రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ఇప్పటికే అమెరికా నుంచి 50 శాతం సుంకాల భారం మోస్తున్న భారత్‌కు మరో పెద్ద సవాల్ ఎదురైంది. ఇరాన్‌తో వ్యాపారం ( Iran Trade) చేసే దేశాలపై 25 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో… భారత్‌పై మొత్తం సుంక భారం 75 శాతం వరకు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇది కేవలం వాణిజ్య అంశమే కాదు… భారత వ్యూహాత్మక ప్రయోజనాలు, సరఫరా గొలుసులు, చమురు భద్రత, ప్రాంతీయ అనుసంధానం అన్నింటినీ తాకే కీలక పరిణామంగా మారింది.
ట్రంప్ టారిఫ్‌ల వెనుక రాజకీయ గణితం.. Trump’s Tariff Politics
డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచి ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో వాణిజ్య యుద్ధాలకు తెరలేపుతున్నారు. చైనా, యూరోప్, మెక్సికో, కెనడా… ఇప్పుడు ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలే లక్ష్యంగా కొత్త టారిఫ్‌లను ప్రకటించారు. ఇరాన్ ( Iran Trade) విషయంలో అమెరికా వైఖరి మరింత కఠినంగా మారింది. అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ప్రభావం, ఇజ్రాయెల్ భద్రత.. ఈ మూడు అంశాలే ట్రంప్ నిర్ణయానికి మూలం. ఇరాన్‌తో వాణిజ్యం అంటే ప్రత్యక్షంగా కాకపోయినా… పరోక్షంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లేనని ట్రంప్ భావిస్తున్నారు.
భారత్–ఇరాన్ వాణిజ్య బంధం.. India–Iran Trade Relations Explained
ఇరాన్–భారత్ సంబంధాలు ( Iran Trade) కొత్తవి కావు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన సాంస్కృతిక, వాణిజ్య బంధం ఇది. రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా ఈ సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు. వాణిజ్య గణాంకాలు (2024–25) ప్రకారం.. భారత్ ఎగుమతులు: 1.24 బిలియన్ డాలర్లు, భారత్ దిగుమతులు: 0.44 బిలియన్ డాలర్లు. మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం: 1.68 బిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీలో రూ.15,000 కోట్లకు పైమాటే.
భారత్ నుంచి ఇరాన్‌కు ఏం వెళ్తుంది? Indian Exports to Iran
( Iran Trade) భారత్ వ్యవసాయ, ఫార్మా, రసాయన రంగాలకు ఇరాన్ కీలక మార్కెట్. బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. వీటిలో అత్యధిక వాటా సేంద్రియ రసాయనాలదే (Organic Chemicals). వీటి విలువ: 512.92 మిలియన్ డాలర్లు. ఈ రంగంపై టారిఫ్‌ల ప్రభావం నేరుగా భారత కెమికల్ ఇండస్ట్రీపై పడే అవకాశం ఉంది.
ఇరాన్ నుంచి భారత్‌కు దిగుమతులు.. Imports from Tehran
( Iran Trade) ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చే వస్తువులు పరిమితమే అయినా… కొన్ని రంగాల్లో కీలకం. పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్ ముడి పదార్థాలు, పండ్లు, ఎండుఫలాలు, నట్స్, ముఖ్యంగా పిస్తా వంటివి ప్రధానంగా దిగుమతులుగా ఉన్నాయి. 2024–25లో పిస్తా, ఇతర నట్స్ దిగుమతులు విలువ 311.60 మిలియన్ డాలర్లు. తాజా పరిణమాలతో ఈ దిగుమతులపై ప్రభావం కన్నా… భారత్ నుంచి వెళ్లే ఎగుమతులపై సుంక భారం ఎక్కువగా ఉండనుంది.
75 శాతం సుంక భారం తప్పదా? Will India Face 75% Tariffs?
( Iran Trade) ఇది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న పెద్ద ప్రశ్న. ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా భారత్ ఇప్పటికే 50% సుంకాలు భరించాల్సి వస్తోంది. ఇరాన్‌తో వాణిజ్యం కొనసాగితే మరో 25% అదనపు టారిఫ్‌ల భారం పడుతుంది. మొత్తంగా 75% టారిఫ్ భారం పడే అవకావం ఉంది. ఇది అమలైతే… భారత ఎగుమతులు అమెరికా మార్కెట్లో పోటీ కోల్పోతాయి. లాభాలు తగ్గుతాయి. కొన్ని ఉత్పత్తులు పూర్తిగా మార్కెట్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
ఏ రంగాలపై ఎక్కువ ప్రభావం? Sectors at Maximum Risk
1. ఫార్మా రంగం : భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాలు పెరిగితే ధరలు పెరుగుతాయి… పోటీ తగ్గుతుంది.
2. కెమికల్స్ & ఆర్గానిక్ ఇండస్ట్రీ : ఇరాన్‌కు భారీగా ఎగుమతి అయ్యే ఈ రంగం… డబుల్ షాక్ ఎదుర్కొనే అవకాశం ఉంది.
3. అగ్రి ఎగుమతులు: బియ్యం, చక్కెర వంటి ఉత్పత్తులపై లాభ మార్జిన్లు ఇప్పటికే తక్కువ. సుంకాలు పెరిగితే వ్యాపారం నిలిచిపోయే పరిస్థితి.
చాబహార్ పోర్ట్ భవితవ్యం? Chabahar Port Under Threat
( Iran Trade) ఇరాన్‌తో భారత్ సంబంధాల్లో అత్యంత కీలక ప్రాజెక్ట్ చాబహార్ పోర్ట్. మధ్య ఆసియాకు భారత్ గేట్‌వే. పాకిస్తాన్‌ను దాటించి ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ చేరే మార్గం ఇది. గతంలో అమెరికా ఈ పోర్ట్‌కు మినహాయింపులు ఇచ్చింది. కొన్నిసరుకుల సరఫరాలకు అనుమతించింది కానీ తాజా టారిఫ్‌లతో… ఆ మినహాయింపులు కొనసాగుతాయా? ప్రాజెక్ట్ నెమ్మదిస్తుందా?అనే అనిశ్చితి నెలకొంది.
భారత్–అమెరికా ట్రేడ్ డీల్ పై మబ్బులు… India–US Trade Deal in Trouble?
గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు జరుగుతున్నాయి. సుంకాల తగ్గింపు, మార్కెట్ యాక్సెస్ సరఫరా గొలుసు బలోపేతమే ప్రధాన లక్ష్యం. కానీ తాజా ట్రంప్ నిర్ణయంతో చర్చలు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు కూడా పెరగనుందాం.
సుప్రీంకోర్టు తీర్పే కీలకం.. US Supreme Court Verdict: A Turning Point?
ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లకు చట్టబద్ధత ఉందా? అన్న ప్రశ్నపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. తీర్పు ట్రంప్‌కు వ్యతిరేకంగా వస్తే.. అమెరికా వందల బిలియన్ డాలర్లు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. టారిఫ్ పాలసీ మొత్తం కూలిపోవచ్చు.
ట్రంప్ హెచ్చరిక.. Trump’s Warning to the Court
“టారిఫ్‌లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే… అమెరికా తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది. పెట్టుబడులు తగ్గుతాయి. ఫ్యాక్టరీలు రావు. జాతీయ భద్రతకు ఇది కీలకం.” అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్‌కు ముందున్న దారి ఏంటి? What Are India’s Options?
1. దౌత్య చర్చలు: అమెరికాతో డిప్లమాటిక్ లెవెల్లో మినహాయింపుల ప్రయత్నం
2. మార్కెట్ డైవర్సిఫికేషన్: యూరోప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వైపు ఎగుమతులు పెంచడం
3. దేశీయ విలువ జోడింపు: హై–వాల్యూ ఉత్పత్తులపై దృష్టి
మొత్తంగా ఇరాన్‌తో వ్యాపారం, రష్యా చమురు, ట్రంప్ టారిఫ్‌లు… ఇవన్నీ విడివిడిగా కనిపించినా… భారత్‌కు ఇది ఒకే పెద్ద వ్యూహాత్మక పరీక్ష. వాణిజ్య ప్రయోజనాలా? లేదా జాతీయ ప్రయోజనాలా? ఈ రెండింటి మధ్య సమతూకమే రాబోయే రోజుల్లో భారత ఆర్థిక దిశను నిర్ణయించనుంది.
