స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒకే దిశలో కదలదు. ఎప్పుడో ఒకప్పుడు అది పడిపోవాల్సిందే. కానీ ప్రతి కరెక్షన్ వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి పతనం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. తాజాగా నిఫ్టీ పడిపోవడం, పెట్టుబడిదారులలో (How to Invest When the Nifty Is Down) ఆందోళన కలిగించింది. అయితే ఈ పరిస్థితిని ఒక సాధారణ పెట్టుబడిదారుడు ఎలా చూడాలి? భయంతో బయటకు రావాలా? లేక దీన్ని ఒక బంగారు అవకాశంగా మలుచుకోవాలా? అనే ప్రశ్నకు సమగ్ర అవగాహన అవసరం.
నిఫ్టీ పతనం వెనుక గ్లోబల్ కథ.. Global Story Behind Nifty Fall
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా వంటి దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం, టెక్ ఖర్చులు తగ్గడం, జియోపాలిటికల్ టెన్షన్స్ పెరగడం వంటి అంశాలు మార్కెట్‌పై ఒత్తిడి(How to Invest When the Nifty Is Down) తెస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు (FIIs) తమ పెట్టుబడులను ఉపసంహరించు కోవడం వల్ల భారత మార్కెట్‌పై మరింత ప్రభావం పడుతోంది. ఇది ఒక దేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కరెక్షన్ దశలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ కూడా దాని ప్రభావాన్ని అనుభవిస్తోంది.
వాల్యువేషన్స్ నుంచి వాస్తవానికి ప్రయాణం.. From Valuations to Reality
కోవిడ్ తర్వాత మార్కెట్ అత్యధిక స్థాయికి చేరుకుంది. చాలా కంపెనీలు వారి వాస్తవ విలువలకంటే ఎక్కువ ధరలకు ట్రేడ్ అయ్యాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు. ఒక దశలో మార్కెట్ వాస్తవానికి తిరిగి వస్తుంది. ఇప్పుడే అదే జరుగుతోంది. అధిక వాల్యువేషన్స్ క్రమంగా తగ్గుతూ, కంపెనీల నిజమైన ఎర్నింగ్స్ ఆధారంగా మార్కెట్ సర్దుబాటు అవుతోంది. దీనినే కరెక్షన్ అంటారు.
చరిత్ర చెబుతున్న గట్టి సందేశం.. History Sends a Strong Message
మార్కెట్ చరిత్ర చూస్తే ప్రతి పెద్ద పతనం తర్వాత భారీ వృద్ధి కనిపించింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, 2020 కోవిడ్ పతనం.. తర్వాత పెద్ద బుల్ రన్‌లకు దారితీశాయి. అప్పుడు భయంతో బయటకు వెళ్లిన వారు నష్టపోయారు. కానీ ధైర్యంగా నిలిచిన వారు, ఇంకా పెట్టుబడులు పెట్టిన వారు భారీ లాభాలు పొందారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు తీసింది. వర్క్ ఫ్రమ్ హోమ్, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ—ఇలా అన్ని రంగాల్లో ఐటీ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2021–22 మధ్యకాలంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో వంటి కంపెనీలకు ఆర్డర్‌బుక్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. పెట్టుబడిదారులు కూడా ఈ వేగాన్ని భవిష్యత్తులో కొనసాగుతుందని ఊహించి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సమయంలో ఐటీ కంపెనీల పీఈ రేషియోలు 35 నుంచి 40 రెట్లు దాకా పెరిగాయి. ప్రైస్ టు బుక్, పీఈజీ రేషియోలు కూడా అత్యధిక స్థాయికి చేరాయి. కానీ వాస్తవానికి ఎర్నింగ్స్ గ్రోత్ మాత్రం అంతగా పెరగలేదు.
వాల్యువేషన్ బుడగ పగిలిందా? Burst of Valuation Bubble
కోవిడ్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కంపెనీల ఖర్చులు పెరిగాయి. డిమాండ్ కొంత స్థిరపడింది. ఈ సమయంలో ఐటీ కంపెనీల ఎర్నింగ్స్ పెరుగుదల మందగించింది. కానీ మార్కెట్ మాత్రం ఇంకా అధిక వాల్యువేషన్స్‌తోనే ట్రేడ్ అవుతుండటంతో సవరణ తప్పలేదు. 2024 చివర్లో 46,000 పాయింట్ల వద్ద ఉన్న నిఫ్టీ ఐటీ సూచీ, 2026 ఫిబ్రవరి నాటికి 30,000 పాయింట్లకు పడిపోయింది. అంటే దాదాపు 35 శాతం కరెక్షన్. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో ప్రధాన భాగం అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచే వస్తుంది. ఇటీవల అమెరికాలో టెక్ ఖర్చులను తగ్గించడం ప్రారంభమైంది. కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ఆలస్యం చేయడం, ఖర్చులను తగ్గించడం మొదలుపెట్టాయి. దీంతో భారత ఐటీ కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గాయి. రెవెన్యూ గ్రోత్ మందగించింది. అదే సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడం వల్ల మార్జిన్లు కూడా తగ్గాయి. ఒకప్పుడు 27–28 శాతం ఉన్న మార్జిన్లు 22–23 శాతానికి పడిపోయాయి.
పడిపోతున్న మార్కెట్‌లో పెట్టుబడి వ్యూహం.. Investment Strategy in Falling Markets
మార్కెట్ పడిపోతున్నప్పుడు(How to Invest When the Nifty Is Down) ఒకేసారి మొత్తం డబ్బు పెట్టడం ప్రమాదకరం. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ బాటమ్ వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే దశలవారీగా పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ప్రతి కరెక్షన్‌లో కొంతకొంతగా పెట్టుబడి పెడితే సగటు ధర తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఇది మంచి రాబడులు ఇస్తుంది. ఇది సాధారణంగా SIP (Systematic Investment Plan) రూపంలో చేయవచ్చు.
క్వాలిటీ స్టాక్స్—సురక్షిత మార్గం.. Quality Stocks: The Safer Route
మార్కెట్ పడిపోతున్నప్పుడు(How to Invest When the Nifty Is Down) అన్ని స్టాక్స్ చౌకగా కనిపిస్తాయి. కానీ అన్ని మంచి అవకాశాలు కావు. కాబట్టి కంపెనీ ఫండమెంటల్స్ చాలా ముఖ్యమైనవి. లాభదాయకత, అప్పుల స్థాయి, మార్కెట్ లీడర్‌షిప్ .. ఇవన్నీ పరిశీలించాలి. మంచి కంపెనీలు తాత్కాలికంగా పడిపోయినా, దీర్ఘకాలంలో తిరిగి ఎదుగుతాయి.
సెక్టార్‌ల మార్పు—పెట్టుబడిదారులకు కీలకం.. Sector Rotation Matters
మార్కెట్‌లో (How to Invest When the Nifty Is Down)ప్రతి సమయంలో అన్ని రంగాలు ఒకేలా ప్రదర్శించవు. కొన్ని సెక్టార్లు పడిపోతే, మరికొన్ని పెరుగుతాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకే సెక్టార్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్. విభిన్న రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌ను తగ్గించవచ్చు.
సిప్—పడిపోతే మరింత లాభం.. SIP: More Powerful in Downturns
మ్యూచువల్ ఫండ్స్‌లో SIP పెట్టుబడులు మార్కెట్ పడిపోతున్నప్పుడు (How to Invest When the Nifty Is Down)ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి. తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు కొనుగోలు అవుతాయి. మార్కెట్ మళ్లీ పెరిగినప్పుడు ఇవే ఎక్కువ లాభాలను ఇస్తాయి. కాబట్టి SIP ఆపకుండా కొనసాగించడం మంచిది.
ఏఐ, టెక్నాలజీ ప్రభావం.. Impact of AI and Technology
ప్రస్తుతం మార్కెట్‌పై (How to Invest When the Nifty Is Down) మరో పెద్ద ప్రభావం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కొన్ని రంగాలకు అవకాశాలను తెస్తే, మరికొన్ని రంగాలకు సవాళ్లు సృష్టిస్తోంది. పెట్టుబడిదారులు ఈ మార్పులను గమనించి, భవిష్యత్తు అవకాశాలున్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతాయని, కంపెనీలు దెబ్బతింటాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఉదాహరణకు గిట్‌హబ్ కోపైలట్ వంటి టూల్స్ ఉపయోగించే డెవలపర్లు 50 శాతం వేగంగా పని పూర్తి చేస్తున్నారు. అంటే తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయగలుగుతున్నారు. ఇది కంపెనీల ఖర్చులను తగ్గిస్తుంది. అయితే అదే సమయంలో క్లయింట్లు కూడా ఈ టూల్స్‌ను ఉపయోగించి తమ పనులను స్వయంగా చేసుకునే అవకాశం ఉంది. ఇది ఔట్‌సోర్సింగ్ డిమాండ్‌ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. భారత ఐటీ రంగాన్ని broadly నాలుగు విభాగాలుగా చూడవచ్చు. పెద్ద కంపెనీలు స్థిరంగా ఉన్నా, వృద్ధి మందగించవచ్చు. ఇంజినీరింగ్ సేవలు ఇతర రంగాలపై ఆధారప డతాయి. మిడ్ , స్మాల్ క్యాప్ కంపెనీలు ప్రత్యేక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలు ఎక్కువ రిస్క్‌తో పాటు అధిక రాబడులు ఇవ్వగలవు. ఈ విభాగాలన్నింటిలోనూ ఏఐ ప్రభావం వేర్వేరు విధాలుగా కనిపిస్తుంది.
ఏఐ మార్కెట్‌లో భారత్ స్థానం.. India’s Position in AI Market
ప్రపంచ ఐటీ మార్కెట్ విలువ లక్షల కోట్లలో ఉండగా, భారత ఐటీ రంగం వాటా తక్కువగానే ఉంది. కానీ వృద్ధి అవకాశాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ రంగంలో 2030 నాటికి భారీ వృద్ధి అంచనా వేస్తున్నారు. ఇది భారత కంపెనీలకు ఒక పెద్ద అవకాశం. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. లక్షలాది ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయి.
ఐటీ రంగం కుదేలైందా?.. లేక కొత్త దశకు నాందా? IT Sector Crash or Transition to a New Phase?
ఒకప్పుడు పెట్టుబడిదారుల(How to Invest When the Nifty Is Down) కలల రంగంగా నిలిచిన ఐటీ సెక్టార్… ఇప్పుడు సందేహాల మబ్బుల్లో కూరుకుపోయింది. గత నెలలోనే నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 20 శాతం క్షీణించడం మార్కెట్‌లో కలకలం రేపింది. 2008 తర్వాత ఇంత పెద్ద పతనం ఒకే నెలలో కనిపించడం ఇదే మొదటిసారి. మొత్తం మార్కెట్ విలువలో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఈ పరిస్థితి చూస్తే “ఐటీ రంగం కుదేలైందా?” అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. కానీ మరో కోణంలో చూస్తే ఇది ఒక సహజ సవరణా? లేక కొత్త మార్పులకు నాంది పలుకుతున్న సంకేతమా? అన్నదే అసలు చర్చ.
ఇన్వెస్టర్లకు సూచనలు.. What Should Investors Watch
మార్కెట్‌లో (How to Invest When the Nifty Is Down) విజయానికి కేవలం జ్ఞానం సరిపోదు. మనస్తత్వం కూడా చాలా ముఖ్యం. భయం, ఆశ.. ఈ రెండింటిని నియంత్రించాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడకుండా, పెరుగుతున్నప్పుడు అతిగా ఆశపడకుండా ఉండగలిగితేనే విజయవంతమైన పెట్టుబడిదారుగా మారగలం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల రీత్యా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం ధరలు పడిపోయాయని చూసి పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. కంపెనీల ఎర్నింగ్స్, మార్జిన్లు, ఆర్డర్‌బుక్, ఏఐ అడాప్షన్ వంటి అంశాలను విశ్లేషించాలి. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీల పనితీరు కీలకం. ముఖ్యంగా ఏఐ ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? ఉద్యోగుల ఉత్పాదకత ఎలా మారుతోంది? వంటి అంశాలు నిర్ణాయకం.
పడిపోవడంలోనే దాగి ఉన్న అవకాశాలు .. Opportunities Hide in Downturns
నిఫ్టీ పడిపోవడం అనేది పెట్టుబడిదారులకు ఒక పరీక్ష. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ సంపదను నిర్ణయిస్తాయి. భయంతో బయటకు వెళ్లేవారు అవకాశాలను కోల్పోతారు. కానీ సహనంతో, సరైన వ్యూహంతో ముందుకు వెళ్లేవారు దీర్ఘకాలంలో విజయం సాధిస్తారు. మార్కెట్ పడిపోతే అది ముగింపు కాదు… కొత్త ప్రారంభం. అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఐటీ రంగ పరిస్థితిని కేవలం సంక్షోభంగా చూడటం సరైంది కాదు. ఇది ఒక మార్పు దశ. అధిక వాల్యువేషన్స్ నుంచి వాస్తవిక స్థాయికి చేరుకోవడం, కొత్త టెక్నాలజీలను స్వీకరించడం .. సహజ ప్రక్రియలు. పేషన్స్ ఉన్న పెట్టుబడిదారులకు ఇది ఒక అవకాశం కావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవు. మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతుంది. ఆ మార్పులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగినవారే చివరకు విజయాన్ని అందుకుంటారు.

