కుటుంబానికి Financial Security ఇవ్వడంలో టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance) పాత్ర ఎంతో కీలకమైంది. మనం లేకపోయినా మన కుటుంబం రోడ్డున పడకుండా, అప్పుల పాలు కాకుండా గౌరవంగా బతకడానికి ఇది ఒక రక్షణ కవచం. అయితే, ఈ పాలసీ తీసుకునేటప్పుడు చాలామంది ఒకే ఒక ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతుంటారు.
“ప్రీమియం తక్కువే కదా.. ఒకేసారి 85 ఏళ్లకు లేదా 100 ఏళ్ల వరకు పాలసీ తీసుకుందాం” అని అనుకుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల ప్రకారం (Term Insurance) ఇది చాలా తప్పుడు నిర్ణయం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎన్నేళ్ల వరకు ఉండాలి? 100 ఏళ్ల వరకు ఎందుకు తీసుకోకూడదు? అనే విషయాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా, ఉదాహరణలతో సహా ఇప్పుడు చూద్దాం.
టర్మ్ ఇన్సూరెన్స్ అసలు ఉద్దేశం ఏంటి? What is the Purpose of Term Insurance?
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి కాదు, అది కేవలం ఒక రక్షణ (Term Insurance) మాత్రమే. మీరు సంపాదిస్తున్నంత కాలం, మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. మీరు రిటైర్ అయ్యాక, పిల్లలు సెటిల్ అయ్యాక, మీపై ఎలాంటి అప్పులు లేనప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆ వయసులో మీకు Income Replacement (ఆదాయ భర్తీ) చేయాల్సిన అవసరం ఉండదు.
100 ఏళ్ల వరకు పాలసీ ఎందుకు వేస్ట్ ..Why 100 Years Term Plan is a Bad Idea?
చాలామంది 100 ఏళ్ల వరకు పాలసీ తీసుకుంటే “ఎలాగూ చనిపోతాం కదా.. నామినీకి రూ. 1 కోటి వస్తుంది” అని Parental Property లాగా ఆలోచిస్తారు. ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీల మార్కెటింగ్ మాయాజాలంలో చిక్కుకుంటారు.
దీనివల్ల జరిగే నష్టాలు ఇవే:
High Premium (ఎక్కువ ప్రీమియం): 60 లేదా 65 ఏళ్ల వరకు తీసుకునే పాలసీతో పోలిస్తే, 85 లేదా 100 ఏళ్ల వరకు తీసుకునే పాలసీకి ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది.
Inflation (ద్రవ్యోల్బణం): ఈ రోజు రూ. 1 కోటి విలువ చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ, మీకు 90 ఏళ్లు వచ్చినప్పుడు ఆ రూ. 1 కోటి విలువ నేటి రూ. 10 లక్షలతో సమానం అవుతుంది. దానివల్ల మీ కుటుంబానికి పెద్దగా ఉపయోగం ఉండదు.
Financial Liabilities (ఆర్థిక బాధ్యతలు): 60 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల చదువులు పూర్తవుతాయి, పెళ్లిళ్లు అయిపోతాయి, హోమ్ లోన్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఆ వయసులో ఇన్సూరెన్స్ కోసం ఎక్కువ ప్రీమియం కట్టడం వృథా.
ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం
రమేశ్ (వయసు 30 ఏళ్లు):
రమేశ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నాడు. అతనికి భార్య, ఒక బాబు ఉన్నారు. హోమ్ లోన్ రూ. 40 లక్షలు ఉంది. రమేష్ రూ. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు. అతని ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి.
ఆప్షన్ 1 (స్మార్ట్ డెసిషన్): 60 ఏళ్ల వయసు వరకు (అంటే 30 ఏళ్ల టర్మ్) పాలసీ తీసుకున్నాడు. దీనికి వార్షిక ప్రీమియం సుమారు రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు ఉంటుంది.
ఆప్షన్ 2 (పొరపాటు నిర్ణయం): 100 ఏళ్ల వయసు వరకు పాలసీ తీసుకున్నాడు. దీనికి వార్షిక ప్రీమియం సుమారు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు ఉంటుంది.
60 ఏళ్లు వచ్చేసరికి రమేష్ బాబు పెద్దవాడై ఉద్యోగంలో సెటిల్ అవుతాడు. హోమ్ లోన్ పూర్తిగా తీరిపోతుంది. రమేశ్ రిటైర్మెంట్ ఫండ్ కూడా రెడీ అవుతుంది. 60 ఏళ్ల తర్వాత రమేశ్ చనిపోయినా అతని భార్య కొడుకుపై లేదా రిటైర్మెంట్ ఫండ్‌పై ఆధారపడగలదు. కాబట్టి 60 ఏళ్ల తర్వాత ఇన్సూరెన్స్ అవసరం లేదు.
ఆప్షన్ 1 ఎంచుకోవడం వల్ల రమేష్ ఏటా రూ. 15,000 వరకు ప్రీమియం ఆదా చేశాడు. ఆ మిగిలిన డబ్బును Mutual Funds (SIP) లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్లలో పెడితే, 60 ఏళ్లు వచ్చేసరికి అది కొన్ని లక్షల రూపాయల పెద్ద ఫండ్‌గా మారుతుంది.
మరి ఎన్నేళ్ల వరకు పాలసీ తీసుకోవాలి? What is the Ideal Policy Term?
సింపుల్ రూల్.. మీ విరమణ వయసు (Retirement Age ) వరకు లేదా మీకు 60 నుండి 65 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 65 ఏళ్లు దాటిన తర్వాత టర్మ్ ప్లాన్ కొనసాగించడం ఆర్థిక సూత్రాలకు విరుద్ధం.
ఏ పాలసీ బెటర్
ఎస్బీఐ లైఫ్ – స్మార్ట్ షీల్డ్ పాలసీ (SBI Life – Smart Shield Plan)
భారతదేశంలో అత్యంత నమ్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన SBI Life Smart Shield ఒక పాపులర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సామాన్యులకు (Term Insurance) తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ పాలసీ ముఖ్య ఫీచర్లు (Key Features):
Affordable Premium: తక్కువ ప్రీమియానికే పెద్ద మొత్తంలో Life Cover (భీమా మొత్తం) లభిస్తుంది.
Flexibility: ఈ పాలసీలో మీ అవసరాలకు తగ్గట్టుగా రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి:
Level Term Assurance: పాలసీ కాలపరిమితి మొత్తం భీమా మొత్తం (Sum Assured) ఒకేలా ఉంటుంది.
Increasing Term Assurance: ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ఏటా భీమా మొత్తం 5% చొప్పున పెరుగుతూ పోతుంది.
Riders (అదనపు ప్రయోజనాలు): అదనపు ప్రీమియం చెల్లించి Accidental Death Benefit Rider లేదా Accidental Total & Permanent Disability Rider వంటివి ఎంచుకోవచ్చు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇది కుటుంబానికి అదనపు ఆర్థిక సాయం అందిస్తుంది.
Tax Benefits: ఆదాయపు పన్ను చట్టం Section 80C ప్రకారం మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే నామినీకి వచ్చే డెత్ బెనిఫిట్ సొమ్ముపై Section 10(10D) కింద పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది.
ఇంకా HDFC LIFE, TATA AIA, AXIS MAX వంటి అనేక మంచి కంపెనీలు మరెన్నో మంచి టెర్మ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుని మంచి పాలసీని తీసుకోవడానికి ప్రయత్నించండి.
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు లేని సమయంలో మీ కుటుంబానికి ఇచ్చే Financial Protection (ఆర్థిక రక్షణ). కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉందని 80 లేదా 100 ఏళ్ల వరకు (Term Insurance) పాలసీ తీసుకోకండి. మీ రిటైర్మెంట్ వయసు (60-65 ఏళ్లు) వరకే పాలసీ పరిమితిని లాక్ చేసుకోండి. మిగిలిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయండి. పాలసీ తీసుకునే ముందు Claim Settlement Ratio (CSR) మరియు మీ కుటుంబ ఖర్చులను లెక్కించుకుని సరైన నిర్ణయం తీసుకోండి.
-స్రవంతి అతికం
ఇన్స్యూరెన్స్ అడ్వైజర్
9440012834
