరికాదు. ఇలాంటి వ్యక్తిక్వం ఉన్న వారు దీర్ఘకాలం స్టాక్ మార్కెట్‌లో ఉండలేరు. ఆలోచన, క్రమశిక్షణ, భావోద్వేగాలపై నియంత్రణ ఉన్న వారు మాత్రమే మార్కెట్‌లో లాభాలను చూడగలుగుతారు.
స్థిరత్వం తప్పనిసరి
CONSISTENCY IS IMPORTANT IN STOCK MARKET
స్టాక్ మార్కెట్‌లో స్థిరత్వం( consistency) చాలా కీలకం. ఇక్కడ నిలకడగా ఉంటూ నిత్యం క్రమంగా ట్రేడ్ చేయగలిగితే దీర్ఘకాలంలో లాభాలను పొందగలుగుతాం. మార్కెట్ ఒడిదొడుకులను క్షుణ్ణంగా పరిశీలించాలి. మార్కెట్ బాగున్నప్పడు ట్రేడ్ చేయడం, మార్కెట్ బాగా పడినప్పుడు ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు టెక్నికాలిటీస్, స్ట్రాటజీస్ వాడి ప్రాఫిట్ తీసుకోవడం లాంటివి చేయగలగాలి. అంటే వీటన్నింటిలోనూ మనం వాస్తవాన్ని అంగీకరించాలి. మార్కెట్ ఎలా ఉందో చూసి, దానికి తగ్గట్టుగా మన ఆలోచన, నిర్ణయాలను మార్చుకోవాలి. అంతేకానీ మనకు నచ్చిందే ఎప్పడూ చేస్తేమంటే కుదరదు. క్రమ శిక్షణతో ఉన్నప్పుడే ఏ విజయమైనా సాధ్యమవుతుంది.
ట్రేడింగ్ లో మనకి ఏ ప్రొడక్ట్స్ సూట్ అవుతుంది.. ఏ ట్రేడ్ సెటప్ లో బాగా లాభాలు పొందగలుగుతున్నాం.. ఏ ఇన్వరాన్ మెంట్ లో మన పెర్ఫార్మెన్స్ బాగుంది.. ఇవన్నీ తెలుసుకుని ట్రేడ్ మెంటైన్ చేస్తూ ఉంటే కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మన బలహీనతలను తగ్గించుకోవాలి. మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. బలాలను పెంచుకోవాలి. మనకి సూట్ అయ్యే విధానంపై ఫోకస్ చేయడం మంచిది.
మార్కెట్ కదలికలే కీలకం
MARKET MOVEMENTS ARE THE KEY
మనం ఎప్పుడైనా ట్రేడ్ చేయాలనుకున్నపుడు మార్కెట్లో కదలికలను పరిశీలించి ఎంటర్ అవ్వడం మంచిది. మార్కెట్లో కదలికలు లేనపుడు మనం ఎంటర్ అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మంచి ట్రేడ్స్ ఎప్పుడూ అంత సులభంగా దొరకవు. దీనికి చాలా సహనం ఉండాలి. మార్కెట్ ఎప్పుడూ మొదట ఫైనాన్సియల్ కన్నాపైనున్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా స్ట్రాంగ్ గా ఉండి, నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటే మార్కెట్ మూమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా మన వ్యక్తిత్వాన్ని బట్టి ట్రేడ్ చేయడం మంచిది.
HOW TO MAINTAIN TRADE BOOK
ట్రేడ్ బుక్ నిర్వహించండి
మనకి ట్రేడ్స్ వల్ల పెద్దగా ప్రోఫిట్ రాకపోతే మనం ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏవరేజ్ గా సంవత్సరానికి 15-16 శాతం రిటర్న్స్ ఇస్తాయి. మనం ఎక్కువసార్లు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినపుడు ఫెయిల్ అయితే దానిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువమంది ట్రేడింగ్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం ట్రేడ్ జనరల్ మెంటైన్ చేయలేకపోవడం. మనం ట్రేడ్ జనరల్ మెంటైన్ చేస్తే మన బలహీనత అర్థం అవుతుంది. ఒకరోజు ముందే ట్రేడ్ చేయాలనుకున్నవాటిని పిక్ చేసుకోవాలి. బెస్ట్ ట్రేడ్ సెటప్, బుల్ ట్రేడ్ సెటప్ తీసుకుని వాటిని లిస్ట్ లో పెట్టుకుని, ఎక్కువ కాకుండా 5 లేదా 8 స్టాక్స్ పై ఫోకస్ పెట్టాలి. అందులో నిప్టీ ఏ వైపు ఉంటే ఆ వైపు ట్రేడ్ చేసుకోవాలి. అందులో పొజిషన్స్ చాలా ముఖ్యం. మనం ఎప్పుడు ఎలా చేస్తున్నాం అనేది ట్రేడ్ బుక్‌లో రాసుకోవాలి.
* మనకున్న మనీలో 20శాతం లేదా 30 శాతం ట్రేడింగ్ కి ఉపయోగిస్తే మంచిది. ఎందుకంటే దాన్ని రిస్క్ మేనేజ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని తక్కువ సైజ్ తీసుకోవడం, మార్కెట్ కండిషన్ పడిపోతున్నపుడు తక్కువ ట్రేడ్స్ తీసుకోవడం, మార్కెట్ మనకి ఫేవర్ గా ఉన్నప్పుడు అగ్రెసివ్ గా ఉండడం అవసరం.
* మనం ట్రేడ్ లో ఎంటర్ అయినపుడు పూర్తిగా ట్రేడింగ్ గురించి తెలుసుకుని ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్స్ ప్లాప్ అయినపుడు కూడా ఎందుకు ప్లాప్ అయిందో అర్థమవుతుంది. ఇన్నీ చేసినా ట్రేడింగ్ లో మనకి ప్రోఫిట్ రాకపోతే మనకి ఆ ట్రేడింగ్ సూట్ అవ్వడం లేదు అని అర్థం. అప్పుడు మనం పొజిషన్ ట్రేడింగ్ లో ఎంటర్ అవ్వవచ్చు. అది సూట్ అవ్వకపోతే మన వ్యక్తిత్వానికి ఏది సూట్ అవుతుంది, ఎలా చెయ్యాలి, ఎంత రిటర్న్స్ ఇస్తుందో దానిపై ఫోకస్ చెయ్యాలి.
* ఎక్కడ మనకి మనీ వస్తుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. దీర్ఘకాలం మార్కెట్లో ఉండటం, క్యాపిటల్ ప్రొటక్షన్ ముఖ్యం. మన నాలెడ్జ్, అనుభవం, మెట్యూరిటీ లెవల్స్ బట్టి దీనిని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. వలటాలిటీ అధికంగా ఉన్న టైమ్ లో ట్రేడింగ్ చేయడం చాలా కష్టం.
స్టాక్ మార్కెట్‌లోకి తొందరపడి రావొద్దు
DONT RUSH INTO THE STOCK MARKET
మార్కెట్ పై ఆధారపడి జీవనాధారం పొందాలనుకున్నవారు అలాంటి ఆలోచనను విరమించుకోవడం మంచిది. ఈ విషయంలో తొందరపడడం కరె క్ట్ కాదు. మనం చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారాన్ని వదులుకోవడం అమాయకత్వమే అవుతుంది. మనం చేస్తున్న పనిని కొనసాగిస్తునే కనీసం మూడేళ్లయినా స్టాక్ మార్కెట్‌లను క్షణ్ణంగా పరిశీలించాలి. మార్కెట్ బేసిక్స్, టెక్నిక్స్ ను పూర్తిగా నేర్చుకోవాలి. కొంతకాలం పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఆ తర్వాత కొంత అమౌంట్ పెట్టి రఫ్ గా ట్రేడింగ్ చేయాలి. దాంతో వచ్చిన లాభాలను బేరీజు వేసుకుని చూడాలి. అలా స్థిరంగా కొంత మొత్తాన్ని లాభాల రూపంలో మనం కనీసం సంవత్సరకాలమైనా పొందగలిగినట్టయితే అప్పడు స్టాక్ మార్కెట్‌పై మనం నమ్మకం పెట్టుకోవచ్చు.