
1956లో కేవలం రూ.5 కోట్లతో మొదలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) ప్రస్తుతం సుమారు రూ.16 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వైన బీమా సంస్థలో ఒకటిగా మారింది. పూర్తిగా ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ ఐ సీని భారత ప్రభుత్వం ఐపీవోకి తీసుకువస్తుండడంతో దేశంలో అందరూ ఇప్పుడు దీనికోసమే చర్చించుకుంటున్నారు. ఐపీవో తర్వాత మార్కెట్ విలువ రూ.22.1 లక్షల కోట్లు అవుతుందని అంచనా.
when will lic ipo is coming
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ మార్చి 10వ తేదీ నుంచి 14వతేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా..
ఐపీవో ప్రారంభం- మార్చి 10
ముగింపు- మార్చి 14
ఇష్యూ ధర – రూ. 2 వేల నుంచి 2100
షేర్ల సంఖ్య- 31,62,49,885
షేర్ల విలువ- రూ. 65416 కోట్లు
రాయితీ – ఎల్ ఐ సీ ఉద్యోగులకు, పాలసీ దారులకు 10 శాతం
ఉద్యోగులు, పాలసీ దారులకు 1,890 రూపాయలకు షేరు ధర ఉండవచ్చు.
లాట్ సైజ్- 7 షేర్లు (ఎవరైనా ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక లాట్ తీసుకోవాలి. ఏ ఐపీవోకైనా ఒక లాట్ తీసుకునేందుకు సుమారు రూ. 14వేల నుంచి 15వేల వరకు అవసరం అవుతుంది)
how many shares to policy holders in lic ipo
* ఎల్ఐసీకి 283 మిలియన్ల పాలసీదారులు ఉన్నారు. వీరికి 3.16 కోట్ల షేర్లను కేటాయించే అవకాశం ఉంది. పదిశాతం డిస్కౌంట్ తో ఎల్ఐసీ తమ పాలసీదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో అనేక మంది పాలసీదారులు ఈక్విటీలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
* ఎల్ఐసీలో ప్రభుత్వానికి వంద శాతం వాటా ఉంది. ఇందులో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను ఐపీవో ద్వారా విక్రయిస్తుంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్లరంలో రూ.78 వేల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* ఎల్ఐసీ ఐపీవో ఇష్యూలో పాలసీదారులు తమ పాన్ నెంబర్ ను ఎల్ఐసీ పాలసీఖాతాకు అనుసంధానం చేయాలి. డీమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి.
పబ్లిక్ ఇష్యూకు రానున్న ఎల్ ఐ సీ అందుకు సంబంధించిన అన్ని పత్రాలను సెబీకి సమర్పించింది. మార్చిలో ఐపీవోకు రానున్న ఎల్ ఐ సీ 5 శాతం వాటాను విక్రయించి అందుకు సమానమైన 31.6 కోట్లపైగా షేర్లను విక్రయించనుంది. ఇందులో షేరు ముఖ విలువ రూ.10 గా నిర్ణయించింది. ఇందువల్ల రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరుతాయని అంచనా. దేశంలో అతి పెద్ద ఇష్యూ గా ఎల్ ఐ సీ నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ( ఓఎఫ్ఎస్) రూపంలో జరగనుంది.
how many shares are issued by lic in ipo
ఈ సంవత్సరంలో వాటాల విక్రయం ద్వారా సమీకరించాలనుకున్న మొత్తం అంచనాలను రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78,000 కోట్లకు ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం సమీకరణ ఎల్ఐసీ ఐపీవో ద్వారా సాధ్యం కానుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. ఎల్ఐసీ విలువ రూ.16 లక్షలకు పైగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎల్ఐసీ ఐపీవో ఇష్యూలో 10 శాతం పాలసీదార్లకు, 5 శాతాన్ని సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తారు. వీటికి షేరు ధరలో ఎంత రాయితీ ఇస్తారో నిర్ణయించలేదు.
what is the net worth of lic
ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనకు కంపెనీ బోర్డు అంతకు ముందే ఆమోదం తెలిపింది.
ఐపీవో తరువాత ఎల్ఐసీ మార్కెట్ విలువ 293 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22.1 లక్షల కోట్లు) అవుతుందనే అంచనాలున్నాయి. దీనిద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన నమోదిత జీవిత బీమా సంస్థగా ఎల్ఐసీ నిలవనుంది.